ఎంటో…
ఒహటే మెరుపు కలలు…
చంద్రబాబు నాయుడు చేసిన ఒక్కతప్పయినా ఒప్పుకున్నట్టు,
రాజశేఖరరెడ్డేమో మళ్ళీ సియం అయినట్టూ,
రాహుల్ గాంధి ఇప్ప్డడప్పుడే పియం అవనట్టు,
అద్వానీ దళితుల కోసం పాటు పడినట్టూ,
జానారెడ్డి తేటతేట తెలుగులో మాట్లాడినట్టు,
కేసియ్యార్ తాగినా పడిపోనట్టూ
ఎంటో…
ఒహటే మెరుపు కలలు…
ఒకానొక హీరో రెండు నిమిషాలు రెండు కాళ్ళూ కుదురుగా పెట్టినట్టూ,
ఇంకొకాయన ‘చంపేస్తా’ అని వత్తులు సరిగ్గా పలికినట్టు,
మరొకాయన సినిమాలో ఫైట్లే లేనట్టూ,
మరో స్టారు సిక్స్‌ప్యాక్ తెచ్చుకుమరీ ఎక్స్‌పోజింగు చేసినట్టు
ఎంటో…
ఒహటే మెరుపు కలలు…

Inta Manchi Kalalu Kani Mammalni kooda ebbandi pettakandi
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Reshu — నవంబరు 23, 2007 @ 10:19 పూర్వాహ్నం
అన్నట్టు…
“ఇక్కడ నేను చెప్పినవి” జరగడం కష్టం అని నా ఉద్దేశ్యం. అంతేగానీ, అన్నీ ఇష్టమని కాదు. ఉదాహరణకి, మళ్ళీ రాజశేఖరరెడ్డి సియం అవ్వడం చూడాలని లేదు. కానీ, చంద్రబాబు ఒక్కసారి “my mistake, sorry” అంటే వినాలనుంది.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — నవంబరు 23, 2007 @ 1:59 అపరాహ్నం
ha ha ha
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — నవంబరు 23, 2007 @ 5:53 అపరాహ్నం