దిల్ సే …

ఫిబ్రవరి 22, 2008

తెలుగు సినిమా – Myth and The Reality

నేను సినిమాలు చూస్తాను; కాని బ్లాగుల్లో బాగా విశ్లేషించి రాసేంత “సినిమా” నాకు లేదు. ప్రతీ తెలుగు బ్లాగులోనూ తెలుగు సినిమాల గురించి అడపాతడపా రాస్తూనే వుంటారు(రాశి పరంగా మరియు వాసి పరంగా). సినిమాల గురించి రాయక పోతే వాళ్ళు తెలుగు వాళ్ళెలా అవుతారూ? వాళ్ళ విశ్లేషణలు నచ్చినా కొన్ని విషయాల్లో నేను ఏకీభవించలేక పోయాను. ఎప్పణ్ణించో దాన్ని కక్కేద్దామంటే టైము దొరకట్లేదు. ఇదో ఇప్పటికి కుదిరింది.

కొంత మంది అంటుంటారు, “కొంపలు మునిగిపోతున్నై, తెలుగు సినిమా నాశనమై పోతూన్నది అని”. I don’t agree with this, I don’t completely write this off though.  ప్రతీ సినిమా “శంకరాభరణం” అయితే శంకరాభరణం కి వాల్యూ యేముంది. అయినా, ఒకతరహా చిత్రాలు మాత్రమే మంచి చిత్రాలు అనుకోవడం అమాయకత్వమే.  అలాగే, చూసేవాళ్ళున్నారు కదా అని “చిత్రం”, “ఆంటీ” లాంటి సినిమాలు తియ్యడం ఎంతవరకు సబబు? సామాజిక బాధ్యత ఉండఖ్ఖర్లేదా?

మాస్ సినిమాల గురించి…
నాకోవిషయం అర్థం కాదూ…మాస్ సినిమాలతో తప్పేంటి? “రొటీన్ స్టైల్ బోర్” అంటే అర్థం ఉంది. నా ఒక్కడికి మాస్ సినిమాలు నచ్చట్లేదు మీరంతా “స్వాతికిరణం” చూడమనటం దారుణం. 20ల్లో మాస్ సినిమా ఎంజాయ్ చెయ్యకపోతే, ఇంకెప్పుడు 60 ల్లో చేస్తారా? హీరో అన్న తర్వాత విల్లన్ని కొట్టకుండా పక్కన కూర్చోపెట్టుకుని “సగర మందాత్రాది…” అని పద్యం పాడాలా?

ఆర్ట్ సినిమాల గురించి…
“సిరా” లాంటి సినిమా కిచ్చే విలువ ఎలాగూ ఇస్తాం, కాని అన్ని సినిమాల్నీ ఇట్టా తీస్తే సినిమా(మనకి సంబంధించి నంత వరకూ) కి వున్న basic purpose అయినటువంటి ఎంటర్తైన్మెంట్ మిస్ అయిపొతాముకదా! అయినా మంచి సినిమాలు రావట్లేదని ఎవెరన్నారూ…”బొమ్మరిల్లు” నచ్చని తెలుగువాళ్ళు ఉంటారా(60 దాటని వాళ్ళు). అయినా ఓ కత్తిలాంటి ఆర్ట్ మూవీ చూడ్డానికి థియేటర్ దాకా వెళ్ళి డబ్బులు ఖర్చుపెట్టి, ఏడ్చి రావాలా? మీలో యెవరైనా “గాంగ్‌లీడర్” గానీ “రౌడీ అల్లుడు” లేదా “ఘరానా మొగుడు” రిలీజ్ అయినప్పుడు 20,25 ఎళ్ళ వయస్సు లోపు ఉండి ఉంటే ఆ సినిమాలు ఎంజాయ్ చెయ్యలేపొయ్యుంటే చెప్పండి. “గాయం” లాంటి మాంఛి మాస్ సినిమాల్తో ఏంటి ప్రొబ్లెం.  ఎటొచ్చీ, ప్రాబ్లెం “అరుణ్ పాండ్యన్” రొటీన్ మెట్ట యాక్షన్ సినిమాలనీ “గాయం” లాంటి మాస్ మసాలా సినిమాల్నీ ఒకేగాట కట్టెయ్యటంతోనే.

ఇక “navatarangam.com” జనాల గురించి… తెలుగు వాళ్ళలో నాకు తెలిసినంతలో థియేటర్‌కి వెళ్ళి సరదాగా సినిమా చూసేవాళ్ళే ఎక్కువ మంది. ఆలోచిస్తూనో లేదా ఏడుస్తూనో సినిమా చూస్తే అలిసిపోయి బయటికి వస్తారేగానీ అనందంగా కాదు. దీన్ని product launching తో పోలిస్తే ఒక plasma T.V  హైదరాబాద్ లో ఓకత్తి లాంటి షోరూంలో పెట్టి అమ్మితే అర్థం ఉంది గానీ నక్కబొక్కలపాడు లో షో్రూం పెడతానంటే ఎలా? ఇప్పటి మాస్ సినిమాలే రైట్ అనికాదుగానీ వీళ్ళు discuss చేసుకునే అవార్డు సినిమాలు చూడ్డానికి సగటు (తెలుగు) ప్రేక్షకుడు సిద్ధంగా లేడు అని నా అభిప్రాయం.
but one thing is for sure…These guys are doing a fabulous job… in terms of the effort they put in and in terms of the passion they show. వీళ్ళ గోల్ ఏంటో తెలియదు. వాళ్ళకి ఉన్న నాలెడ్జి పంచుతున్నారా? తెలుగు ప్రేక్షకులకి మంచి తెలుగేతర సినిమాలు పరిచయం చేస్తున్నారా? “film making” మాత్రమే డిస్కస్ చేస్తున్నారా? What ever it is…Wish you all the best guys.

ప్రకటనలు

24 వ్యాఖ్యలు »

 1. శ్రవణ్ గారూ,
  ముందుగా మంచి సినిమా అంటే కళాత్మక(ఆర్ట్) సినిమా అని మేమెవ్వరం అనలేదు. అవి సందేశాత్మక చిత్రాలయివుండాలని కూడా నేను కోరుకోవటం లేదు. అలాగే ఏడుపుగొట్టు సినిమాలూ కాదు. మేము కోరుకునేది మేలైన వినోదమే. సాహిత్యంలో, సంగీతంలోనూ అలాగే మిగిలిన కళల్లోనూ వివధ స్థాయిలున్నట్టే సినిమాల్లోనూ వేర్వేరు స్థాయు సినిమాలుంటాయి. కానీ మనకి అవి లేవు. అన్నీ దాదాపు ఒక హీరో హీరోయిన్ ని ప్రేమించడం. ఆమె కోసం హీరో వెళ్ళి పది మంది ని తన్నడం. 90 శాతం సినిమాలు ఇవేకదా మనకి.
  రెండో విషయం- నవతరంగం లో మేము అన్నీ అవార్డు సినిమాల గురించే రాస్తున్నామంటే మీరు పూర్తిగా చదవలేదేమో. మంజుల గారు చాలా మంచి సినిమాలు పరిచయం చేసారు. వాటిలో వినోదం పాళ్ళు ఎంతో చూస్తే మీకే తెలుస్తుంది. అలాగే ప్రసాద్ పరిచయం చేసిన సినిమాలూ, సౌమ్య పరిచయం చేసిన సినిమాలు కూడా. మేము మంచి (ఏది మంచి ఎవరికి మంచి అంటే, మాకు మంచి అనిపించిన) సినిమాలను నలుగురికీ పరిచయం చేయాలన్నదే మా ఆశ.
  చివరిగా, రౌడీ అల్లుడు చూసి నేనూ డ్యాన్సులేసాను. అందులో నేను చిరంజీవిని ఒక నటుడిగానే చూసాను. అలాగే ఘరానా ముగుడైనా గ్యాంగ్ లీడర్ అయినా… అలాగే చాలా బాలకృష్ణ సినిమాలు కూడా…కాకపోతే అప్పుడు కులాల గొడవ లేదు. వంశధ్ధారణ లేదు. సినిమా పేరుతో రాజకీయంగా బలపడాలనీ లేదు. అప్పుడు సినిమా కేవలం వినోదం కొసమే. ఇప్పుడు అలాగే వుందంటారా పరిస్థితి?

  వ్యాఖ్య ద్వారా venkat — ఫిబ్రవరి 22, 2008 @ 5:50 సా. | స్పందించండి

 2. navatarangam.com లింకు సరిగా లేదు. చూడండి

  వ్యాఖ్య ద్వారా venkat — ఫిబ్రవరి 22, 2008 @ 5:55 సా. | స్పందించండి

 3. TO BE FRANK.. సినిమా ఇలా ఉండాలని, అలా ఉండకూడదని ఏమి రూల్స్ లేవు. కాకపోతే ఒకే టైపు సినిమాలను భరించడం కష్టం. (ఒక సినిమాలో అన్ని పాటలు ఒకడే పాడేయడం లాగ అన్నమాట).

  వ్యాఖ్య ద్వారా KRISHNA RAO JALLIPALLI — ఫిబ్రవరి 22, 2008 @ 5:56 సా. | స్పందించండి

 4. బాగా వ్రాసారు శ్రవణం గారు (కొన్ని సాంఖ్యాత్మక లోపాలు లేక పోలేవు). దీనినే కొంత సాన పెట్టి (బ్లాగు స్థాయికి మించి పత్రిక స్థాయిలో వ్రాసి) నవతరంగానికి పంపివుంటే అక్కడ ప్రచురించేవారం గదా… ప్రస్తుతానికి లంకె వేసి సరిపెట్టుకున్నాం.

  ఇక ఓ నవతరంగుడిగా నేను చెప్పేది (వేంకట్ గారు చెప్పిందానికి పెద్ద వేరే కాదు) …
  మాస్ సినిమాలు తీయవద్దు అని ససేమిరా అనట్లేదు. తీసేవాటిని శంకర్ దాదా MBBS లా కాకుండా మున్నాభాయి MBBS స్థాయిలో తీయమని మొత్తకుంటున్నా…
  అలానే ప్రేక్షకుల బుఱ్ఱలను బూజుపట్టించ వద్దని మనవి వారికి. పదహారేళ్ళ వయసు కూడా మాస్ సినిమానే..
  హలో బ్రదర్ లా తీయండి అల్లుడా మజా౨కా వద్దు అని.

  మీ ప్రోత్సాహానికి హార్దిక కృతజ్ఞతలు.
  త్వరలో నవతరంగంలో నేనెందుకు వ్రాస్తానో అనే మంచి వ్యాసం వ్రాస్తాను (క్రెడిట్ మీకే)….

  వ్యాఖ్య ద్వారా రాకేశ్వర రావు — ఫిబ్రవరి 22, 2008 @ 6:10 సా. | స్పందించండి

 5. నతరంగం కాదు నవతరంగం 🙂

  వ్యాఖ్య ద్వారా రాకేశ్వర రావు — ఫిబ్రవరి 22, 2008 @ 6:12 సా. | స్పందించండి

 6. venkat గారూ,
  వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలు. 3 విషయాలు.
  1. నేను మీ వెబ్‌సైటు ని పూర్తిగా follow అవ్వని మాట వాస్తవం.
  2. ఇది చాలామంది సినిమాల గురించి రాసిన ఆర్టికల్స్ కి నేను రాద్దామనుకున్న వ్యాఖ్యల సంగ్రహం.
  “ఇక“natarangam.com” జనాల గురించి…” అన్న దాని తర్వాతది మాత్రమే మీ వెబ్సైటుని గురించిన వ్యాఖ్య.
  3. మిమ్మల్ని విమర్శించే ఉద్దేశం ఏమాత్రమూ లేదు. Just wanted to make a point that….
  “I couldn’t make out if you had a focused goal and moving in that direction.”. నిజానికి, “you are doing a fabulous job” అనీ, all the best” అనీ అన్నాను.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — ఫిబ్రవరి 22, 2008 @ 6:13 సా. | స్పందించండి

 7. tags లో “నవతరంగం” ఉండటం నేను మిమ్మల్ని విమర్శిస్తున్న అభిప్రాయం కలిగించిందనుకుంటా! అందుకే దాన్ని తీసేశాను.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — ఫిబ్రవరి 22, 2008 @ 6:22 సా. | స్పందించండి

 8. శ్రవణ్ గారూ,
  మమ్మల్ని విమర్శించే ఉద్దేశం ఏ మాత్రమూ లేదంటే చాలా నిరాశగా వుంది. మమ్మల్ని విమర్శించమనే మా ప్రార్థన. మేమేదో పోటుగాళ్ళమని ఇక్కడ(నవతరంగంలో) రాయటం లేదు. అలా అని అంతా తెలిసే మేము రాయటం లేదు. తెలుసుకుందామనే రాస్తున్నాము. నా మటుకు నాకు రాస్తే నా ఆలోచనలకు ఒక క్లారిటీ వస్తుందని నా అభిప్రాయం.అదే ఉద్దేశంతో 24fps లో రాసేవాడీని. అప్పుడే నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని తెలిసి అలాంటి వాళ్ళకోసం ఒక వేదిక నవతరంగం అని తెలియచేస్తున్నాను. మీ విమర్శలను (ఆ మాటకొస్తే ఎవరి విమర్శలనైనా) నిర్మాణాత్మక ధోరణిలో స్వీకరించగలిగే వారే నవతరంగం రచయితలందరూ. సో, మీకు విమర్శించాలనుపిస్తే తప్పకచేయండి.

  వ్యాఖ్య ద్వారా venkat — ఫిబ్రవరి 22, 2008 @ 6:36 సా. | స్పందించండి

 9. అలాగే ట్యాగ్ కూడా మళ్ళీ పెట్టండి…ఫర్వాలేదు.

  వ్యాఖ్య ద్వారా venkat — ఫిబ్రవరి 22, 2008 @ 6:39 సా. | స్పందించండి

 10. శ్రవణ్,

  మీరు ఇప్పుడు నేను చెబితే నమ్మరేమో కానీ ఎగ్జాక్ట్లీ ఇదే వ్యాసం నేను రాద్దామనుకున్నాను. దాదాపు తొంభై శాతం ఇదే కంటెంటుతో 🙂
  ఇకపోతే నేనూ మీలాగే సినిమా అంటే ఒక ఎంటర్టెయిన్మెంటు మీడియం అని నమ్మే వాడిలో ఒకడిని. ఇంతకు ముందు రాకేశ, వెంకట్ గారి బ్లాగులలో కూడా అదే చెప్పాను.

  కానీ ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్య నాకు ఆ వినోదం మన సినిమాల ద్వారా దొరకట్లేదు. మొన్న “కృష్ణ” అని రవితేజ సినిమా చూసాను. చెత్తగా ఉంది. దానికి ఒక రివ్యూ కూడా అవసరం లేదనిపించింది. అలాగే ఠక్కున ఈ మధ్య రిలీజయిన మంచి సినిమా గురించి చెప్పమంటే నే చెప్పలేను. హాపీడేస్ చూసినప్పుడు నాకు నచ్చినా ఇప్పుడంత గొప్పగా అనిపించట్లా. బొమ్మరిల్లు నాకు నచ్చిన మంచి సినిమా, అలాగే ఆనంద్, గోదావరి లాంటివి కూడా.
  మరి ఏడాది, రెండేళ్ళ కోసారి మాత్రమే ఇలాంటి సినిమాలొస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇక్కడొక నిజం చెప్పాలంటే నేను ఈ మధ్యగా చూస్తున్న మంచి ఇంగ్లీషు సినిమాలన్నీ సరయిన తెలుగు సినిమాలు లేకపోవడం వల్లనే.

  నవతరంగం సినిమా ఒక రివల్యూషను తీసుకురావాలనీ, సందేశాలు అందించాలనీ, వెరయిటీ సినిమాలు మాత్రమే తీయాలనీ అంటున్నట్టే నాకూ తోస్తుంది కానీ నిజం అది కాదన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే వెంకట్ గారిని కొద్ది కాలం నుంచి నేను ఫాలో అవుతున్నాను కాబట్టి. మంచి సినిమాలు రావాలన్నదే వారి లక్ష్యంగా తోస్తుంది.

  ఇప్పటికే వ్యాసం లాంటి వ్యాఖ్య అయినట్టుంది. ఉంటా 🙂

  వ్యాఖ్య ద్వారా ప్రవీణ్ గార్లపాటి — ఫిబ్రవరి 22, 2008 @ 8:00 సా. | స్పందించండి

 11. అయ్యా

  మాసు క్లాసుల గురించి మాట్లాడను కాని, నాకు నచ్చిన తెలుగు దర్శకులలో వంశీ ఒకడు. ఆయన చిత్రాలు చాలా naturalగా ఉంటాయి. అవి ఏడుపుగొట్టు చిత్రాలు కావే? నాకు escapist చిత్రాలతో problem లేదు. కాని చిత్రాలు realisticగా ఉండాలి అని కోరుకుంటాను. తెలుగు ఒక మంచి కామెడి వచ్చి ఎన్ని రోజులయింది?

  వ్యాఖ్య ద్వారా Manjula — ఫిబ్రవరి 22, 2008 @ 9:31 సా. | స్పందించండి

 12. మీ లాజిక్కులో లోపాల్ని ఆల్రెడీ నవతరంగులు కడిగి ఎండేశారు కాబట్టి ఆ విషయంలో నేను కొత్తగా చెప్పేది ఏం లేదు.

