దిల్ సే …

సెప్టెంబరు 19, 2007

“డింగుటకా” — 2037 లో ఒక సినిమా రివ్యూ by Yo!man™

ప్రచురించిన వర్గము మీతో నేను, సరదాకి, సినిమాలు — శ్రవణ్ @ 8:52 పూర్వాహ్నం

Dude, thanks for visiting blog.yo!man.com.

ఇవాళ ఒక తెలుగు సినిమా చూసాను, పేరు “డింగుటకా”. అసలీరోజుల్లో ఎలాంటి సినిమాలొస్తున్నాYo!. మా టైంలో అయితే “బ్యాండ్ లీడర్” అనీ, “పరమ హింసా రెడ్డి” అనీ, ”దొరికితే చంపుతా” అనీ మంచి మంచి సినిమాలు వచ్చేవి. ఇప్పుడంతా ట్రాష్. “డింగుటకా” అంట అదొక పేరు, అదొక సినిమా.

ఇక సంగీతం గురించి, అసలు ఒకప్పుడు ఎంత మంచి సంగీతం, ఎంత బాగా వచ్చేదనీ!. “బ్యాండ్ లీడర్” సినిమాలో అయితే “బీ యే ఎన్ డీ… బ్యాండ్ బ్యాండ్ … బజావో బ్యాండ్ బ్యాండ్” ఎంత మంచి పాట… మంచి పదాలూ, ఆ సాహిత్యం… సంగీతంలో వంపులూ సొంపులూ… ఆ రోజులే వేరు. “డింగుటకా”  లో first song “డ్ర్ర్‌ర్‌ర్‌ర్ డుష్ డుష్” కొంచెం ఫర్వా లేదు. “పుటుక్కు జర డుబుక్కుమే” సాంగ్ బావుంది. కొంచెం తెలుగు పదాలున్నాయి. మిగతావి మరీ దారుణం.

ఈమధ్య సినిమాలు బాగా మారిపొయ్యాయండీ. “కషీలా”, “జంభ” ల లాగా సంఘసేవ చేసే హీరోయిన్లూ ఏరీ. ఏమైనా అంటే ఆ కిం అండ్రూ నీ, రోజ్ కిడ్సన్ నీ చూపిస్తారు. అస్సలు వాళ్ళకీ అస్తిపంజరాలకీ ఏమయినా తేడా వుందండీ?

“కిరూ” అని ఒక పెద్ద హీరో. ఎంత మంచి డాన్సులు చేసేవాడో. “బాధ”, “జంభ” అనే హేరోయిన్‌లతో ఆయన చేసిన డాన్సులు ఇప్పటికీ చూడబుద్దేస్తాయి. స్టెప్స్ అంటే క్యాచీగా వుండాలా? అంతా గ్రాfix, ఇంక dance ఏంచూస్తాం.

ఇక dialogues గురించి. “పరమ హింసా రెడ్డి” సినిమా లో “రేయ్ నీ బాత్‌రూంలో కొచ్చా, నీ సోపువాడా, నీ అండర్‌వేర్ కూడా వాడా” లాంటి dialogues ఏవీ. ఇప్పటి సినిమాల్లో ఆ పదును లేదండీ.  

మొత్తానికి సినిమా అయితే హిట్ అవుతుంది కానీ నాకయితే నచ్చలా.

అభిప్రాయములు »

  1. baaguMdi.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — సెప్టెంబరు 19, 2007 @ 9:29 పూర్వాహ్నం | జవాబు

  2. హహహహ… బాగుంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వెంకట రమణ — సెప్టెంబరు 19, 2007 @ 10:59 పూర్వాహ్నం | జవాబు

  3. ఛించారు

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Budaraju Aswin — సెప్టెంబరు 19, 2007 @ 11:16 పూర్వాహ్నం | జవాబు

  4. బాగుంది భవిష్యత్కాలమ్మీద మీ సృజనాత్మకత! ఆ “పరమహింసారెడ్డి” ని నిజంగానే సూర్యచంద్రాదులున్నంతవరకు అలానే గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వికటకవి — సెప్టెంబరు 19, 2007 @ 1:36 అపరాహ్నం | జవాబు

  5. adurs

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — సెప్టెంబరు 19, 2007 @ 2:00 అపరాహ్నం | జవాబు

  6. బాగుంది మీ projection.
    కొన్ని సంవత్సరాలకి ఇవాళ జరుగుతున్న చెడు కూడా మంచిస్మృతులవుతాయి!!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా teresa — సెప్టెంబరు 19, 2007 @ 6:00 అపరాహ్నం | జవాబు

  7. మీరు చెప్తుంటే – డింగుటకా కంటే ఆ పాత చినేమాలే బావున్నట్టున్నాయి

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా solarflare — సెప్టెంబరు 19, 2007 @ 8:12 అపరాహ్నం | జవాబు

  8. చాలా బాగుంది మీ రివ్యూ…. లాభతృష్ణ… కిరూల గురించి చెప్పారు కానీ… లవణ్ కల్నన్.. సెలెబ్రెటీ బాబు..ల గురించి చెప్పలేదేంటండి….!? YO!గారు

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నంద — సెప్టెంబరు 20, 2007 @ 10:12 పూర్వాహ్నం | జవాబు

  9. కామెంట్స్ రాసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.

    నంద గారూ…సెలెబ్రిటీ బాబు ఇవాళ బలైపోయాడు. లవణ్ కల్నన్, పాపం problems లో వున్నాడు. ఆయన్ని కొన్నాళ్ళొదిలేద్దాం.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — సెప్టెంబరు 20, 2007 @ 11:22 పూర్వాహ్నం | జవాబు

  10. dingu tukaa .. sueroo superu

    indianwebdesign.wordpress.com
    zoomsays.blogspot.com

    chakradhar
    http://www.chakradhar.net

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా indianwebdesign — జనవరి 9, 2008 @ 11:48 పూర్వాహ్నం | జవాబు

  11. chala bagundi bavishyath gurinchi very good

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ravi — జూన్ 1, 2008 @ 2:04 అపరాహ్నం | జవాబు

  12. kekaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా stranger — జూన్ 27, 2008 @ 1:24 అపరాహ్నం | జవాబు

  13. Wow………….! That’s a good one . But I”m in 2087 now .I want review of the latest movie “jujajo”……………………………. plz..

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా rohit — జనవరి 18, 2009 @ 10:51 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.