దిల్ సే …

ఫిబ్రవరి 27, 2008

Mid shot — ఉండవల్లి, రామోజీరావు

ఈ మధ్య ఈ ఉండవల్లీ, రామోజీరావూ గొడవలు (ఒకటి కంటే ఎక్కువ కదా మరి) గురించి వింటూనే ఉన్నాం. బ్లాగుల్లో కొందరు biased గా రాసే అర్టికల్స్ చూస్తే ఒక నాలుగు లైన్లు రాయాలనిపించి రాస్తున్నా.

నాకు అర్థం అయినంతవరకూ ఉండవల్లి అనదలుచుకున్నది ఇదీ. “అంతా చట్ట ప్రకారం (రాజ్యాంగం ప్రకారం) జరుగుతున్నది. కాని కొంత న్యాయం(ధర్మం)గా లేదు”. So simple and so straight forward.

ఉండవల్లికి కొవ్వుబట్టి అయినా అంబేడ్కర్‌ని ఇందులోకి లాగుండాలి, లేదా రామోజీరావుకి అయినా వళ్ళుబలిసి దీన్ని వక్రీకరించి వుండాలి. ఏదేమయినా అంబేడ్కర్‌ని ఇందులోకి లాగటం దారుణం. మిమ్మల్ని మీరు తెలివైన వారుగా అనుకునే కొందరు biased బ్లాగరులారా కాస్త సంయమనం పాటించండి.

off the track : “చట్టా” నికీ “న్యాయా”నికీ తేడా “విజేత” సినిమాలో అనుకుంటా, చిరంజీవి చెప్పినట్టు గుర్తు.

ప్రకటనలు

ఫిబ్రవరి 25, 2008

జిహ్వకో రుచీ, పుర్రెకో బుద్ధీ

Filed under: నాతో నేను,సరదాకి — శ్రవణ్ @ 5:58 సా.

ఒక తెల్లటి పిల్ల ఒక యదవతోటి తిరుగుతుంటే ఎక్కడో కాలుతుంది. యెదవ నా సన్ను గాడు ఏమి టాలెంటు చూపించాడో అనిపిస్తుంది. అదే ఓ north indian అమ్మాయి ఎంత తెల్లగా అందంగా వుండి ఎంతగా ఎవ్వడితో తిరిగినా పెద్దగా పట్టించుకోను వాళ్ళంటే చాలా రాంగ్ ఇంప్రెషన్. జిహ్వకో రుచీ, పుర్రెకో బుద్ధీ అని ఊరికే అన్నారా?

Options

( ముందుగా “ఏకలింగం™ గురించి” చదవగలరు).

అలా బ్రౌజింగ్ చేసి అలిసిపోయిన  ఏకలింగం సరదాగా క్యాంటీన్ కని బయలుదేరాడు. ఎంత వద్దన్నా భ్రౌజర్లోని భేతాలుడు ఏకలింగం బుర్రలో దూరేశాడు.
భేతాలుడన్నాడు, “లింగం… ఏమంటావ్? శ్రవణ్ నిజంగా నవతరంగుల్ని విమర్శించాడా?”. లింగం కంఫ్యూషన్లో పడ్డాడు. “తెలిసికూడా చెప్పపోతే బుర్ర వెయ్యి వ్రక్కలవదు కదా?” అని. లింగం కంఫ్యూషన్ చూసి నవ్వేశాడు భేతాలుడు. “నీ డౌటు నాకర్థమయింది. అయినా నవతరంగులంతా స్పోర్టివ్‌గా తీసుకున్నాక ఆ discussion అనవసరం. సరే గానీ ఏంటీ టీ ఆర్డరు చెయ్యవా” అన్నాడు భేతాలుడు.
టీ అర్డరు చేసి ఓ టేబిలు ముందు కూర్చున్నాడు మన లింగం. కాస్సేపట్లో టీ రావడం, “లింగం…నువ్వు టీ తాగుతున్నప్పుడు శ్రమ తెలియకుండా నిన్ను కొన్ని ప్రశ్నలడుగుతాను విను” అని అనటం ఆటోమాటిగ్గా జరిగిపోయాయి.
భేతాళుడన్నాడు “ఇప్పుడూ… ఈ ఆస్ట్రేలియా వాళ్ళేంటి? ఆ సైమండ్స్ మరీ? ఎవరినయినా ఏదయినా తిట్టేస్తాడు “How can he get away with it every time?”. “నిజమే” అన్యమస్కంగా పైకనేశాడు లింగం. చుట్టూవునవాళ్ళు తన్ని చూసి నవ్వడం చూసి కాస్త సిగ్గనిపించింది. తమాయించుకున్నాడు, సిగ్గుపడితే ఎట్లా? ఇదేమన్నా చిన్న సమస్యా? దేశప్రతిష్టకి సంబంధించిన సమస్య. “వాణ్ణి ఉరి తియ్యాలి” ఇట్లా తప్పు చేసేట్తుగా force చెయ్యటం చాలాదారుణం. He is left with no option but to give a retart” బాగాగఠ్ఠిగా వినిపించాడు తన వాదనని.
భే  : “అన్నట్టూ…bombay redlight area” లో 40-50శాతం తెలుగు వాళ్ళేనంట కదా!”
లిం: “అబ్బే అలంటిదేమీ లేదని C.M చెప్పారు కదా! వుంటే గింటే 30-40శాతం ఉంటుందేమో, అంతే”
భే  : “మరి వీళ్ళు options ఉండీ ఈ పని చేస్తున్నారంటావా?”
లిం: “కాదనుకో”
భే  : “మరి దీనికి ఎవరిని ఉరి తియ్యాలి, ఈ ప్రశ్నకి సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీ తల వెయ్యి వ్రక్కలవుగాక”

టీ తాగడం అయిపోడంతో ఏమి చెప్పాలో అని అలోచిస్తూ బయలుదేరాడు ఏకలింగం బుర్రలో భేళాడితోసహా…

ఫిబ్రవరి 22, 2008

తెలుగు సినిమా – Myth and The Reality

నేను సినిమాలు చూస్తాను; కాని బ్లాగుల్లో బాగా విశ్లేషించి రాసేంత “సినిమా” నాకు లేదు. ప్రతీ తెలుగు బ్లాగులోనూ తెలుగు సినిమాల గురించి అడపాతడపా రాస్తూనే వుంటారు(రాశి పరంగా మరియు వాసి పరంగా). సినిమాల గురించి రాయక పోతే వాళ్ళు తెలుగు వాళ్ళెలా అవుతారూ? వాళ్ళ విశ్లేషణలు నచ్చినా కొన్ని విషయాల్లో నేను ఏకీభవించలేక పోయాను. ఎప్పణ్ణించో దాన్ని కక్కేద్దామంటే టైము దొరకట్లేదు. ఇదో ఇప్పటికి కుదిరింది.

కొంత మంది అంటుంటారు, “కొంపలు మునిగిపోతున్నై, తెలుగు సినిమా నాశనమై పోతూన్నది అని”. I don’t agree with this, I don’t completely write this off though.  ప్రతీ సినిమా “శంకరాభరణం” అయితే శంకరాభరణం కి వాల్యూ యేముంది. అయినా, ఒకతరహా చిత్రాలు మాత్రమే మంచి చిత్రాలు అనుకోవడం అమాయకత్వమే.  అలాగే, చూసేవాళ్ళున్నారు కదా అని “చిత్రం”, “ఆంటీ” లాంటి సినిమాలు తియ్యడం ఎంతవరకు సబబు? సామాజిక బాధ్యత ఉండఖ్ఖర్లేదా?

మాస్ సినిమాల గురించి…
నాకోవిషయం అర్థం కాదూ…మాస్ సినిమాలతో తప్పేంటి? “రొటీన్ స్టైల్ బోర్” అంటే అర్థం ఉంది. నా ఒక్కడికి మాస్ సినిమాలు నచ్చట్లేదు మీరంతా “స్వాతికిరణం” చూడమనటం దారుణం. 20ల్లో మాస్ సినిమా ఎంజాయ్ చెయ్యకపోతే, ఇంకెప్పుడు 60 ల్లో చేస్తారా? హీరో అన్న తర్వాత విల్లన్ని కొట్టకుండా పక్కన కూర్చోపెట్టుకుని “సగర మందాత్రాది…” అని పద్యం పాడాలా?

ఆర్ట్ సినిమాల గురించి…
“సిరా” లాంటి సినిమా కిచ్చే విలువ ఎలాగూ ఇస్తాం, కాని అన్ని సినిమాల్నీ ఇట్టా తీస్తే సినిమా(మనకి సంబంధించి నంత వరకూ) కి వున్న basic purpose అయినటువంటి ఎంటర్తైన్మెంట్ మిస్ అయిపొతాముకదా! అయినా మంచి సినిమాలు రావట్లేదని ఎవెరన్నారూ…”బొమ్మరిల్లు” నచ్చని తెలుగువాళ్ళు ఉంటారా(60 దాటని వాళ్ళు). అయినా ఓ కత్తిలాంటి ఆర్ట్ మూవీ చూడ్డానికి థియేటర్ దాకా వెళ్ళి డబ్బులు ఖర్చుపెట్టి, ఏడ్చి రావాలా? మీలో యెవరైనా “గాంగ్‌లీడర్” గానీ “రౌడీ అల్లుడు” లేదా “ఘరానా మొగుడు” రిలీజ్ అయినప్పుడు 20,25 ఎళ్ళ వయస్సు లోపు ఉండి ఉంటే ఆ సినిమాలు ఎంజాయ్ చెయ్యలేపొయ్యుంటే చెప్పండి. “గాయం” లాంటి మాంఛి మాస్ సినిమాల్తో ఏంటి ప్రొబ్లెం.  ఎటొచ్చీ, ప్రాబ్లెం “అరుణ్ పాండ్యన్” రొటీన్ మెట్ట యాక్షన్ సినిమాలనీ “గాయం” లాంటి మాస్ మసాలా సినిమాల్నీ ఒకేగాట కట్టెయ్యటంతోనే.

ఇక “navatarangam.com” జనాల గురించి… తెలుగు వాళ్ళలో నాకు తెలిసినంతలో థియేటర్‌కి వెళ్ళి సరదాగా సినిమా చూసేవాళ్ళే ఎక్కువ మంది. ఆలోచిస్తూనో లేదా ఏడుస్తూనో సినిమా చూస్తే అలిసిపోయి బయటికి వస్తారేగానీ అనందంగా కాదు. దీన్ని product launching తో పోలిస్తే ఒక plasma T.V  హైదరాబాద్ లో ఓకత్తి లాంటి షోరూంలో పెట్టి అమ్మితే అర్థం ఉంది గానీ నక్కబొక్కలపాడు లో షో్రూం పెడతానంటే ఎలా? ఇప్పటి మాస్ సినిమాలే రైట్ అనికాదుగానీ వీళ్ళు discuss చేసుకునే అవార్డు సినిమాలు చూడ్డానికి సగటు (తెలుగు) ప్రేక్షకుడు సిద్ధంగా లేడు అని నా అభిప్రాయం.
but one thing is for sure…These guys are doing a fabulous job… in terms of the effort they put in and in terms of the passion they show. వీళ్ళ గోల్ ఏంటో తెలియదు. వాళ్ళకి ఉన్న నాలెడ్జి పంచుతున్నారా? తెలుగు ప్రేక్షకులకి మంచి తెలుగేతర సినిమాలు పరిచయం చేస్తున్నారా? “film making” మాత్రమే డిస్కస్ చేస్తున్నారా? What ever it is…Wish you all the best guys.

ఫిబ్రవరి 19, 2008

గూగుల్ పేజ్‌ ర్యాంకు

Filed under: సరదాకి — శ్రవణ్ @ 12:25 సా.
Tags: ,

నా బ్లాగుకి గూగుల్ పేజ్‌ర్యాంకు 4/10.
నా పేజీకి యెవరు లింక్ చేస్తున్నారబ్బా. 🙂

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.