దిల్ సే …

జూలై 26, 2007

రామోజీరావుకి కోపమొచ్చింది

Filed under: మీతో నేను,రాజకీయాలు — శ్రవణ్ @ 12:48 సా.

నిన్న ‘ఈనాడు’  లో రామోజీరావు గారు రాసిన వ్యాసం ఇక్కడ చదవచ్చు.

అందులోంచి నాకు నచ్చిన phrases కొన్ని.
“బురదజల్లే ప్రయత్నం”, “వక్రభాష్యం చెబుతున్నారు”, “తప్పుడు భాష్యం చెబుతున్నది మామూలు వ్యక్తి కాదు”, “అధికార దుర్వినియోగం”, “అధికార దురాక్రమణ”.  రామోజీరావు గారు ఇలాంటివేమీ చేయలేదని అయన అభిమతం. మనం కూడా ఏకీభవిద్దాం.

జోకులు కొన్ని(నాకయితే నవ్వొచ్చింది)

 • అన్ని రాజకీయ పార్టీలకూ సమానమైన దూరాన్ని పాటించామని … స్పష్టంగా తెలుస్తుంది
 • అరమరికల్లేని విధానమే ‘ఈనాడు’ మార్గం
 • ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాయి
 • మా మీడియా సంస్థ ప్రజాప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తోంది
 • ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానెళ్ళు పూర్తిగా వృత్తిపరమైన విలువలకు కట్టుబడి నడుస్తున్నాయి

 నా comments:

“ఏది చేసినా ప్రజా ప్రయోజనమే ‘ఈనాడు’ అంతిమలక్ష్యం”

 • “ప్రజా ప్రయోజనం” అనే పదం లేకపోతే దీన్ని “terrorism” అంటారు.చట్టం అనేది ఒకటుంది కదా! మీరే మయినా స్పెషల్ పెర్సనా సార్?

కాంగ్రెస్ నియంతృత్వ పాలన ఎదురులేకుండా సాగిపోయింది. బలహీనమైన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అధికార దుర్వినియోగాన్ని చేష్టలుడిగి చూశాయి తప్ప ఏమీ చేయలేకపోయాయి. ఆ సమయంలో ‘ఈనాడు’ సమర్థమైన ప్రతిపక్ష పాత్రను భుజానికెత్తుకుంది.

 • monopoly మంచి ఫలితాలనివ్వడం అరుదు. తెలుగునాట రాజకీయాలున్నంతకాలం మీ పేరు చెప్పుకుంటారు. మనస్పూర్తిగా ధన్యవాదాలు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ ‘ఈనాడు’ చాలా వార్తల్ని, కథనాల్ని, సంపాదకీయాలను ప్రచురించింది.

 • చాలా కాదు సార్! అన్నీ(దేశభద్రతకు సంబంధించిన వార్తల్లాంటివి తప్పించి) వ్రాయాలి.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు »

 1. “ఈనాడు”….”రాను రాను రాజు గారి గుర్ర౦ గాడిదయి౦దన్నట్లు” చ౦ద౦గా…తయారయ్యి౦ది…!! పత్రికలు…
  ” పార్టీ..ఈకలు ” అయ్యాయి…

  వ్యాఖ్య ద్వారా Kesari — జూలై 26, 2007 @ 3:33 సా. | స్పందించండి

 2. eenadu is the BEST.

  వ్యాఖ్య ద్వారా rohini kumar — జూలై 27, 2007 @ 8:21 ఉద. | స్పందించండి

 3. రామోజీరావుగారు ఇంతటి హాస్యబ్రహ్మలని తెలియదు. మీరు ఉటంకించిన ఆయన వ్యాఖ్యలు కడుపుబ్బా నవ్వించాయి.

  వ్యాఖ్య ద్వారా satyasai — జూలై 27, 2007 @ 11:36 ఉద. | స్పందించండి

 4. నిజం చెప్పాలంటే ఇది ఒక బజారు పేపర్ లాగ తరయారు అయ్యిందండి. ఒకప్పుడు ఈనాడు తప్ప వేరొకటి చదివేవాడిని కాదు. ఇప్పుడు చదివేప్పుడు బూతులు తప్పితే వేరొకటి రావడం లేదు నా నోటి వెంట.
  ఇప్పుడు వికటేస్తుంది. చంద్ర బాబు అధికారం లోకి వస్తే కేసులు అన్నీ మాఫీ చేయించుకోవడం ఖాయం. మనం మాత్రం నిస్చేష్టులమై ఉండిపోవాల్సిందేనా..

  వ్యాఖ్య ద్వారా అంజి బాబు — మార్చి 11, 2009 @ 5:46 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: