దిల్ సే …

అక్టోబర్ 10, 2007

ఏంటిలా జరిగింది?

ప్రచురించిన వర్గము సరదాకి — శ్రవణ్ @ 9:27 పూర్వాహ్నం

చాన్నాళ్ళ క్రితం నేను మొబైల్‌ఫోను కొన్నాను…వాటి రేట్లు తగ్గడం మొదలైంది. నేను T.V కొంటే కూడా అంతే, వాటి రేట్లు వున్నటుండి పడి పొయ్యాయి. యేంటంటే కొత్త budget వచ్చిందంట. ఇహ లాభంలేదని మా friends ని ఆపి నేనే ముందు ల్యాప్‌టాప్ కొన్నా. నా పుణ్యమా అని వాళ్ళు బాగా లాభపడ్డారు.

ఈసారి iPhone కి ఎసరు పెట్టా. కానీ, నేను కొనేలొపే రేట్లు పడిపొయ్యినై.
ఎలా జరిగింది చెప్మా?

అభిప్రాయములు »

  1. మీకు కొత్త కొత్త వస్తువులను కొనే ఆసక్తి తగ్గిపోతుందేమోనని తగ్గించినట్లున్నారులెండి :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా మాకినేని ప్రదీపు — అక్టోబర్ 10, 2007 @ 1:23 అపరాహ్నం

  2. బాసూ… ఈ విషయం గురించి నేను గత ఏడాదిగా బాధపడుతున్నా… నా గోడు నా బ్లాగులో రాస్తే అందరూ నవ్వారుగానీ అప్పుడు ఎవరికీ అర్థంకాలేదు. నాలాంటివ్యక్తి ఇంకోడున్నాడని తెలిసి చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ కంపెనీలందరికీ మనం కొన్నాకే ప్రైస్ వార్ మొదలెట్టాలని ఎందుకు అనిపిస్తుందో ఎప్పుడైనా అలోచించావా?

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా RSG — అక్టోబర్ 10, 2007 @ 2:35 అపరాహ్నం

  3. Your instincts are getting duller :-)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్త పాళీ — అక్టోబర్ 10, 2007 @ 4:03 అపరాహ్నం

  4. అదంతే మన తలరాత… గత ఏడాది కొన్న ఫోను ఇప్పుడు సగం ధరకే వస్తోంది. అలాగే గత ఏడాది జనవరిలో కొన్న ధరకు ఇప్పుడు ఇంకా మంచి కాంఫిగరేషన్ తో ల్యాప్ టాప్ దొరుకుతోంది…

    మేమూ మీ వెంటే వున్నామండి ఈ విషయంలో…. :-)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వేణు — అక్టోబర్ 10, 2007 @ 5:01 అపరాహ్నం

  5. నేనందుకే ఒకసారి కొన్న తరవాత ధర వంక చూడను :P

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ప్రవీణ్ గార్లపాటి — అక్టోబర్ 10, 2007 @ 6:23 అపరాహ్నం

  6. @ మాకినేని ప్రదీపు, RSG, వేణు, ప్రవీణ్ గార్లపాటి…
    I think we are at some kind of a “sweet-spot” in the consumer piramid.

    కొత్త పాళీ గారూ,
    నిజమేనండీ. కారణాలేమైనా, ఈమధ్య నానా చెత్తా రాశాను. కాస్త తగ్గిస్తాను.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — అక్టోబర్ 11, 2007 @ 8:07 పూర్వాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.