అలా ఆన్‌సైటు నించి వెనక్కొచ్చిన Yo!man™ని అందరూ లావు అయిపొయ్యావు అని గోల చేస్తున్నారు. మనోడు మనలో చాలా మంది లాగే జిమ్ముకెళ్ళాని రోజూ సాయంత్రం అప్పటికప్పుడు నిర్ణయించుకొని, రాత్రి నిద్రలో మరచి పోయేవాడు. ఇక లాభం లేదని, డైటింగ్‌కి దిగాడు.
అదేంటో ప్రతిదానికీ “without oil” అనడం అలవాటు చేసుకున్నాడు. మొన్న ఎలాంటి పెళ్ళాం కావాలీ అంటే “*****(చుక్కలన్నమాట)కట్నం “without oil” అన్నాడు. నిన్న మరీ దారుణమండీ! ఆఫీస్ క్యాంటీన్‌లో పూరీ “without oil” ఆర్డర్‌చేశాడు. అదేంటో పక్కనున్న మా అందరికీ వెంటనే ఫోన్‌కాల్సు వచ్చాయి.
అయినా పూరీ “without oil” ఏంటడీ బాబూ?

హ హ హ్హ. పూరీ “without oil”. Excellent అండీ.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేష్ — మే 23, 2008 @ 8:29 అపరాహ్నం
పూరి వితవుట్ ఆయుల్ వుంటుంది అనుకుంటా. టీ.వీ లో వచ్చే ఒక యాడ్ లో స్నేహ ఆయుల్ లేకుండా పూరి చేస్తుంది. వేడి పెనం మీద అనుకుంటా .
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా shiv — జూన్ 8, 2008 @ 1:45 పూర్వాహ్నం
[...] — శ్రవణ్ @ 4:46 అపరాహ్నం Tags: హాస్యం * పూరీ without oil * మరో [...]
పింగ్ బ్యాక్ ద్వారా TOP 10 « దిల్ సే … — అక్టోబర్ 17, 2008 @ 7:06 అపరాహ్నం
బాగుంది. దీన్ని బహుబాగుందని అనిపిస్తా.
ఒక సినిమా లొ సునీల్ హోటల్ లో ఇలాంటివే కొన్ని items “with out oil” ఆర్డర్ చేస్తూ “ONE FRUIT JUICE WITH OUT OIL” అని flow లో అంటాడు, అవాక్కయిన server మీద జాలి పడి, “సరె, “WITH OIL” అని correct చేసుకుంటాడు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా sreedhar — అక్టోబర్ 22, 2008 @ 11:15 అపరాహ్నం