దిల్ సే …

సెప్టెంబర్ 19, 2007

“డింగుటకా” — 2037 లో ఒక సినిమా రివ్యూ by Yo!man™

Filed under: మీతో నేను,సరదాకి,సినిమాలు — శ్రవణ్ @ 8:52 ఉద.

Dude, thanks for visiting blog.yo!man.com.

ఇవాళ ఒక తెలుగు సినిమా చూసాను, పేరు “డింగుటకా”. అసలీరోజుల్లో ఎలాంటి సినిమాలొస్తున్నాYo!. మా టైంలో అయితే “బ్యాండ్ లీడర్” అనీ, “పరమ హింసా రెడ్డి” అనీ, “దొరికితే చంపుతా” అనీ మంచి మంచి సినిమాలు వచ్చేవి. ఇప్పుడంతా ట్రాష్. “డింగుటకా” అంట అదొక పేరు, అదొక సినిమా.

ఇక సంగీతం గురించి, అసలు ఒకప్పుడు ఎంత మంచి సంగీతం, ఎంత బాగా వచ్చేదనీ!. “బ్యాండ్ లీడర్” సినిమాలో అయితే “బీ యే ఎన్ డీ… బ్యాండ్ బ్యాండ్ … బజావో బ్యాండ్ బ్యాండ్” ఎంత మంచి పాట… మంచి పదాలూ, ఆ సాహిత్యం… సంగీతంలో వంపులూ సొంపులూ… ఆ రోజులే వేరు. “డింగుటకా”  లో first song “డ్ర్ర్‌ర్‌ర్‌ర్ డుష్ డుష్” కొంచెం ఫర్వా లేదు. “పుటుక్కు జర డుబుక్కుమే” సాంగ్ బావుంది. కొంచెం తెలుగు పదాలున్నాయి. మిగతావి మరీ దారుణం.

ఈమధ్య సినిమాలు బాగా మారిపొయ్యాయండీ. “కషీలా”, “జంభ” ల లాగా సంఘసేవ చేసే హీరోయిన్లూ ఏరీ. ఏమైనా అంటే ఆ కిం అండ్రూ నీ, రోజ్ కిడ్సన్ నీ చూపిస్తారు. అస్సలు వాళ్ళకీ అస్తిపంజరాలకీ ఏమయినా తేడా వుందండీ?

“కిరూ” అని ఒక పెద్ద హీరో. ఎంత మంచి డాన్సులు చేసేవాడో. “బాధ”, “జంభ” అనే హేరోయిన్‌లతో ఆయన చేసిన డాన్సులు ఇప్పటికీ చూడబుద్దేస్తాయి. స్టెప్స్ అంటే క్యాచీగా వుండాలా? అంతా గ్రాfix, ఇంక dance ఏంచూస్తాం.

ఇక dialogues గురించి. “పరమ హింసా రెడ్డి” సినిమా లో “రేయ్ నీ బాత్‌రూంలో కొచ్చా, నీ సోపువాడా, నీ అండర్‌వేర్ కూడా వాడా” లాంటి dialogues ఏవీ. ఇప్పటి సినిమాల్లో ఆ పదును లేదండీ.  

మొత్తానికి సినిమా అయితే హిట్ అవుతుంది కానీ నాకయితే నచ్చలా.

ప్రకటనలు

13 వ్యాఖ్యలు »

 1. baaguMdi.

  వ్యాఖ్య ద్వారా chavakiran — సెప్టెంబర్ 19, 2007 @ 9:29 ఉద. | స్పందించండి

 2. హహహహ… బాగుంది.

  వ్యాఖ్య ద్వారా వెంకట రమణ — సెప్టెంబర్ 19, 2007 @ 10:59 ఉద. | స్పందించండి

 3. ఛించారు

  వ్యాఖ్య ద్వారా Budaraju Aswin — సెప్టెంబర్ 19, 2007 @ 11:16 ఉద. | స్పందించండి

 4. బాగుంది భవిష్యత్కాలమ్మీద మీ సృజనాత్మకత! ఆ “పరమహింసారెడ్డి” ని నిజంగానే సూర్యచంద్రాదులున్నంతవరకు అలానే గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

  వ్యాఖ్య ద్వారా వికటకవి — సెప్టెంబర్ 19, 2007 @ 1:36 సా. | స్పందించండి

 5. adurs

  వ్యాఖ్య ద్వారా radhika — సెప్టెంబర్ 19, 2007 @ 2:00 సా. | స్పందించండి

 6. బాగుంది మీ projection.
  కొన్ని సంవత్సరాలకి ఇవాళ జరుగుతున్న చెడు కూడా మంచిస్మృతులవుతాయి!!

  వ్యాఖ్య ద్వారా teresa — సెప్టెంబర్ 19, 2007 @ 6:00 సా. | స్పందించండి

 7. మీరు చెప్తుంటే – డింగుటకా కంటే ఆ పాత చినేమాలే బావున్నట్టున్నాయి

  వ్యాఖ్య ద్వారా solarflare — సెప్టెంబర్ 19, 2007 @ 8:12 సా. | స్పందించండి

 8. చాలా బాగుంది మీ రివ్యూ…. లాభతృష్ణ… కిరూల గురించి చెప్పారు కానీ… లవణ్ కల్నన్.. సెలెబ్రెటీ బాబు..ల గురించి చెప్పలేదేంటండి….!? YO!గారు

  వ్యాఖ్య ద్వారా నంద — సెప్టెంబర్ 20, 2007 @ 10:12 ఉద. | స్పందించండి

 9. కామెంట్స్ రాసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.

  నంద గారూ…సెలెబ్రిటీ బాబు ఇవాళ బలైపోయాడు. లవణ్ కల్నన్, పాపం problems లో వున్నాడు. ఆయన్ని కొన్నాళ్ళొదిలేద్దాం.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబర్ 20, 2007 @ 11:22 ఉద. | స్పందించండి

 10. dingu tukaa .. sueroo superu

  indianwebdesign.wordpress.com
  zoomsays.blogspot.com

  chakradhar
  http://www.chakradhar.net

  వ్యాఖ్య ద్వారా indianwebdesign — జనవరి 9, 2008 @ 11:48 ఉద. | స్పందించండి

 11. chala bagundi bavishyath gurinchi very good

  వ్యాఖ్య ద్వారా ravi — జూన్ 1, 2008 @ 2:04 సా. | స్పందించండి

 12. kekaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

  వ్యాఖ్య ద్వారా stranger — జూన్ 27, 2008 @ 1:24 సా. | స్పందించండి

 13. Wow………….! That’s a good one . But I”m in 2087 now .I want review of the latest movie “jujajo”……………………………. plz..

  వ్యాఖ్య ద్వారా rohit — జనవరి 18, 2009 @ 10:51 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: