దిల్ సే …

మార్చి 20, 2008

సినిమా తీద్దాం రా!

not happening!

not happening!

not happening!

అనుకుంటూ కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు ఏకలింగం™. యేదయినా సాధించాలన్న ఆశ వాళ్ళావిడ తనని సాధించడం మొదలుపెట్టటంతో చచ్చిపోయింది. కానీ యెప్పటికయినా ఒక తెలుగు సినిమా డైరెక్టు చెయ్యాలన్న ఆశ ఒకమూల వుండి పోయుంది. కొన్నాళ్ళుగా ప్రాజెక్టూ మారలేదు, పెళ్ళయ్యాక కంపెనీ మారే ఉద్దేశ్యమూ లేదు. దాంతో ఆ ఆశని బయటకితీసి ఒక రూపాన్నివ్వసాగాడు. నెట్ మీద పుస్తకాలు చదివాడు. వీకెండు “తొక్కలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ” లో ట్రెయినింగ్ తీసుకున్నాడు. ఫ్రెండ్సుని కలవమన్నాడు. ఒకరిద్దరు సరే అన్నా అది కార్యరూపం దాల్చలేదు. అతి కష్టమ్మీద ఒక ప్రొడ్యుసర్ని దొరకబుచ్చుకొన్నాడు. తన పేరు కోటిలింగాల చౌదరి.

చౌదరీ, తనూ ఒక హొటల్‌లో మొదటిసారి కలిశాక “మాంఛి” సినిమా తియ్యాలని ఒక నిర్ణయానికొచ్చారు. స్టొరీ డిస్కషన్స్ కోసం ప్లాన్ చేస్తుంటే ఫోనొచ్చింది. అటు కోటిలింగాల చౌదరి. చౌదరి అన్నాడు, “లింగం, మన ఇండస్ట్రీలో స్టొరీతో కాదయ్యా సినిమా మొదలు పెట్టేదీ, ముందు హీరో డేట్సు కావాలి. మన ప్రొడక్షను ఆఫీసుకొచ్చెయ్” అని. చాలా తర్జన భర్జనల తర్వాత వేటకెళ్ళేటప్పుడు పులికుండే కళ్ళ లాంటి కళ్ళున్న హీరో ని అప్రోచ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. సూట్‌కేసు నిండా నోట్ల కట్టల్తో బయల్దేరారు, బుక్ అయితే అప్పుడే అడ్వాన్సు ఇవ్వాలిగా మరి! తీరా చూస్తే ఆయనేమో యేడాదికి ఒక్కసినిమానే చేస్తాడు, మూడు నాలుగేళ్ళదాకా బుక్కయిపొయ్యాడు. ఈసురోమంటూ ప్రొడక్షను ఆఫీసుకి వచ్చేశారు.
ఫుల్ల్ మాస్ ఫాలోయింగున్న ఇంకో హీరోని బుక్‌చేసుకుందామనుకున్నారు. ఆయన ఈమధ్య బాగా సన్నబడి స్మార్ట్‌గా తయరయ్యాడు. ఆయనేమో ఎవ్వడు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడికి డేట్లు ముందు ఇస్తాడంట. “మరి ముందు బుక్ చేసుకున్నవాడి సంగతేంటి? ఇంక ఈలెక్కన సినిమా ఎప్పటికి పూర్తవ్వాలీ?” అన్నాడు చౌదరి. “సార్ మనం మంచి లవ్‌స్టోరీ చేద్దాం. నాదగ్గర మెస్సేజ్‌తో, సెంటిమెంట్, లవ్ కలిపిన స్టోరీ వుంది. యూత్‌కి లవ్‌స్టోరీ, ఫామిలీస్‌కి సెంటిమెంట్” అన్నాడు ఏకలింగం™. చౌదరి ఎలాగోలా కన్విన్స్ అయ్యాడు. సూర్యకిరణ్ అని అందంగా వుండి అదృష్టం లేని హీరోని పట్టేశారు. డేట్సు సులభంగానే దొరికాయి. ఎంత గొడవ పెట్టినా చౌదరి వింటేగదా. కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తియ్యడానికి తనేమీ Steven Spielberg కాదు. ఇదే అదనుగా ఇది లవ్‌స్టోరీ అనీ, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదిలేదని చెప్పేశాడు.

హీరోయిన్‌ని వెతికేటప్పటికి తలప్రాణం తోకకొచ్చింది. ముంబాయి అంతా తిరిగి పుల్లలాటి పుల్లా లింగానియా ని పట్టారు. ఈసారీ ఏకలింగం™ గొడవపెట్టాడు. చివరికి పంతం నెగ్గించుకొన్నాడు. (చీర కట్టినప్పుడు) కాస్త తెలుగుదనం కనిపించే ఒక అమ్మాయిని బుక్ చేశారు. మంచి మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నందుకు కెమేరా మ్యాన్‌, మిగతా క్రూ విషయంలో కాంప్రమైజ్ అవ్వక తప్పలేదు.

ఎలాగోలా సినిమా షూటింగ్ అయితే అయ్యింది. అంతా అయ్యేప్పటికి ఏడాది దాటింది. రష్షెస్ చూసిన వాళ్ళ కామెంట్సు విని ఏకలింగం™ దిమ్మతిరిగింది.
“స్టార్సు లేకుండా సినిమా యేంటండీ? యెవ్వడు కొంటాడూ? ”
“సెంటిమెంటు సీన్స్‌లో హీరో దొబ్బెట్టాడు… కనీసం డబ్బింగ్ అయినా వేరొకరితో చెప్పించండి…”
“హీరోయిన్ డబ్బింగు జాగర్త, సునీతని తీసుకోవద్దు. ఆవిడ డబ్బింగ్ తెలుగమ్మాయిలా వుంటుంది.”
“సెంటిమెంటు సీన్సు రీషూట్ చెయ్యాలేమో? ”
“మ్యూజిక్ పర్లేదు”
“ఫూటేజ్ ఇంతతక్కువా… ఎడిటర్ అయిపొయ్యాడే.”
“ఇంత కష్టపడీ మంచి కెమేరా మ్యాన్‌ని పెట్టుకోలేదే?”

రిలీజు చేద్దామంటే డేట్సు కుదరట్లేదు. థియేటర్లన్నీ పెద్ద హీరోలకే బుక్కయిపొయ్యాయి. ఎలాగోలా కొన్ని థియేటర్లు కుదిరాయి. రిలీజ్ అయ్యేలోపు ల్యాబుకి కట్టాల్సిన డబ్బు అమరేట్టు లేదు. చౌదరి తన అసలు ప్లాను చెప్పాడు. “సూర్యకిరణ్ కి తమిళ్‌లో కూడా డిమాండ్ ఉంది. డబ్బింగ్ రైట్సుతో కొంత సొమ్ము చేసుకోవచ్చు” అని. రైట్సు అమ్మారు. అంతా కలిపినా డబ్బు సరిపోలేదు. చౌదరి వాళ్ళావిడ బంగారం అమ్మేశాడు. ఎలాగోలా డబ్బు కట్టేశారు. అయినా ప్రింట్లు రానివ్వట్లేదు. ఏంట్రా అంటే తమిళ్ లో రైట్సు తీసుకున్న వెధవకి అక్కడ ల్యాబు వాళ్ళతో ఏవో గొడవలు. ఎలాగోలా సినిమా రిలీజయింది. యెప్పుడు వచ్చిందో యెప్పుడు పోయిందో యెవరికీ తెలియదు.

ప్రొడ్యుసర్ గురించి నన్నడక్కండి, పత్తా లేడు. మన ఏకలింగం™ వీకెండ్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అటెండు అవుతున్నాడు… రాత్రుళ్ళు మేలుకుని అప్పుడప్పుడూ గొణుక్కుంటుంటాడు “సినిమా తియ్యడం బ్లాగురాసినంత వీజీ కాదు” అని. నెట్ మీద ఇంకా పుస్తకాలు చదువుతున్నాడు. ఈసారి… “ఎదుటి వారిని కన్విన్స్ చెయ్యడం ఎలా?” గురించి…
అప్పుడప్పుడూ పాత ఫిల్మ్ ఇండస్టీ ఫ్రెండ్సు కనిపిస్తే వాళ్ళని టిప్స్ అడుగుతుంటాడు.
“హీరో డేట్సు సంపాదించటం ఎలా?”
“థియేటర్లు రిజర్వు చేసుకోవడం ఎలా?” అని.

———————–
(నాకు ఫిల్మ్ మేకింగ్ మీద పూర్తి అవగాహన లేదు, technical errors వుంటే తెలుపగలరు).
–శ్రవణ్

ప్రకటనలు

6 వ్యాఖ్యలు »

 1. >> ప్రొడ్యుసర్ గురించి నన్నడక్కండి, పత్తా లేడు
  నాకు తెలుసు. హుస్సేన్ సాగర్‌లో ఏదైనా శవం తేలుతూంటాదేమో వెతకండి.

  వ్యాఖ్య ద్వారా నవీన్ గార్ల — మార్చి 20, 2008 @ 11:36 ఉద. | స్పందించండి

 2. chala chala bavundi…..
  technical errors unte evariki kavali cheppandi?
  meeru rasindi saradaga, chakkaga undi… Adi chalu

  వ్యాఖ్య ద్వారా Rajesh — మార్చి 20, 2008 @ 3:43 సా. | స్పందించండి

 3. Hello .. it is very nice. Chala baga wrasaru. Good job. By the way, can you please tell me how to write in telugu in wordpress.com

  వ్యాఖ్య ద్వారా murahari — మార్చి 20, 2008 @ 11:46 సా. | స్పందించండి

 4. @ నవీన్ గార్ల, Rajesh
  థ్యాంక్యూ

  @ murahari
  లేఖిని వాడండి. http://lekhini.org/about.html

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — మార్చి 25, 2008 @ 12:38 సా. | స్పందించండి

 5. good boy..good style..go to become a script writer… sivaji(andhrajyoti cinema news)

  వ్యాఖ్య ద్వారా sivaji.k — జనవరి 23, 2009 @ 6:54 సా. | స్పందించండి

 6. […] కానీ, అంత కంటే గొప్పగా శ్రవణ్ రాసిన “సినిమా తీద్దాం రా!”  మాత్రం చదవండి. భలే సరదాగా […]

  పింగ్ బ్యాక్ ద్వారా కమెర్షియల్ ఫిల్మ్ మేకర్ « Rayraj Reviews — ఫిబ్రవరి 6, 2009 @ 8:47 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: