This is not my cup of tea. ఏదో సరదాకి…
———————————————-
ఆ సాయంత్రం …
ఆ పొలం గట్టు …
పొలాల మీంచి వీచే పిల్ల గాలి
వయ్యారంగా వూగే పొలాలు
అంత కంటే వయ్యారంగా నడిచొచ్చిన నువ్వు
వచ్చీ రాని వెన్నెల
మెత్తమెత్తని గడ్డి
చల్ల చల్లని గాలి
వెచ్చని నీ వొడి
చెప్పుకున్న కబుర్లు
పంచుకున్న ఙాపకాలు
ఆ సాయంత్రం …
ఆ పొలంగట్టు …
కాలం అక్కడే ఆగిపోయుంటే
ఎంత బావుండేది!!!

కాలం ఆగలేదు కనుకే అది జ్ఞాపకమైందనుకుంటా.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా vasundhara — సెప్టెంబరు 14, 2007 @ 2:41 పూర్వాహ్నం