దిల్ సే …

మార్చి 28, 2008

గ్రహణం — సినిమా గురించి కాదు

ప్రచురించిన వర్గము మీతో నేను, సరదాకి, సినిమాలు — శ్రవణ్ @ 2:39 అపరాహ్నం
Tags: ,

ఈసారి ఒక చిన్న ఎపిసోడ్.

ఆమధ్య ఒకసారి, మూడేళ్ళక్రితం అనుకుంటా, ఒక మిత్రుణ్ణి కలవడానికని వెళ్ళా (ఇది నిజంగా జరిగింది, ఇక్కడలా కథ కాదు). వాడు హైదరబాదులో భరత్‌నగర్‌లో వుంటాడు. నన్నో చిన్న హోటల్‌కి (పూటకూళ్ళ ఇంటికి) తీసుకెళ్ళాడు. మాటల్లో ఆ హోటల్ ఓనర్ “గ్రహణం” సినిమా ప్రొడ్యూసర్ అనో ఫైనాన్షియర్ అనో చెప్పాడు.
తినడం మొదలు పెట్టబోతుండగా మావాడికి ఒక డౌటు వచ్చింది. ” ఆ ఫోటోలు ఇంతకు ముందు ఈవైపు ఉండాలి కదా, ఏంటి అటు వైపుకి మార్చారు?” అని. అదేమాట క్యాషియర్ని అడిగాడు (మేము క్యాషియర్ కి దగ్గర్లోనే ఉన్నాము). అతను బుర్ర తిరిగే సమాధానం ఇచ్చాడు.

“అటు వాస్తు బాగాలేదని ఇటు పెట్టారంట”.

1 వ్యాఖ్య »

  1. ఎందుకండీ, సినిమా తియ్యాలనుకునేవాళ్ళ మనసు బాధపెడతారు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేష్ — మార్చి 29, 2008 @ 8:44 పూర్వాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.