దిల్ సే …

మార్చి 12, 2009

TOP 10 డవలాగులు

చంద్రబాబు ……………… ముఖ్యమంత్రి కొన్ని వేలకోట్ల రూపాయలు సంపాదించారు
రాఘవులు ……………. “చంద్రబాబు పాలన…….” కి కట్టుబడి ఉన్నాం
వైయస్సార్ …………….. అధిస్టానం చూసుకుంటుంది
చిరంజీవి ……………….. సామాజికన్యాయం
కేసియార్ ………………. బొందబెడతాం
నాగబాబు ……………… పూజకి పనికి రాని పువ్వు
రాజశేఖర్ ……………… సానుబూతులు

And the joint winners are…
రోజా …………………… పళ్ళు రాలగొడతా
బాలకృష్ణ ……………….. సామాన్యులకు రక్షణేది?

Consolation prize goes to …
మోహన్‌బాబు ………… industry is not for onebody

ఆగష్టు 6, 2008

నట్టులు వెతకండి…

ప్రచురించిన వర్గము controversial, మీతో నేను, రాజకీయాలు — శ్రవణ్ @ 5:13 అపరాహ్నం
Tags: , ,

మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నట్టులు కొన్ని వదులయి పడిపొయ్యాయి. దీని కారణంగా ఆయన అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. దయచేసి నట్టులు వెతికి ఇవ్వగలరు.
ఈ వ్యాఖ్యలు చూడండి, “దమ్ముంటే అమలు చెయ్యా”లంట. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏదయినా పాలసీ బాగుందనో(?), బాలేదనో రీజనింగుతో వ్యాఖ్యానించాలి. సరే… మన వాళ్ళు ఇండియన్ పోలిటీషీన్సు కదా. రీజనింగు లేకపోయినా బాగుందనో, బాలేదనో వ్యాఖ్యానిస్తే O.K..

“బావుందనిపిస్తే దేశమంతా అమలు చెయ్యమని డిమాండు చెయ్యి. బాలేదనిపిస్తే దేశమంతా అమలు చెయ్యొద్దని డిమాండు చెయ్యి. ఈ ‘దమ్ముంటే అమలు చెయ్యటం’ ఏంటి చంద్రబాబూ? ఇదేనా ఢిల్లీలో చక్రం తిప్పే తెలివి?”.

అన్నట్టు…
ఈయన ఏ కమెంటు చేసినా “రాజీనామా చేయండి” అనే డిమాండు మాత్రం వుంటుంది.

WordPress.com లో Blog పెట్టుము.