  మీరనే మాస్ సినిమాల్ని కూడా ఎంటర్టెయినింగా తియ్యొచ్చు. ప్రతిభ ఉన్న దర్శకులు ఉండీ ఆ మాత్రం కూడా చెయ్యట్లేదని నా మొదటి ఫిర్యాదు. నాకు సింహాద్రి సినిమా చాలా నచ్చింది. థియెటర్లోనే ఏడు సార్లు చూశా. ఇప్పటి వరకూ ఆ మాత్రం సినిమా మళ్ళీ నా కంట బళ్ళా.

  సంవత్సరానికి వంద – రెండొందల మధ్య తయారవుతున్న కొత్త సినిమాల్లో కేవలం ఒక్క ఐదు శాతం కళాత్మక విలువల్తో తియ్యొచ్చు .. తియ్యట్లేదు .. ఇది నా రెండో అభియోగం.

  ఒకసారి ప్రవీణ్ ఏదో నాగార్జున సినిమా (మన్మథుడు అనుకుంటా) తన బ్లాగులో రాస్తే, నేను ఎబ్బే నాకేం నచ్చలేదు అన్నా.. ఎందుకు నచ్చలేదో చెప్పా. తను దానికి సమాధానంగా .. తెలుగు సినిమా గురించి ఆలోచించడం ఎందుకూ అన్నట్టు ఏదో అన్నాడు. ఎందుకు ఆలోచించ కూడదూ అని నా ప్రశ్న. అసలు ఆలోచించకుండా ఎలా ఉంటారో నాకు అర్ధం కావట్లా. ఇక్కడ వ్యక్తిగత అభిరుచుల్నీ, అభిప్రాయాల్నీ కాసేపు పక్కన బెడితే .. నేను మూడున్నర గంటల నా కాలాన్ని వెచ్చించి (థియెటర్లో చూస్తే డబ్బు సమయం రెండిటి ఖర్చూ ఇంకా ఎక్కువే) నన్ను వినోదింప చెయ్యమని నా బుర్ర దర్శకుడి చేతిలో పెట్టి కూర్చుంటే .. I want to be entertained! ఒక టీ షర్టు కొనడానికి పది డాలర్లు వెచ్చిస్తే మనం పెట్టిన ఖర్చుకి గిట్టుబాటైందని చూసుకోమా?

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఫిబ్రవరి 22, 2008 @ 10:28 సా. | స్పందించండి

 13. ఇందులో నవతరంగం ప్రస్తావన లేకుంటే, నేను చదివేదాన్ని కాదేమో బహుశా… అలా జరిగి ఉంటే, అసక్తికరమైన టపా మిస్సయేదాన్ని. నవతరంగం నాన్ ఆర్టు సినిమాల్ని, నాన్ అవార్డు సినిమాల్ని గురించి రాయదు అని ఎలా చెప్తున్నారు? ఎటొచ్చీ, ఇది full hyderabad.com తరహా సైటు కాదు. వచ్చే ప్రతి తెలుగు-హిందీ-ఇంగ్లీషు సినిమాల గురించి రాసేయడమైతే కాదు అక్కడ ఉద్దేశ్యం. అందుకని మీకు అలా అనిపించిందేమో. అంతర్జాతీయ సినిమా ని కూడా కవర్ చేయాలంటే, అప్పుడు మనకు వ్యక్తిగత కాలపరిమితి ఎంతో ఉంటుంది. కనుక… మీరు ఆ విషయం లో వర్రీ అవకండి..నవతరంగం ఆర్టు సినిమాలకీ మరియు అవార్డు సినిమాలకి మాత్రమే అన్న అపోహ పెట్టుకోకండి… wait and see.. 🙂

  వ్యాఖ్య ద్వారా Sowmya — ఫిబ్రవరి 23, 2008 @ 2:45 ఉద. | స్పందించండి

 14. కొత్త పాళీ గారు చెప్పింది దీని గురించనుకుంట
  http://praveengarlapati.blogspot.com/2007/03/blog-post_07.html

  వ్యాఖ్య ద్వారా ప్రవీణ్ గార్లపాటి — ఫిబ్రవరి 23, 2008 @ 7:09 ఉద. | స్పందించండి

 15. శ్రవణ్ గారూ, నాకు తెలిసి మన తెలుగు బ్లాగర్లు అందరూ,(లెదూ కనీసం 95 %), క్లాస్, మాస్ అనే వివక్షత చూపించే వాళ్ళు అని నేననుకోను. ఓ క్లాస్ ఇంగ్లీషు సినిమా, పక్కనే ఓ ఘరానా మొగుడు ఆడుతుంటే, ఘరానా మొగుడే చాలా మంది చాయిస్ (కనీసం 95 %). అలా కాపోతే, అతను తెలుగోడే కాదు :-).

  అయితే ఇక్కడ జరిగే చర్చల్లో, సినిమాలో నిబద్ధత గురించే బేసిక్ గా చర్చ. యేదో నాలుగు సుమోలు పేల్చి, నాలుగు కామెడీ సన్నివేశాలు జోడించి (ఉదా: కృష్ణ సినిమా) సినిమా హిట్ అంటే (అనిపిస్తే) బాధగానే వుంటుంది. అలానే సాఫ్టు వేరు ఇంజినీర్ గా కంపనీలో చేరిన వ్యక్తి, 2వ రోజే యేదో సర్వర్ సమస్య సాల్వ్ చేసి, కేజీల కొద్దీ ప్రింట్ అవుట్లు తీయడం (ఓ వెంకటేష్ సినిమా)., ఇలాంటి మతి లేని సినిమాలను, ఆ సినిమా నిబద్ధతనూ కడగడం లో తప్పు లేదు కదా.

  వ్యాఖ్య ద్వారా రవి — ఫిబ్రవరి 25, 2008 @ 6:56 ఉద. | స్పందించండి

 16. శ్రవణ్ @
  బొమ్మరిల్లు నచ్చని వాళ్లూ ఉన్నారు.
  ఘరానా మొగుడు నచ్చని వాళ్లూ ఉన్నారు.

  “కొంపలు మునిగిపోతున్నై, తెలుగు సినిమా నాశనమై పోతూన్నది అని” : సినీ విమర్శకులతో వచ్చిన చిక్కే ఇది. క్లాస్ దృష్టితో మాస్ సినిమా విశ్లేషణ సరికాదు. పక్క వాళ్లతో పోలికలొకటి.

  Ravi@

  “కృష్ణ” సినిమాలో కేవలం కామెడీ కోసం చూసా. మిగతా వాటిని పట్టించుకుంటే చూడడమే దండగ. దీన్ని మంచి సినిమా అంటే ఫీల్ అవ్వాలి కానీ, హిట్ అంటే ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నాలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు దాన్ని చూడ్డానికి.

  వ్యాఖ్య ద్వారా Sat — ఫిబ్రవరి 25, 2008 @ 11:25 ఉద. | స్పందించండి

 17. […] చక్కని వాదంతో దిల్‌సే రాసిన ఈ జాబు చూడండి. మంచి చర్చ కూడా […]

  పింగ్ బ్యాక్ ద్వారా పొద్దు » Blog Archive » 2008 ఫిబ్రవరి బ్లాగోగులు — మార్చి 7, 2008 @ 5:16 సా. | స్పందించండి

 18. jalsa lo power star iragadeesadu velli choodandi

  వ్యాఖ్య ద్వారా dadapeer — ఏప్రిల్ 17, 2008 @ 11:21 ఉద. | స్పందించండి

 19. jalsa lo pavan kalyan iragadeesadu velli choodandi

  వ్యాఖ్య ద్వారా dadapeer — ఏప్రిల్ 17, 2008 @ 11:23 ఉద. | స్పందించండి

 20. దాదాపీరు గారు ఇలా సెలవిచ్చారు.
  “jalsa lo pavan kalyan iragadeesadu velli choodandi.”
  నిజమే అల్లే ఉంది. మొన్న థియేటరు పక్కగా వెళ్తుంటే సినిమా చూసిన వాళ్ళు నడుములు పట్టుకుని మూలుక్కుంటూ బయటికి వస్తున్నారు. బాగానే విరగదీసినట్టున్నారు.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఏప్రిల్ 17, 2008 @ 7:37 సా. | స్పందించండి

 21. very good

  వ్యాఖ్య ద్వారా subrahmanyam — ఏప్రిల్ 19, 2008 @ 11:21 ఉద. | స్పందించండి

 22. I agree with most of what you said. However, I feel the problem lies some where else.

  వ్యాఖ్య ద్వారా Kathi Mahesh Kumar — ఏప్రిల్ 19, 2008 @ 3:45 సా. | స్పందించండి

 23. mi aArtIcles bAgUnnAI

  వ్యాఖ్య ద్వారా Raj — జూన్ 13, 2008 @ 2:58 సా. | స్పందించండి

 24. Plz send..,,,,,,,,,

  వ్యాఖ్య ద్వారా Muralidhar Rao M — అక్టోబర్ 28, 2008 @ 2:24 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: