తెలుగు బ్లె(పె)ద్దల్లో ఒకరైన ఈయన నా బ్లాగు చూడ్డం నాకు పెద్ద పండుగ. ఈయనంటే నాకు చాలా గౌరవం. ఆయన గురించి చెప్పడనికి నేనెంత వాణ్ణి? ఆయన బ్లాగు చూస్తేనే అయనేంటో తెలుస్తుంది. ముక్కుకి సూటిగా వెళ్ళేవాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వాళ్ళల్లో పక్కవాళ్ళని ఇంఫ్లూయెన్స్ చేయగలిగే వాళ్ళు ఇంకా అరుదు.
నిన్న నవీన్‌గారు, వాళ్ళన్నయ్య తెలుగులో బ్లాగితే తెగ ఆనంద పడిపొయ్యారు. నేను కొంచెం సరదాగా “అన్న పాంటేస్తే మాస్” అని కామెంట్ రాశాను. ఆ ఆనందం ఏంటో ఇప్పుడు తెలుస్తున్నది.
“పండగ” అని ఎందుకన్నానంటే, “పండుగ” అంటే “క్లాస్” టైపు ఆనందమనీ “పండగ” అంటే “మాస్” టైపు ఆనందమనీ నా ఉద్దేశ్యం.
నా బ్లాగ్ చూసే బ్లె(పె)ద్దలందరికీ ధన్యవాదాలు.
