దిల్ సే …

సెప్టెంబరు 6, 2007

కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా …

ప్రచురించిన వర్గము మీతో నేను, రాజకీయాలు — శ్రవణ్ @ 4:13 అపరాహ్నం

“కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా కాదేదీ కవితకనర్హం” ఇది పెద్దాయన శ్రీశ్రీ చెప్పిన మాట.

“ఊరేగింపూ, వరదముంపూ, చెత్తకంపూ కాదేదీ రాజకీయానికనర్హం” ఇది ఈనాటి రాజకీయనాయకులు చెప్పే మాట. “ఏంటీ చెత్త గోల?” అంటారా… గోల కాదండీ బాబూ, నిజ్జంగా నిజం. నేను చెప్పేది మన పక్క రాస్ట్రంలోని చెన్నయ్ రాజకీయనాయకుల గురించి.

“రోడ్డు మీద చెత్త పేరుకుపోయింది” పదండి clean చేద్దాం అని పది మంది నడుం కడితే, “ఆయ్, మాకు చెప్పకుండా clean చేస్తారా?” అని పోలీసులు వాళ్ళని అరెస్టు చేశారు. ఇది ఒక వెర్షను.

 జనాలు చెప్పుకునే ఇంకో వెర్షను ఏమిటంటే…

పవర్లో ఉన్న పార్టీ మారేప్పటికి “చెత్త” కాంట్రాక్టు అస్మదీయులకు పోయింది. ఆగ్రహించిన పాత చెత్తవాడు కుండీలు sharpగా కాంట్రాక్టు పూర్తి అయ్యిన రోజే తీసుకెళ్ళాడు. కొత్త చెత్త వెధవ ఇంకా కుండీలే కొనలేదు. కానీ కంట్రాక్టుకు మాత్రం అప్లయ్ చేశాడు. ఇంకేముంది? A.C రూముల్లో ఉండే ప్రతిపక్షనాయకులకి ఒక్కసారిగా “చెత్త ప్రేమ” పుట్టుకొచ్చింది.

మన రాస్ట్రంలో రాజకీయనాయకులే నయమేమో?

No Comments Yet »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.