దిల్ సే …

ఆగష్టు 4, 2008

మరో ప్రస్థానం

ప్రచురించిన వర్గము unbiased, మీతో నేను, రాజకీయాలు — శ్రవణ్ @ 8:25 అపరాహ్నం

మరో ఎలక్షన్,
మరో ఎలక్షన్,
మరో ఎలక్షన్ వచ్చింది!
పదండి తొక్కుక్కు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
అంతరాత్మలే లేకుండా-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ఎలక్షన్ ఘంటికలు?
పేదవాళ్ళ గుండెనెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
దందాల్ జేసీ,
సెజ్జులు చేసీ,
దోచినదంతా తీయండి!
చిరంజీవులూ,
రాఘవులూ, నారాయణలు,
చంద్రబాబులా మనకడ్డంకి?
పదండి తొక్కుక్కు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
ఎముకలు కుళ్లిన,
వయస్సు మళ్లిన,
‘తెలుగు తమ్ములూ’! చావండి!
డబ్బులు చిమ్మే,
సారా పంచే,
నాయకులారా! రారండి!
రాహుల్! రాహుల్!
రాహుల్! రాహుల్!
రాహుల్ రాహులని కదలండి!
మరో ఎలక్షన్,
మహా ఎలక్షన్
రాష్ట్రం నిండా నిండింది!
పదండి తొక్కుక్కు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!

అభిప్రాయములు »

  1. :) :) మళ్ళీ ఇంకోసారి :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేంద్ర — ఆగష్టు 4, 2008 @ 10:55 అపరాహ్నం | జవాబు

  2. బాగుంది మీ మరో ప్రస్థానం.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chaitanya — ఆగష్టు 5, 2008 @ 5:54 అపరాహ్నం | జవాబు

  3. భెషో భేష్ :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Naga Muralidhar Namala — ఆగష్టు 5, 2008 @ 11:39 అపరాహ్నం | జవాబు

  4. బ్లాగు బుక్కులో కంపల్సరీ ఉండాల్సిన ఎంట్రీ ఇది

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నవీన్ గార్ల — ఆగష్టు 12, 2008 @ 9:38 అపరాహ్నం | జవాబు

  5. సూపరు

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా జింతాక్ — ఆగష్టు 12, 2008 @ 9:39 అపరాహ్నం | జవాబు

  6. @ రాజేంద్ర, chaitanya, Naga Muralidhar Namala, జింతాక్ — థాంక్స్ అండీ

    @నవీన్ గార్ల — I am really flattered, let us see how it goes

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — ఆగష్టు 13, 2008 @ 10:45 పూర్వాహ్నం | జవాబు

  7. baagundi :-)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Purnima — సెప్టెంబరు 11, 2008 @ 12:09 పూర్వాహ్నం | జవాబు

  8. [...] TOP 10 ప్రచురించిన వర్గము తెలుగు బ్లాగర్లు, రాజకీయాలు, సరదాకి, సినిమాలు — శ్రవణ్ @ 4:46 అపరాహ్నం Tags: హాస్యం * పూరీ without oil * మరో ప్రస్థానం [...]

    పింగ్ బ్యాక్ ద్వారా TOP 10 « దిల్ సే … — అక్టోబర్ 17, 2008 @ 7:12 అపరాహ్నం | జవాబు

  9. bagundi

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా praneeth — నవంబరు 3, 2008 @ 7:38 అపరాహ్నం | జవాబు

  10. Nijjmgaa…. entha baavundho…. Nenarlu… inkaa marikonni iste(wraste)chaalaa samthosham…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా balasubramanyam — మార్చి 30, 2009 @ 5:27 అపరాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.