దిల్ సే …

సెప్టెంబరు 27, 2007

అమృతం

ప్రచురించిన వర్గము నాతో నేను, సరదాకి — శ్రవణ్ @ 11:53 పూర్వాహ్నం

మనసు చిలికి అమృతాన్ని పంచాలనుకున్నా…

ఇన్నాళ్ళ పరిచయంలో ఇదా నువ్వు నన్ను అర్థంచేసుకుంది?

ఐఫోను

ప్రచురించిన వర్గము మీతో నేను, సాఫ్టువేరు — శ్రవణ్ @ 9:54 పూర్వాహ్నం

my prediction…
ఐఫోను india కీ చాలాదూరంలో యేమీలేదు. hutch vodafone గా మారడమే దీని indication. ఈ మధ్య వీళ్ళు GPRS monthly rental  లేకుండా ఇచ్చి load టెస్టు చేస్తున్నట్టున్నారు.

సెప్టెంబరు 26, 2007

అలా జరిగింది

ప్రచురించిన వర్గము unbiased, నాతో నేను — శ్రవణ్ @ 3:23 అపరాహ్నం

అక్కడ ఒక ఆక్సిడెంటు జరిగింది. ఎటు చూసినా రక్తం, కొంత కాషాయం రంగులో, కొంత తెల్లటి తెలుపు, మరి కొంత ఆకుపచ్చ.

దేవుడా, ఇంతకీ నీ అసలు పేరేంటి? రాముడా, అల్లానా, యెహోవానా?

సెప్టెంబరు 25, 2007

Cricket is our religion (too)

ప్రచురించిన వర్గము క్రికెట్, మీతో నేను, రాజకీయాలు — శ్రవణ్ @ 12:53 అపరాహ్నం

మొత్తానికి నాకు ఒకందుకు సంతోషంగా వుంది. ఒక అనవసరపు రచ్చ మరుగున పడిపోయింది.

నిన్నటి దాకా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఒక పెద్దాయన బ్యాచ్‌కీ, ఆ నోట్లో నాలుకని తెగ్గొయ్యమన్న ఇంకొక పెద్దాయన బ్యాచ్‌కీ సమానంగా సంతోషాన్ని పంచింది నిన్నటి క్రికెట్ మ్యాచ్‌లో విజయం.

మనకింత సంతోషంగా వుందికదా! If I am right, వాళ్ళీపాటికి “ఈ దరిద్రులు ఎందుకు గెలిచార్రా? ఎంత కష్టపడి ఒక ఇష్ష్యూ క్రియేట్ చేశాం” అని తెగ బాధపడుతుంటారు.

ఇటువంటివాళ్ళని యేమి చెయ్యాలి? మీరేమంటారు?

ఇలా జరిగింది

ప్రచురించిన వర్గము సరదాకి — శ్రవణ్ @ 12:40 అపరాహ్నం

మన Yo!man ఒకసారి ఒక హోటల్ కెళ్ళాడు. వెయిటర్‌తో “Yo!man… I want a…a…a… ” అంటూ ఆలోచనలో పడ్డాడు.

వెయిటర్ వాడి మొహానొక “Yo!” తగలేశాడు.

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.