దిల్ సే …

సెప్టెంబర్ 20, 2007

మహేష్ బాబు

Filed under: మీతో నేను,సినిమాలు — శ్రవణ్ @ 11:00 ఉద.

నాకు మహేష్ బాబు అంటే కొంత ఇష్టం. ఎందుకంటే, “మడిసన్న తర్వాత కూసంత కలా పోసనుండాల”న్నట్టు హీరో అన్న తర్వాత కాస్త వొడ్డూ, పొడుగూ, అందం, ఠీవీ, విగ్రహం వుండాలి. మహేష్ బాబు లో ఇవి పుష్కలంగా వున్నాయి.(బాబోయ్, మిగతావాళ్ళ గురించి నేనేమీ కమెంట్ చెయ్యలేదు, నన్నొదిలెయ్యండి). south heroes ని తెగ తిట్టే north వాళ్ళు మహేష్ బాబు దగ్గరికొచ్చేప్పటికి నోరు ముయ్యాల్సిందే. ఆ విధంగా అంధ్రాదే కాకుండా మొత్తం south india  పరువు కాపాడుతున్నాడు.

ఇహ పోతే, మహేష్ బాబు మంచి హీరోయిన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాడు. లేకపోతే, హీరో యెవరో హీరోయిన్ యెవరో తెలియదు కదా(just kidding, పైగా ఇప్పుడు బావున్నాడు). హీరోయిన్లని ఏడిపిస్తూ రొమాన్సునీ, కామిడీనీ, రక్షిస్తూ డైనమిజాన్నీ, హీరోయిజాన్నీ చూపిస్తుంటాడు.

గొంతు తే(?)డా కాబట్టి, తొడలుకొట్టి చెప్పే డైలాగులు చెప్పలేడు, మనం బ్రతికి పోతాం. డాన్సు రాదు కాబట్టి పద్దతిగా నాలుగు మూవ్‌మెంట్స్ ఉంటాయి, కోతి గెంతులుండవు. సినిమా మొత్తం ఒకటే expression (నవ్వినప్పుడు తప్ప), కాబట్టి నవ్వితే నవ్వచ్చు లేదంటే హాయిగా A/C లో నిద్రపోవచ్చు.

ఇంతకీ నేను మహేష్‌ని తిట్టానా, పొగిడానా? ఎవరికి తోచిన్నట్లు వాళ్ళు అనుకోండి.

conclusion గా 2 ముక్కలూ, 1 confession.
. మహేష్ బాబు సినిమాలు ప్రమాదకరం కావు (ఒక్క “మురారి” క్లైమాక్స్ తప్పించి).
. మహేష్ బాబు సినిమాలు ఫ్యామిలీతో చూడదగ్గవి.

confession ఏమిటంటే, నేను మహేష్ కి ఫ్యాన్‌ని కాదుగానీ… చిన్న సైజు రెక్కని.

32 వ్యాఖ్యలు »

  1. ప్రమాదకరం కాదా? మురారి క్లైమాక్సా? నాయనా, పోకిరి చూశావా? అంత కంగాళీ అవకతవక తొక్కలో సినిమా నా జన్మలో చూళ్ళేదు – ఏమాట కామాట, మహేష్ బానే చేశాడు.

    వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — సెప్టెంబర్ 20, 2007 @ 12:37 సా. | స్పందించండి

  2. నేను మహేష్ కి ఫ్యాన్‌ని.
    “south heroes ని తెగ తిట్టే north వాళ్ళు మహేష్ బాబు దగ్గరికొచ్చేప్పటికి నోరు ముయ్యాల్సిందే” 100% nijam.

    వ్యాఖ్య ద్వారా radhika — సెప్టెంబర్ 20, 2007 @ 1:47 సా. | స్పందించండి

  3. ఇక్కడ ఇంకో కిటికీ

    వ్యాఖ్య ద్వారా chavakiran — సెప్టెంబర్ 20, 2007 @ 1:55 సా. | స్పందించండి

  4. పిల్లకాకిగా ఉన్నప్పుడే హీరోగా చేసి, వీరోఇన్లతో గంతులేసి, విలన్లతో ఫైట్లు చేసి..హిట్టు కొట్టినోడు…..పెద్దోడైతే ఇంగ గమ్మునె ఉంటాడా 🙂

    వ్యాఖ్య ద్వారా నవీన్ గార్ల — సెప్టెంబర్ 20, 2007 @ 2:15 సా. | స్పందించండి

  5. నేను కృష్ణ వీరాభిమానిని [ఇంకే హీరో కుడా అసలలా dance చెయ్యగలడా! – లేదని నేను నొక్కి వక్కాణించి మరీ ఘంటాపదంగా చెప్పగలను] – ఆ అభిమానంతొ ఒక మహేష్ సినెమా చూసా! అది కాస్తా “నిజం” – ఏమి చెస్తాం – ఇప్పుడు మహేష్ సినెమాలు కుడా చూసేస్తున్నాను! పోకిరి క్లైమాక్స్ విషయంలో కొత్త పాళ్ళీ గారితో ఏకిభవించలి

    వ్యాఖ్య ద్వారా solarflare — సెప్టెంబర్ 20, 2007 @ 6:11 సా. | స్పందించండి

  6. మరో కిటికీ.

    వ్యాఖ్య ద్వారా రానారె — సెప్టెంబర్ 20, 2007 @ 9:44 సా. | స్పందించండి

  7. కమెంట్స్ రాసిన అందరికీ కృతజ్ఞతలు.

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబర్ 21, 2007 @ 8:28 ఉద. | స్పందించండి

  8. ఇంకొకడు
    మహేష్ మరో అల్లూరి …..
    చూడండి

    వ్యాఖ్య ద్వారా Budaraju Aswin — సెప్టెంబర్ 21, 2007 @ 4:43 సా. | స్పందించండి

  9. @రానారె గారు
    ఈ “కిటికీ” వ్యాఖ్యకి అర్దం ఏమిటొ తెలియచేయండి

    వ్యాఖ్య ద్వారా solarflare — సెప్టెంబర్ 22, 2007 @ 8:44 ఉద. | స్పందించండి

  10. అన్నా, ఇరాగాతిశావు , భలే రాశావు.

    వ్యాఖ్య ద్వారా madhu mohan — ఫిబ్రవరి 15, 2008 @ 5:44 సా. | స్పందించండి

  11. నాకు మహేష్ బాబుఇష్టంమహేష్ బాబు దగ్గరికొచ్చేప్పటికి నోరు ముయ్యాల్సిందే. ఆ విధంగా అంధ్రాదే కాకుండా మొత్తం south india పరువు కాపాడుతున్నాడు.
    నాకు మహేష్ బాబు అంటే కొంత ఇష్టం. ఎందుకంటే, “మడిసన్న తర్వాత కూసంత కలా పోసనుండాల”న్నట్టు హీరో అన్న తర్వాత కాస్త వొడ్డూ, పొడుగూ, అందం,

    వ్యాఖ్య ద్వారా G.RAMKUMAR — ఏప్రిల్ 17, 2008 @ 2:47 సా. | స్పందించండి

  12. HALO MYNAMY RAMKUMAR SUPAR HERO MAI MAI VARI
    Good parsan

    వ్యాఖ్య ద్వారా G.RAMKUMAR — ఏప్రిల్ 17, 2008 @ 2:49 సా. | స్పందించండి

  13. mahesh garu chala bhaga act chestaru.

    వ్యాఖ్య ద్వారా giridhar — ఏప్రిల్ 18, 2008 @ 10:28 ఉద. | స్పందించండి

  14. mahes babu chala bagha act chestaru but sometimes his story is not good.
    he is unable to find good stories and directros

    వ్యాఖ్య ద్వారా giridhar — ఏప్రిల్ 18, 2008 @ 10:29 ఉద. | స్పందించండి

  15. వాజ్యస్తుతి అదిరింది.
    నాక్కుడా మీలాగా మహేశ్ (మహేష్ కాదు) అంటే రోత. అదే constipated expression ఎల్లప్పుడూను.
    నా ఉత్తరాది మిత్రులు మహేశ్ ని చూసి కూడా అవహేళన చేస్తారు. కానీ అది వారి superficiality అనకోండి. కొండముచ్చిలా తెల్లగా వుంటే చాలు వాళ్ళకి.

    – రాకేశ్ (రాకేష్ కాదు)

    వ్యాఖ్య ద్వారా రాకేశ్వర రావు — ఏప్రిల్ 18, 2008 @ 7:47 సా. | స్పందించండి

  16. hi i vaintu one good mouve

    వ్యాఖ్య ద్వారా gajendra naidu — ఏప్రిల్ 18, 2008 @ 9:57 సా. | స్పందించండి

  17. mahesh garu chala bhaga act chestaru

    వ్యాఖ్య ద్వారా nagesh babu — ఏప్రిల్ 19, 2008 @ 5:32 సా. | స్పందించండి

  18. naku mahesh babu antaa chala estamm

    వ్యాఖ్య ద్వారా nagesh babu — ఏప్రిల్ 19, 2008 @ 5:33 సా. | స్పందించండి

  19. maa mounika thalliki. mahesh antai pichhi. memu saudiloo unttamu. india vellinappudu. digina rojai mahesh picture unttai thappakundda vellali ani adusthundhi. ledha full mahesh movies anni dvds venttanai choodali. ani godava chaisthundhi. ma mounika now 2nd class loo unnadhi. just 2nd year nunchi mahesh antai chaala istta padathundhi. dhani life loo okka saari aina mahesh tho 1hour gadapaali ani dhani korika. even naaku kuda mahesh antai pichhi. thappakunda kalludham mahesh. pls.

    వ్యాఖ్య ద్వారా p.rupadevi — ఏప్రిల్ 19, 2008 @ 11:27 సా. | స్పందించండి

  20. mahesh babu natana chalabagundi dailagous chala baguntunai

    వ్యాఖ్య ద్వారా m.nagaraju goud — ఏప్రిల్ 20, 2008 @ 8:27 సా. | స్పందించండి

  21. maheshbabu prathi cinimanu pokiritho polusthnaru/mundu okkadutho polcharu oka cinimanu maro cinimatho polchadam sarikadu.

    వ్యాఖ్య ద్వారా m.nagaraju goud — ఏప్రిల్ 20, 2008 @ 8:32 సా. | స్పందించండి

  22. mahesh is super star

    వ్యాఖ్య ద్వారా teja — మే 13, 2008 @ 9:17 సా. | స్పందించండి

  23. mahesh babu is the great hero

    వ్యాఖ్య ద్వారా nareshreddy — మే 23, 2008 @ 2:47 సా. | స్పందించండి

  24. mahesh babu is the great

    వ్యాఖ్య ద్వారా nareshreddy — మే 23, 2008 @ 2:48 సా. | స్పందించండి

  25. మొత్తానికి పొగిడవో తిట్టావో తెలీని స్థితిలో నువ్వేవుంటే, ఇక మాపరిస్థితేంటి? రాయడం మాత్రం సూటిగా సుత్తిలేకుండా రాశావ్!

    వ్యాఖ్య ద్వారా కె.మహేష్ కుమార్ — జూన్ 26, 2008 @ 7:10 సా. | స్పందించండి

  26. mahesh babu is decenthero

    వ్యాఖ్య ద్వారా stranger — జూన్ 27, 2008 @ 1:33 సా. | స్పందించండి

  27. ala annavu bagundi

    వ్యాఖ్య ద్వారా ash — ఆగస్ట్ 26, 2008 @ 1:08 సా. | స్పందించండి

  28. yevadu cinema testhe rikardulu ,collectionlu baddhalai potayo vaare MAHESH BABU

    వ్యాఖ్య ద్వారా pavan — డిసెంబర్ 2, 2008 @ 4:21 సా. | స్పందించండి

  29. మహేష్ బాబు ” ప్రిన్స్ “.

    వ్యాఖ్య ద్వారా మురళీ.లక్క — డిసెంబర్ 12, 2008 @ 11:23 సా. | స్పందించండి

  30. He is so handsome i know all of them know it but i dont hav any words to describe abt him
    plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz try to give us a movie wid genillia

    వ్యాఖ్య ద్వారా M.Divya — ఫిబ్రవరి 8, 2009 @ 4:48 సా. | స్పందించండి

  31. Mahesh Annaya antey naaku praanam,thana acting antey chaala chaala ishtam naa friends evaraina mahesh babu cinema gurinchi comments chesina thappuga maatladina assalu oorukonu,mahesh annaya cinema bagunna bagaleka poyyina chachinatlu chudaalisindhey…I Love You Mahesh Annaya

    వ్యాఖ్య ద్వారా Sudarshan — జూన్ 19, 2009 @ 8:03 ఉద. | స్పందించండి

  32. tamaru em pokiri ni ala ananakkarledu.. cinema chaala baagundi..

    వ్యాఖ్య ద్వారా deepthi — అక్టోబర్ 4, 2009 @ 9:17 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to m.nagaraju goud స్పందనను రద్దుచేయి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.