దిల్ సే …

నవంబర్ 28, 2007

firefox – 3

నాకు firefox లో “ఈనాడు” స్పష్టంగా కనిపిచ్చేసరికి పిచ్చ హాపీ అనిపించింది. ఈ బొమ్మ firefox-3, windows-xp service pack 2, eenadu font installed కాంబినేషన్.

ఏమయినా… firefox-3 బావునట్టుంది.

అన్నట్టు… వీవెన్ గారూ… మీకు ఇంకో సారి కృతజ్ఞతలు(ఇంతకు ముందు పోస్టులో మీ సలహా వల్ల తెలుగు అక్షరాలు నా కంప్యూటర్లో బాగా కనిపిస్తున్నాయి).

eenadu.png

ప్రకటనలు

నవంబర్ 23, 2007

కలగంటి…కలగంటి!!!

Filed under: రాజకీయాలు,సరదాకి,సినిమాలు,unbiased — శ్రవణ్ @ 8:47 ఉద.

ఎంటో…
ఒహటే మెరుపు కలలు…

చంద్రబాబు నాయుడు చేసిన ఒక్కతప్పయినా ఒప్పుకున్నట్టు,
రాజశేఖరరెడ్డేమో మళ్ళీ సియం అయినట్టూ,
రాహుల్ గాంధి ఇప్ప్డడప్పుడే పియం అవనట్టు,
అద్వానీ దళితుల కోసం పాటు పడినట్టూ,
జానారెడ్డి తేటతేట తెలుగులో మాట్లాడినట్టు,
కేసియ్యార్ తాగినా పడిపోనట్టూ

ఎంటో…
ఒహటే మెరుపు కలలు…

ఒకానొక హీరో రెండు  నిమిషాలు రెండు కాళ్ళూ కుదురుగా పెట్టినట్టూ,
ఇంకొకాయన ‘చంపేస్తా’ అని వత్తులు సరిగ్గా పలికినట్టు,
మరొకాయన సినిమాలో ఫైట్లే లేనట్టూ,
మరో స్టారు సిక్స్‌ప్యాక్ తెచ్చుకుమరీ ఎక్స్‌పోజింగు చేసినట్టు

ఎంటో…
ఒహటే మెరుపు కలలు…

నవంబర్ 20, 2007

మంటనక్క సమస్య

Filed under: సాఫ్టువేరు — శ్రవణ్ @ 4:20 సా.
Tags: , , ,

మంటనక్క (firefox) నన్నెందుకిలా చంపుతోంది? కొంచెం సాయంచేద్దురూ…

irefox problem

నవంబర్ 5, 2007

దూలతీర్చిన దుమ్ము

Filed under: కంప్యూటర్స్,నాతో నేను,సరదాకి — శ్రవణ్ @ 11:55 ఉద.

నా ఫ్రెండ్స్ laptops ని చాలా జాగర్తగా వాడతారు. “ఏంట్రా వీళ్ళు అదేమయినా బంగారమా? యెప్పుడు చూడూ ఆ carrycase లో పెట్టి పూజ చేస్తుంటారు” అని కమెంట్ చేసేవాణ్ణి. ఈ మధ్య నా laptop సౌండ్ చేస్తుంటే customer care కి తీస్కెళ్ళా. processor దగ్గర దుమ్ము చేరి processor fan కి ఉన్న ఒక coil ని పాడు చేసిందంట.

జానెడు(సరే, మూరెడు) తీగకి మూడు వేలు వదిలినై. దుమ్మా! మజాకా?

క్రికెట్ స్కోరు

Filed under: క్రికెట్,సాఫ్టువేరు — శ్రవణ్ @ 9:43 ఉద.

మా కంపెనీలో క్రికెట్ live score చూడ్డానికి అన్ని sites, అన్ని pages proxyతో block  చేస్తారు. కానీ googleని block చేసే దమ్మెవడికుంది?cricket-score.jpg

 (URL ని parse చెయ్యొచ్చని విన్నాను, ప్రస్తుతానికి మా proxyలో ఇంకా అది లేదు). May be this could come handy to you.

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.