భేతాళప్రశ్నలు అంటే ఏదో ఒక వింత situation ఇచ్చి “రాజా, ఇప్ప్పుడు చెప్పు” అని భేతాళుడు విక్రమార్కుణ్ణి అడుగుతాడు. ఆ situation ఏమో సామాన్యంగా జరగడానికి వీల్లేకుండా ఉంటుంది. కాని ఇది నిజంగా జరిగింది.
నా మితృడొకతను. ఇతనిది చిత్తూరు. వీళ్ళ నాన్నగారు తెలుగు వారు, చక్కగా తెలుగు మాట్లాడతారు. పెళ్ళిమాత్రం తెలుగు ఏమాత్రం రాని తమిళుల ఇంట్లో చేసుకున్నారు (arranged marriage, same caste). పెళ్ళయ్యాక ఆవిడ చక్కగా తెలుగు నేర్చుకుంది. ఇంట్లో అందరూ తెలుగులోనే మాట్లాడతారు. ఉద్యోగం బెంగళూరులో. వీళ్ళ బంధువులు చాలామంది అక్కడ సెటిల్ అయ్యారు. నామిత్రుడు అక్కడే పుట్టిపెరిగాడు.
కాబట్టి ఇతను తెలుగూ, ఇంగ్లీషూ, హిందీ, అరవం మరియూ కన్నడ చక్కగా మాట్లాడతాడు. తనకి spontanious గా వచ్చే భాష కన్నడ. ఇంట్లో తెలుగు మాట్లాడతారు. తన తల్లిగారు అరవ వారు. పనిచేసేది విదేశంలో కాబట్టి ఎక్కువ మాట్లాదేది ఇంగ్లీషు. అతన్ని అడిగితే నేను తెలుగు వాణ్ణి, బెంగళూరులో పెరిగాను అని చెబుతాడు.
పాఠకరాజా ఇప్పుడు చెప్పు. ఇతని మాతృభాష ఏమిటి? సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీతల వెయ్యి వ్రక్కలగుగాక!

తెలుగు origin కాబట్టి, అతనూ తెలుగు వాడే అని ఫీల్ అవుతాడు కాబట్టి అతను తెలుగు వాడే. మాతృభాష అంటే తల్లిభాష అని కాదండి బాబూ… మీరన్నట్టు spontanious గా వచ్చేది. మరి కన్నడమవ్వాలేమో తెలియదు. తమిళం ఖచ్చితంగా కాదు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేష్ — మే 8, 2008 @ 7:50 అపరాహ్నం
ఈతడి ఆలోచనలు ఏ భాషలో జరుతాయో, మీరు చెప్పకనే చెప్పారు (కన్నడం). అదే ఇతడి ‘మాతృ భాష’. మాతృభాష అంటే మన తల్లి మాట్లాడే భాషో,ఇంట్లో మాట్లాడే భాషో కాదు. మనిషి ఆలోచనల భాష, అవసరాలు అసంకల్పిత స్థితిలో తెలిపే భాష. ఇక బేతాళుడు చచ్చినా చెట్టెక్కడు…విక్రమార్కా!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా K. మహేష్ కుమార్ — మే 8, 2008 @ 8:09 అపరాహ్నం
ఈ గడబిడ ఉండకూడదనే కొంతమంది “మాతృ భాష”కి బదులు “ఇంటి భాష” అన్న పదం సూచించారు! అతని ఇంట్లో తెలుగే మాట్లాడతారు కాబట్టి, అతను చిన్నప్పటినుంచీ ఇంట్లో తల్లిదండ్రులతో తెలుగే మాట్లాడి ఉంటే, అదే అతని ఇంటి భాష.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కామేశ్వర రావు — మే 8, 2008 @ 8:23 అపరాహ్నం
భేతాళ…
నీవు వేసిన ప్రశ్న బహుచక్కనిది.
మాతృభాష అనుదానికి అర్దము జన్మతహా తన తల్లి ఏ భాషలో పిల్లవాడికి లాలిపాడుతుందో అది అని విరివిగా వాడబడుతున్నాప్పటికిన్నిన్ని…. నా ఉద్దేశ్యంలో మాతృభాష అని దేన్ని పిలుస్తాను అంటే… ఒక వ్యక్తీ ఏ భాషలో తన అంతర్ముఖుడయి మాట్లాడుతాడో…అంటే…తనలో తను ఆలోచిస్తున్నాప్పుడు ఏభాషలో మాట్లాడుకుంటాడో…ఆ భాష వారికి మాతృభాష అవుతుంది…. ఆ కధలోని యువకుడు… కన్నడ విరివిగా మట్లాడుట అలవాటవ్వటం వలన తన ఊహ తెలిసిన సమయం కన్నడ ప్రదేశంలో ఉండటం చేతనో, తన అలోచనలను సాకారం చేసుకుంటున్న సమయంలో కన్నడ భాష ఉపయోగించటం చేతనో ఆ యువకుని మాతృభాష అయినది అని నా సమాధానం….
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chandramouli — మే 8, 2008 @ 8:27 అపరాహ్నం
Nice Post !
Use a Telugu social bookmarking widget like PrachaarThis to let your users easily bookmark your blog posts.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Roshini — మే 8, 2008 @ 9:51 అపరాహ్నం
బేతాళా, ఇంత అయోమయపు మితృని పొందిన నీ బతుకు ధన్యమాయె. ఆతని మాతృ భాష (లేదా కొంప భాష) ఆతనికే తెలియక నిన్నీ విధంబున మా తలలు బగులగొట్టి మరీ తెలుసుకు రమ్మని పురమాయించెనా? అటులనే కానిమ్ము. మిత్ర కుమారుడు అసంకల్పితంగా ఆలోచించే కన్నడమే ఆతని తల్లి నాలుక (అనగా ఆంగ్లమున మదర్ టంగ్). ఇందులో పెద్దగా ఆలోచించుటకేమున్నది? ఇక చెట్టుకేసి ఎగరటం మొదలెట్టు.
http://anilroyal.wordpress.com
http://anilroyal.blogspot.com
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా అబ్రకదబ్ర — మే 9, 2008 @ 1:08 పూర్వాహ్నం
ఇక్కడొక చిన్న litigation ఉంది. ఇతని పెళ్ళి తెలుగమ్మాయితో(same caste, arranged mariage) అవ్వడానికి అవకాశాలెక్కువవున్నాయి. (ఇంట్లో వాళ్ళ నాన్న గారిది ఫుల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్లు డామినేషన్). అదే జరిగితే ముడి విడిపోయినట్లే, వాళ్ళు తెలుగు వారిగా కంటిన్యూ అవుతారు. అది జరక్కుండా వీడే మళయాళీ అమ్మాయినో చేసుకుంటే పీటముడి మీద ఫీటముడి పడినట్లే
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — మే 9, 2008 @ 1:25 అపరాహ్నం
దీనికి ఇంత బుర్ర చించుకోవల్సిన అవసరం లేదు. లాగి పెట్టి ఒక జెల్ల కాయ కొట్టండి.బాధని ఎవరైనా మాతృభాష లోనే తెలియజేస్తారు
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా balu — మే 9, 2008 @ 4:25 అపరాహ్నం