దిల్ సే …

ఆగస్ట్ 25, 2007

2 year pinch

Filed under: మీతో నేను,సరదాకి — శ్రవణ్ @ 2:02 సా.

7 year pinch గురించి విన్నాం, ఈ 2 year pinch యేమిటి అనుకుంటున్నారా? లేటెందుకు? చదవండి…

బెడ్ మీంచి లేవబుద్ధి గావట్లేదు ఏకలింగానికి. వీకెండు కదా! పొద్దునే లేవడమెందుకూ? వాళ్ళావిడ ఏదో నసుగుతోంది. ఇంతకుముందయితే చెబుతూ వుండేది, ఈమధ్య నసుగుతోంది. నిజంగా నసుగుతోందా? అలా అనిపిస్తున్నదా? చెప్పడం కొంచెం కష్టమే. నిజానికి ఈపూట ఆ సణుగుడు చాలా తక్కువగావుంది. కారణం ఏమిటో? ఫోన్ మోగుతోంది. ఫోన్ అటెండ్ చేస్తేగానీ తన భార్యామణి ఎందుకు గోలచేస్తోందో తెలిసిరాలేదు.

“Hey, Dude” అట్నుంచి Yo!man™.( Yo!man™ గురించి” చదవండి).
“అబ్బే! ఇది ఏకలింగం™ ఇల్లండీ” వెటకారంగా చెప్పాడు ఏకలింగం™.
“టెలుసు man, good one dude” అట్నుంచి.
“వెధవకి తిట్టినా … జోకులాగా అనిపిస్తుందన్నమాట” అనుకున్నాడు ఏకలింగం™.
“happy birthday, treat ఎక్కడ?” అట్నుంచి.
విష్ చేశాక, అంత గ్యాప్ లేకుండా ట్రీట్ అడగొచ్చని ఏకలింగానికి అప్పుడే తెలిసింది. వాడికేదో సమాధానం చెప్పి ఫోను పెట్టేశాడు. “ఈరోజు ప్రశాంతంగా గడపాలి, no work, no భేతాళుడు, no surfing” decide చేసుకున్నాడు. రొటీన్ సీన్సు ఎడిట్ చేస్తే నెక్ష్టు సీనులో తను T.V. చూస్తున్నాడు, బి.బి.సి.

“Happy birthday” అంది వాళ్ళావిడ. నిజానికి వాళ్ళావిడ వాయిస్ చాలా బావుంటుంది. కాకపోతే, ఆ సణుగుడే… “ఆ కళ్ళలో ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత” అంత సెంటిమెంట్ సీనులో తన sixth sense ఏదో కీడు శంకించింది. “తుఫాను ముందర ప్రశాంతత కాదు కదా?”. వెధవ అనుమానం నిజమయికూర్చుంది.

వాళ్ళావిడ, నడుము వెనక దాచిన చేతులు ముందుకు తెచ్చింది. వాటిల్లో ఒక గ్లాసూ, అందులో ఒక పదార్ధం. “దేవుడా! నన్ను రక్షించు” పైకే అనేశాడు. దేవుడి మీద తనకి నమ్మకం లేదు. అయినా ప్రమాదాల్లో, కష్టాల్లో వున్నప్పుడు మాత్రం తలచుకుంటాడు. రెస్పాన్సు ఎక్కువసార్లు “this number does not exist” అని వస్తుంది. ఒక్కోసారి మాత్రం ప్రాబ్లెం సాల్వు అవుతుంటుంది. ఈసారి “మీరు కాల్ చేసిన వ్యక్తి అందుబాటులో లేరు” అని వచ్చింది. ఆడవాళ్ళంటే దేవుడికి కూడా భయమేనేమో?

ఒక అయిడియా వచ్చింది. “నాక్కొంచెం పనుంది. తర్వాత తాగుతాను, తింటాను” ఆ పదార్థాన్ని తింటారో, త్రాగుతారో తెలియక రెండూ చెప్పేశాడు. భేతాళుణ్ణి (laptop) ఓపెన్ చేసి, “మెయిల్సు మాత్రమే…, నో బ్లాగ్సు” కొంచెం సర్దిచెప్పుకున్నాడు.

“ఎద తెంచుకు కురిసిన వాన” తెలుగు గుంపులో మొదటి మెయిలు. ఇంతలో వాళ్ళావిడ ఏకలింగం నోరు తెరిచి ఆ పదార్థాన్ని కొంచెం నోట్లో పోసింది. “వాన… తెంచుకు కురవడమేమిటి?”, ఆలోచిస్తూ “ఏదో తేడాగా వుందే?” అడిగాడు వాళ్ళావిణ్ణి.
“కిస్మిస్ అండీ” సమాధానం. “కొత్త కవి అయి వుంటాడు” సమాధాన పరుచుకున్నాడు, “ఇది ఇంతే! ఇన్నిన్ని కిస్మిస్లు, ఇన్నిన్ని బాదం పప్పూ వేస్తే సరిపోతుందా? ఏది ఎలా చేయాలో తెలియఖ్ఖర్లా?”.

నెక్ష్టు మెయిలు. “మీలాంటి కవులతో పరిచయం నాపూర్వ జన్మ సుకృతం” అని. ఇంతలో “ఎలా వుంది” అంటూ ఇంకొంచెం నోట్లో వొంపేసింది వాళ్ళావిడ. గుండె రగిలింది…కాదు… కడుపు కదిలింది. “ఒక్క నిముషం” అంటూ పరుగు లంకించుకున్నాడు ఏకలింగం™.

బయటికొచ్చాక, బెడ్ మీద అడ్డం పడ్డాడు. “మరి అమ్మ వంట అంత బాగా ఎలా వుంటుంది?”, డౌటు. “ఎక్స్పీరియెన్సు” హాల్లో T.V.లోంచి చిరంజీవి వాయిస్. ఏదో సినిమా వస్తున్నట్టుంది.

 (ఏకలింగం™ కష్టాలు సశేషం)

ప్రకటనలు

2 వ్యాఖ్యలు »

  1. Do you mean 7year itch?

    వ్యాఖ్య ద్వారా teresa — ఆగస్ట్ 27, 2007 @ 2:55 సా. | స్పందించండి

  2. లేదండి. 7 year pinch అంటే 7 ఏళ్ళకి పార్ట్నర్ పాతబడతారని. నా గోల, 2 ఏళ్ళ తర్వాత భార్య నసగడం మొదలుపెడుతుందని(అలా అనిపిస్తుందని).

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — ఆగస్ట్ 29, 2007 @ 5:26 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: