దిల్ సే …

ఆగస్ట్ 25, 2007

అమృతం కురిసిన రాత్రి

Filed under: మీతో నేను,సరదాకి — శ్రవణ్ @ 1:42 సా.

టైటిల్ అంతబాగా కాకపోయినా ఈ పోస్టు సుమారుగా వస్తే నేను యాపీసు. నిజానికి gist కి టైటిల్ కున్నంత సీనూ ఉందని నా అభిప్రాయం. ఇక content లోకి…

చాలా మంది సన్నకారు సాఫ్టువేరు ఇంజనీర్లలాగే నేనూ ఒక onsite వెళ్ళాను, ఒక iPod కొనుక్కున్నాను. ఈసారి రైలుప్రాయాణానికని ఒక ఫ్రెండునించి share చేసుకొన్న(తస్కరించిన) పాటల్ని లోడ్ చేసి బయల్దేరాను. దిగవలసింది తెల్లవారి 3 గంటలకు కావటంతో మేలుకొని పాటలు వినక తప్పలేదు(తెలుగు పాటలు, అదే నా బాధ). నా అదృష్టం కొద్దీ వాటిల్లో “నీరాజనం” సినిమా లోని పాటలున్నాయి. నాకు టైము తెలియకుండా గడిచిపోయింది.

మంచి పాటలంటే “విరించినై విరచించితిని…” లాంటివా? లేక “ముప్పియ్యారూ ఇరవైనాల్గూ…” లాంటివా? నేనయితే రెండురకాల పాటలనూ ఆస్వాదిస్తాను. కానీ, తేటతేట తెలుగులో అత్యద్భుతమైన భావాల్ని పలికించటం ఎంతమందికి సాధ్యం? సాధ్యపడినప్పుడు ఒకే సినిమాలో అటువంటివి ఎన్ని వుంటాయి? “నీరాజనం” సినిమాలో అటువంటివి 6 పాటలున్నాయి. అన్ని పాటలూ విన్న తర్వాత ఏది best అని చెప్పడం కష్టమైంది. వాటిల్లో best decide చెయ్యడం కోసమే మళ్ళీ మళ్ళీ విన్నా. ఊహు(…లాభం లేదు.

ఎంత మంచి సుగంధద్రవ్యాలున్నా అవి మంచి chef చేతిలో పడాలి. ఈ పాటల్లో సాహిత్యం ఒక ఎత్తయితే ఓ.పి.నయ్యర్ సంగీతం ఇంకో ఎత్తు. పాటలు గుర్తున్న వాళ్ళకోసం నాకు నచ్చిన కొన్ని stanzas…

         …..
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏజన్మకైనా ఇలాగే
         …..
ఏ హరివిల్లు విరబూసినా
నీ ధరహాసమనుకొంటిని
         …..
మనిషికి వలపే వరమా
మది వలపుకు వగపే ఫలమా
అది పాపమా విధి శాపమా
ఎదవుంటె అదినేరమా
         …..
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
         …..
ఊహల ఊయలలో
గుండెలు కోయిలలై
కూడినవీ పాడినవీ
వలపుల సరిగమలూ 

        …..

ప్రకటనలు

వ్యాఖ్యానించండి »

ఇంకా వ్యాఖ్యలు లేవు.

RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: