దిల్ సే …

జనవరి 21, 2008

రాత బాబూ రాత…

ప్రచురించిన వర్గము controversial, సినిమాలు — శ్రవణ్ @ 3:05 అపరాహ్నం
Tags: ,

చాలారోజుల తర్వాత ఒక మిత్రుణ్ణి సర్ప్రైస్ చేద్దామని వాళ్ళింటికి చెప్పకుండా వెళ్ళా…

వాడు వాళ్ళ బుడ్డోడితో నానా కష్టాలు పడుతూ కనిపించాడు. ఎంత వూరుకోబెట్టినా వూరుకోడే? దడుపు జ్వరం వచ్చినట్టుంది, విలవిల్లాడిపోతున్నాడు. వాణ్ణి చూస్తే జాలేసింది. వాళ్ళావిడేమో పిల్లవాణ్ణి పట్టించుకోవట్లేదు. చంద్రముఖిలో జ్యోతిక లాగ జుట్టు విరబోసుకొని వుంది, “లకలకలక” అనటం ఒక్కటే తక్కువ.

పక్కన వాడి తమ్ముడు. వాడు కాస్త గట్టి పిండం, కాస్త కంట్రోల్లో వున్నాడు. అతి కష్టం మీద వాణ్ణించి విషయం రాబట్టా.

వాళ్ళు అప్పుడే ఏదో సినిమా చూసి వస్తున్నారంట. ‘ఒక్కమగాడనో, ఇద్దరు అడాళ్ళ’ నో ఏదో పేరు చెప్పాడు. ఇంకో పక్క వాళ్ళమ్మగారు అందుకుంది. “అది పండక్కి వాళ్ళింటికి వెళ్దామంటే కూడా విన్లేదు బాబూ… బిడ్డ చూడు అల్లాడిపోతున్నాడు…రాత బాబూ రాత” అని.

ఎలాగోలా వాణ్ణి వోదార్చి బయట పడ్డా. బయట పడగానే, అప్పటిదాకా కంట్రోల్ చేసుకొన్న కన్నీళ్ళు కళ్ళవెంట బొటబొటా రాలినై.

ఎందు కంటారా?
రాతబాబూ… రాత.
“సుల్తాన్” చూసిన రోజులూ, పడ్డ బాధలూ…నేను ఎవరితో చెప్పుకోవాలి?

అభిప్రాయములు »

  1. ఈ సినిమా దెబ్బలకు పెద్ద పిట్టలే రాలిపోతున్నాయి..ఇక పిల్ల కాకులు ఓ లెక్కా……

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నవీన్ గార్ల — జనవరి 22, 2008 @ 4:54 పూర్వాహ్నం

  2. [...] వెళ్ళా (ఇది నిజంగా జరిగింది, ఇక్కడలా కథ కాదు). వాడు హైదరబాదులో [...]

    పింగ్ బ్యాక్ ద్వారా గ్రహణం — సినిమా గురించి కాదు « దిల్ సే … — మార్చి 28, 2008 @ 2:39 అపరాహ్నం

  3. [...] నిజంగా జరిగిన సంఘటన, ఇక్కడలా కథ కాదు. ఆమధ్య ఒకసారి, మూడేళ్ళక్రితం [...]

    పింగ్ బ్యాక్ ద్వారా గ్రహణం — సినిమా గురించి కాదు « దిల్ సే … — మార్చి 28, 2008 @ 2:53 అపరాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.