నా మిత్రుల్లో “internet explorer” వాడ్డం మానేసినవాళ్ళు చాలామందే వున్నారు. ఎప్పుడో తప్పనిసరి అయితే తప్పించి దీన్ని వాడరు. అంతా firefox వాడతారు. నేనూ ఈ వర్గానికి చెందిన వాణ్ణే. కారణం open source tools లో proprietary tools ని తలదన్నేదిగా దీన్ని గుర్తించడమే. ఇంత క్వాలిటీ ఉన్నవి కొన్నిమాత్రమే. ఈ చిట్టాకి “wikipedia search” చేర్చాలనేది నా అభిమతం. నేను ఇంకొక్క అడుగు ముందుకేసి firefox లో “default search” కి “wikipedia” వాడుతున్నాను. మీరూ ప్రయత్నించండి.
హోం పేజీ గా “గూగుల్ search” నే ఇంకా వాడతాననుకోండి, అది వేరే విషయం.
