ఈమధ్య సైంటిస్టులు ఒకటి కనుగొన్నారు, పవరులోలేని రాజకీయనాయకులలో ఒకరకమయిన మానసిక రుగ్మత ఉంటుందని. దీనిపై వేర్వేరు నాయకుల వ్యాఖ్యలు ఇలా వున్నాయి.
రాజశేఖరరెడ్డి: “ఇది పురుషుల్లో వుంటే దాన్ని ‘రాజీవ్ రోగం’ అనీ, స్త్రీ లలో వుంటే దాన్ని ‘ఇందిరమ్మ వ్యాధి’ అని పిలవాలి. స్లం లను అన్ని కలుపుకొని ‘డిసీజ్ కారిడార్’ ఎర్పాటు చేస్తున్నారు”.
అద్వానీ : “పోటా చట్టం తేవాలి, లేకపోతే ఇటువంటి రుగ్మతలే వస్తాయి”.
చంద్రబాబు : “భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక ముఖ్య మంత్రి మాట్లాడవలసిన మాటలేనా ఇవి? వై.యస్ రాజీనామా చేయాలి”.
కొసమెరుపు:
విలేఖరుల సమావేశం అయిపోయాక కారులో వెళ్తూ చంద్రబాబు తన పి.ఏ ని అడిగారు. “ఇంతకీ టాపిక్ ఏంటి, నేను ఎందుకు తిట్టినట్టు?” అని.
మిగతా రాజకీయనాయకుల వ్యాఖలు మీ కామెంట్స్ లో…
