దిల్ సే …

ఆగస్ట్ 31, 2007

ఆవిధంగా ముందుకు పోతున్నాం…

Filed under: మీతో నేను,రాజకీయాలు — శ్రవణ్ @ 5:55 ఉద.

ఈమధ్య సైంటిస్టులు ఒకటి కనుగొన్నారు, పవరులోలేని రాజకీయనాయకులలో ఒకరకమయిన మానసిక రుగ్మత ఉంటుందని. దీనిపై వేర్వేరు నాయకుల వ్యాఖ్యలు ఇలా వున్నాయి.

రాజశేఖరరెడ్డి: “ఇది పురుషుల్లో వుంటే దాన్ని ‘రాజీవ్ రోగం’ అనీ, స్త్రీ లలో వుంటే దాన్ని ‘ఇందిరమ్మ వ్యాధి’ అని పిలవాలి. స్లం లను అన్ని కలుపుకొని ‘డిసీజ్ కారిడార్’ ఎర్పాటు చేస్తున్నారు”.

అద్వానీ : “పోటా చట్టం తేవాలి, లేకపోతే ఇటువంటి రుగ్మతలే వస్తాయి”.

చంద్రబాబు : “భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక ముఖ్య మంత్రి మాట్లాడవలసిన మాటలేనా ఇవి? వై.యస్ రాజీనామా చేయాలి”.

కొసమెరుపు:
విలేఖరుల సమావేశం అయిపోయాక కారులో వెళ్తూ చంద్రబాబు తన పి.ఏ ని అడిగారు. “ఇంతకీ టాపిక్ ఏంటి, నేను ఎందుకు తిట్టినట్టు?” అని.

మిగతా రాజకీయనాయకుల వ్యాఖలు మీ కామెంట్స్ లో…

ప్రకటనలు

ఆగస్ట్ 29, 2007

పసుపు చొక్కా పచ్చచొక్కా

Filed under: మీతో నేను,రాజకీయాలు,సరదాకి — శ్రవణ్ @ 1:22 సా.

Y.S. ని హిట్లర్ తో పోల్చితే చంద్రబాబుని ఎవర్తో పోల్చాలో మీరే చెప్పండి. 🙂

ఆగస్ట్ 28, 2007

ఒరెమూనా …

Filed under: నాతో నేను — శ్రవణ్ @ 5:23 ఉద.

నాకు చావా కిరణ్ గారి కవితలు బాగా నచ్చాయి. రెండు మూడు పంక్తుల్లో అంత భావుకత పలికించటం బాగా నచ్చింది. ఇంతకీ, o-r-e-m-u-n-a అంటే ఏంటో ఆయన చెప్తే సరి. లేదంటే మా Yo!man™ ని అడిగేస్తా.

“it happens” అంట

Filed under: నాతో నేను,రాజకీయాలు — శ్రవణ్ @ 4:50 ఉద.

“it happens” అంట. ఏంటి “it happens”?  సుమారు 50 మంది చనిపోతే ఒక రాష్ట ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఆ చనిపోయిన వాళ్ళలో ఈయన కొడుకో కూతురో ఉంటే ఇట్లాగే మాట్లాడతాడా?

ఆగస్ట్ 27, 2007

మ్మ్…

Filed under: అతితెలివి,సరదాకి — శ్రవణ్ @ 1:19 సా.

 Yo!man™ ” ఏకలింగం™ తో అన్నాడు “yo!man, This year నా  marriage anniversary sunday dude, Yo! Yo!”.

ఏకలింగం™ అనుకున్నాడు “నేను కూడా ఆదివారం పెళ్ళిచేసుకునుంటే బావుండేది ప్రతి సంవత్సరం సెలవు వచ్చేది”.

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.