దిల్ సే …

జూలై 27, 2007

ఏకలింగం™ — ప్రజాసేవ

Filed under: నాతో నేను,రాజకీయాలు,సరదాకి — శ్రవణ్ @ 12:55 సా.

( ముందుగా “ఏకలింగం™ గురించి” చదవగలరు).

అలా నీరసంగా ఆఫీసు నుంచి బయటపడ్డ ఏకలింగం™ భేతాళుణ్ణి(laptop) భుజానేసుకుని రోడ్డున పడ్డాడు(రోడ్డు మీద నడుస్తున్నాడు).

ప్రాజెక్టు మానేజరు దగ్గర తిన్న చీవాట్లకు బుర్ర పనిచెయ్యటం మానేసింది. “సార్! ఆటో” అన్న మాట విని తలతిప్పాడు. “ఆటో వాడు మనం పిలవకుండా మనల్ని అడగడమేమిటీ?” ఒక కేజీ ఆశ్చర్యపడిపోతూ ఎంతో అడక్కుండానే ఆటో ఎక్కేశాడు ఏకలింగం™. ఇంతలో జరగకూడనిది జరిగిపోయింది. భేతాళుడి ఆత్మ laptop ని వదిలి ఆటో వాణ్ణి ఆవహించింది. తను ఎక్కడికివెళ్ళాలో చెప్పకుండా ఎంతో అడక్కుండా ఆటో ఎక్కిందే భేతాళుడు internet లో అడిగిన ప్రశ్నలనుంచి తప్పించుకుందామని. ఇక తప్పేట్టు లేదు.

“చిరంజీవి కొత్త శంకర్ దాదా సైన్మా మస్తుంది సార్. మెగాస్టారా మజాకా” అంది భేతాళుడి ఆత్మ.

“హమ్మయ్య” అనుకుని రిలీఫ్ ఫీలయ్యాడు. అందరు తెలుగోళ్ళలాగే సినిమాల గురించి మాట్లాడటమంటే తనకీ అదోతుత్తి. మాట్లాడబోయి, మాటల్లోపడితే original భేతాళుడు ఎక్కడ మిస్సవుతాడోనని నోర్మూసుకున్నాడు. ఇక భేతాళుడి ఆత్మకి అడ్డేలేక పోయింది.

“చిరంజీవి పార్టీ వెడ్తుండంటగా. మీరిన్నరోలేదో P.J.R భీ సొంత పార్టీ వెడుతుండు, నరేంద్ర, విజయశాంతీ ఆల్రెడీ పార్టీ షురుజేసిండ్రు.”
“నేనూ పార్టీ వెడతా”.
ఇక మాట్లాడకుండా వుండటం ఏకలింగం™ వల్లకాలేదు. అయినా కంట్రోల్ చేసుకుని, “ఎందుకు?” సౌండు బయటికిరాకుండా రకరకాల హావభావాలతో అడిగేశాడు.
“ఎందుకేంది సార్! ఎన్నాళ్ళు సార్ ఈ ఆటోతోలుడు. నేను కూడా ప్రజాసేవ చేస్తా” అంది భేతాళుడి ఆత్మ.

అప్పుడెప్పుడో  C code లో “printf” బదులు “cout” లు పెట్టి సబ్మిట్ చేసిన C++ assignment గుర్తొచ్చి, “ప్రజాసేవ అంటే నువ్వనుకునేది కాదనుకుంటా” అన్నాడు ఏకలింగం™.

ఏకలింగాన్ని ప్రశ్నించి, మాట్లాడించడంలో సఫలమయిన భేతాళుడి ఆత్మ తిరిగి laptop ని చేరింది.

ప్రకటనలు

జూలై 26, 2007

రామోజీరావుకి కోపమొచ్చింది

Filed under: మీతో నేను,రాజకీయాలు — శ్రవణ్ @ 12:48 సా.

నిన్న ‘ఈనాడు’  లో రామోజీరావు గారు రాసిన వ్యాసం ఇక్కడ చదవచ్చు.

అందులోంచి నాకు నచ్చిన phrases కొన్ని.
“బురదజల్లే ప్రయత్నం”, “వక్రభాష్యం చెబుతున్నారు”, “తప్పుడు భాష్యం చెబుతున్నది మామూలు వ్యక్తి కాదు”, “అధికార దుర్వినియోగం”, “అధికార దురాక్రమణ”.  రామోజీరావు గారు ఇలాంటివేమీ చేయలేదని అయన అభిమతం. మనం కూడా ఏకీభవిద్దాం.

జోకులు కొన్ని(నాకయితే నవ్వొచ్చింది)

  • అన్ని రాజకీయ పార్టీలకూ సమానమైన దూరాన్ని పాటించామని … స్పష్టంగా తెలుస్తుంది
  • అరమరికల్లేని విధానమే ‘ఈనాడు’ మార్గం
  • ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాయి
  • మా మీడియా సంస్థ ప్రజాప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తోంది
  • ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానెళ్ళు పూర్తిగా వృత్తిపరమైన విలువలకు కట్టుబడి నడుస్తున్నాయి

 నా comments:

“ఏది చేసినా ప్రజా ప్రయోజనమే ‘ఈనాడు’ అంతిమలక్ష్యం”

  • “ప్రజా ప్రయోజనం” అనే పదం లేకపోతే దీన్ని “terrorism” అంటారు.చట్టం అనేది ఒకటుంది కదా! మీరే మయినా స్పెషల్ పెర్సనా సార్?

కాంగ్రెస్ నియంతృత్వ పాలన ఎదురులేకుండా సాగిపోయింది. బలహీనమైన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అధికార దుర్వినియోగాన్ని చేష్టలుడిగి చూశాయి తప్ప ఏమీ చేయలేకపోయాయి. ఆ సమయంలో ‘ఈనాడు’ సమర్థమైన ప్రతిపక్ష పాత్రను భుజానికెత్తుకుంది.

  • monopoly మంచి ఫలితాలనివ్వడం అరుదు. తెలుగునాట రాజకీయాలున్నంతకాలం మీ పేరు చెప్పుకుంటారు. మనస్పూర్తిగా ధన్యవాదాలు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ ‘ఈనాడు’ చాలా వార్తల్ని, కథనాల్ని, సంపాదకీయాలను ప్రచురించింది.

  • చాలా కాదు సార్! అన్నీ(దేశభద్రతకు సంబంధించిన వార్తల్లాంటివి తప్పించి) వ్రాయాలి.

అనగనగా ఒక “రాజు”

Filed under: మీతో నేను,రాజకీయాలు — శ్రవణ్ @ 5:39 ఉద.

ఆ… అలాగా…
నాకింకా తెలీదే
అబ్బే… లేదండీ…
నాదాకా రాలేదే
ఏమో… ఏమైందో…
కనుక్కుని చెప్తాలే
అలాగని అన్నానా…
నాకేం గుర్తుకులేదే

ఏమయ్యా రాజయ్యా
సియ్యం పని ఇదయితే
గుడ్డీ చెవిటీ అయి
నిద్దర పోవడమయితే
నువ్వెందుకు సియ్యంగా
నేనయినా యేలేస్తా

కడిగేస్తాన్

Filed under: రాజకీయాలు — శ్రవణ్ @ 5:32 ఉద.

కడిగేస్తాన్ కడిగేస్తాన్
కడిగేస్తానేమనుకున్నావో

‘హైటెక్కు’లు మీవంతు
ప్రోజెక్టులు మావంతు
యేలూరు స్కాం మీవంతు
ఇనుప గనులు మావంతు

దేశమేం జనం సొత్తా?
రాష్ట్రమేం ‘దేశం’ గుత్తా?
ఒప్పందం మీరావో
ఏకేస్తాన్ నిన్నంతే

కడిగేస్తాన్ కడిగేస్తాన్
కడిగేస్తానేమనుకున్నావో

జూలై 25, 2007

నా మొదటి పోస్టు

Filed under: Uncategorized — శ్రవణ్ @ 9:52 ఉద.

హమ్మయ్య! నేనూ ఒక బ్లాగు మొదలు పెట్టాను. శ్రీశ్రీ లెవెల్ కి వ్రాయక పోయినా, “నేను సైతం” బ్లాగుతున్నాననే ఆనందం కోసం. అంతకంటే ముఖ్యంగా, నా గొంతు కూడా వినిపిస్తున్నాననే సంతోషం కోసం…

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.