దిల్ సే …

ఏప్రిల్ 22, 2008

తెల్లకాగితం

అనగనగా ఒక రోజు…
స్థలం: జిల్లా కేంద్ర గ్రంధాలయం
ఎప్పట్లాగే జనాలు నిశ్శబ్దంగా చదువుకుంటున్నారు. ఒక పిల్లాడు ఆత్రుతగా ఎదో పేపర్ని తిరగేస్తున్నాడు. ఆరోజు EAMCET రిజల్సు వచ్చే రోజు. తన నంబర్ కనిపించటంతో ఎగిరి గంతేశాడు. ‘హుర్రే’ అని అరుద్దామంటే అదేమో గ్రంధాలయం. సంతొషంగా బయటకొస్తుంటే బయట అప్పటికే చర్చిస్తూ జనాలు. పరిచయమున్న మొహాలు.
“అన్నా, నాకు EAMCET ర్యాంకొచ్చింది”
వాడి అనందానికి అవధుల్లేవు.
అన్నా అని పిలిపించుకున్న పెద్దాయన కూడా సంతోషించాడు. “EAMCET ర్యాంకు వస్తే ఏంటి? తర్వాత ఏమి చేస్తావు? ఉద్యోగం వెతుక్కోవాలిగా… ఎందుకు ఇంజినీరింగ్? బుద్ధిగా డిగ్రీ చేస్తూ కాంపిటిటివ్ పరీక్షలు రాస్కో…ఆ డిగ్రీ అయిపోయే లోపు నీకు ఏదో ఒక ఉద్యోగం రాకపోదు” సలహా ఇచ్చాడు తన నాలెడ్జీనంతా రంగరించి.

అదే రోజు సాయంత్రం…
స్థలం: పిల్లాడి సొంత వూరి రచ్చబండ
పిల్లాడూ, వాళ్ళ అయ్యా మాట్లాడుకుంటున్నారు. పరీక్షయితే రాశాడు, మంచి ర్యాంకే వచ్చింది. తర్వాత ఏంటి? తండ్రికి ఎన్నాళ్ళు భారంగా వుండటం? EAMCET రాస్తే ఇంజినీరింగ్ చదవాలని తెలుసు. ఇంజినీరింగ్ అంటే మంచి చదువని మాత్రం తెలుసు, అదేంటో తెలియదు. మరి అది కూడు పెడుతుందా? సుబ్బరంగా ఆ అన్న చెప్పినట్టు ఏదయినా చిన్న ఉద్యోగం చేస్తూ, కాంపిటిటివ్ ఎగ్జాంసు రాసుకుంటే వుజ్జోగం వచ్చినప్పటికే వస్తుంది. ఇంతలోపు తండ్రికి సాయంగా ఉండొచ్చని నిర్ణయించుకున్నాడు. దారినపోయే కాపు ఒకాయన వీళ్ళ మాటలు విన్నాడు. “యేందీ, మీవోడికి ర్యాంకు వొచ్చిందంటగా మావోడి కంటే బాగెట్టొచిందీ ఏదొ కంపూటర్ తప్పయుంటది ఇంగోసారి సూస్కోండి” దబాయించి మరీ చెప్పాడు. ఈరోజుల్లో బియ్యే.బియ్యీడీ జేసినా మాఅల్లుడికే ఉజ్జోగాల్లేవు మీవోణ్ణి యేంజేద్దామనేంది? వాళ్ళయ్యకి కాపు చెప్పిందాంట్లో నిజం లేకపోలేదనిపించింది. పిల్లాడు డిగ్రీ చేద్దామని నిర్ణయానికొచ్చాడు.

పేపర్ కట్టింగుని ట్రంకుపెట్టెలో భద్రంగా దాచిపెడుతుంటే… పక్కనే తెల్లకాగితం….తను జీవితంలో ఒకేఒక్కసారి ఫెయిల్ అయిన పరీక్షది. టీచర్ పిలిచి ఎందుకు రాయలేదని అడిగిన సంగతీ… తను నెలరోజులు కూలికెళ్ళిన సంగతీ… చేతులు బొబ్బలు కట్టి పరీక్ష రాయలేకపోయిన సంగతీ… ఒక్కొక్కటే గుర్తుకొచ్చాయి. టీచరు ఎంత మంచిది. ఎన్ని మంచి మాటలు చెప్పింది. తను బాగా చదువుకుని పెద్దవాడవ్వాలని ఎన్ని చెప్పింది. ఎంత ప్రోత్సహించింది.
“ఒకసారి టీచర్ని కలిస్తే …”
అనుకున్నదే తడవుగా అయ్యని బయల్దేరదీశాడు. టీచర్ని వూరు మార్చారుగా, ఆవూరికి.

8 ఏళ్ళ తర్వాత…
అదే రోజు సాయంత్రం…
స్థలం: అదే రచ్చబండ
ఆ వూరినించి ఇప్పుడు 5గురు ఇంజనీర్లు, 2 డాక్టర్లు, ఒక సర్పంచ్ అంతా కుర్రాళ్ళే. వూరికి కరెంటు తెచ్చారు. ఇప్పుడు పెద్ద స్కూలు గురించీ, ఇన్‌స్పిరేషనూ, ఇన్‌ఫర్మేషనూ  తేవడం గురించీ చర్చిస్తున్నారు.

ప్రకటనలు

ఏప్రిల్ 16, 2008

చిరంజీవి రాజకీయాల్లోకి రావాలా?

ప్రత్యేకించి చిరంజీవి, సినిమావాళ్ళు అని కాదు గాని, రావాలండీ బాబూ! ఎక్కడెక్కడ ఈజీమనీ ఉందో, అక్కడక్కడ ఉన్నవాళ్ళంతా రాజకీయాల్లోకి తొందరగా రావాలి. అంటే వీళ్ళంతా సులభంగా సంపాదించేశారని కాదు గానీ. ఏదో ఒక మతలబు చెయ్యకుండా సంపాదించరు కదా ‘ఈజీమనీ’ ని.
రాజకీయాల తర్వాత అంతటి రాజకీయాలుండేది మన సినిమాల్లోనే అంటారు కదా! నాకు తెలిసినంతలో ఈ విషయాలు పేపరువాళ్ళదాకా వచ్చి వేర్వేరు కారణాల వల్ల ఆగిపోతాయి. ఇప్పుడు మన రాజు గారూ, ఇంకా రాజులా ఫీలయ్యే పాత రాజుగారూ, నువ్వు డాష్ అంటే నువ్వే డబుల్ డాష్ అని తిట్టుకుంటున్నారు కదా! జనాలు చూస్తున్నారు. వాళ్ళకి అర్ధమవుతోంది ఎవ్వడు ఏంటి అనేది. చర్చ జరగాలి. ఎవడెలాంటి వాళ్ళన్నది తేలాలి. వీళ్ళు చేసిన మతలబులు అన్నీ బయటకి రావాలి. అప్పుడయినా ప్రజల్లో చైతన్యం వస్తుందేమో చూడాలి. దీని ద్వారా జనాలకి అవేర్‌నెస్ పెరుగుతుంది అని అనుకుంటున్నాను. చంద్రబాబు ఫలానా స్కాము చేశాడు అంటే ఫీలవని జనాలు, మన ముఠామేస్త్రి చిరంజీవి… మన బుద్ధిమంతుడు బాలక్రిష్ణ… ఫలానా స్కాము చేశాడు అంటే ముక్కున వేలేసుకోరా? “అవునా, మరి ఫలానా సినిమాలో ఎంత బుద్ధిమంతుడిలా నటించాడు? ఎంత దారుణం” అనుకోరా? అట్లాగయినా చర్చ జనాల్లో జరగదా?
ఇప్పుడు చూడండి, సినిమా ఇండస్ట్రీ 75 ఏళ్ళనించీ వుంది కదా! ప్రజలు దీనిలోని లొసుగుల గురించి, లోగుట్టుల గురించీ పెద్దగా మాట్లాడరు. రేపు అందులోంచి ఒకరిద్దరు పెద్దవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే నాసామిరంగా… ఇక చూడాలి… నువ్వు ఇది అంటే నువ్వు అది అని తిట్టుకోవడం చూస్తేనన్నా వాళ్ళమీద భక్తి తగ్గి మంచి సినిమాలు వస్తాయేమో. ఇప్పటి దాకా దేవుళ్ళతో సమానంగా ఒక వెలుగు వెలిగిన మన హీరోలు రేపు ఒకళ్ళ మీద మరొకరు బురద చల్లుకుంటారా? కార్టూనిస్టులకి బాగా పని ఉంటుందనుకుంటా.
కామిడీ సంగతి తర్వాత ఇందులో ఒక వ్యాపార సూత్రముంది. బీహారూ, యూపీల్లో లాగ అందరూ స్తబ్దుగా ఉంటే వ్యాపారం జరగదు. డబ్బు కదలాలి, అది కదిలే చోటకి ఒక్కళ్ళు కాదు పది మంది వెళ్ళాలి, పోటీ పడాలి. అప్పుడే అన్ని వర్గాలవాళ్ళూ సంతోషంగా ఉంటారు. హైదరాబాదు ఉన్న ఆటోవాళ్ళూ, హోటలువాళ్ళూ గుంటూరు, జగిత్యాల, నంద్యాల లోని ఆటోవాళ్ళూ, హోటలువాళ్ళ కంటే సంతోషంగా ఉండటానికి ఇదేకారణం అని నా అభిప్రాయం.
రాజకీయాలని మన పల్లెటూళ్ళలోకి తెచ్చిన ఘనత రామారావుకి దక్కినట్టే ఇంకోంచెం ఓపెన్ చేసిన ఘనత తర్వాతతరం సినిమావాళ్ళకి దక్కాలని, పనిలో పని సినిమా ఇండస్ట్రీలో హీరోలని ఆరాధించటం పోయి మంచి సినిమాలు రావడానికి దారి సుగమమవ్వాలని అశిద్దాం.

ఏప్రిల్ 10, 2008

బ్లాగుల నుంచి తెలుగు సినిమా ఏం నేర్చుకోవచ్చు

ఇల్లు కడితే చాన్నాళ్ళుంటుంది, మరి కంప్యూటర్లు ఎందుకు వూరికే క్రాష్ అవుతుంటాయి? ఈ విషయం మీద నేను ఎక్కడో ఇది చదివాను.

“ఆపరేటింగ్ సిస్టంలు వచ్చి కొన్ని దశాబ్దాలు మాత్రమే అయ్యింది. దాంట్లో వాడే ‘ఎక్ష్పీరియన్సు’ తక్కువ విలువైంది. అదే ఇళ్ళు కట్టడానికి వాడే నాలెడ్జి కొన్ని యుగాలనాటిది. they have stood the test of time. కాబట్టి ఆ డొమైన్‌లో నాలెడ్జిని ఇక్కడ వాడుకోవాలి” అంటాడు ఒక పెద్దాయన. మరి, నేను బ్లాగు రాయడం మొదలుపెట్టి ఆరు నెలలు దాటింది. ఈ ప్రాసెస్‌లో వచ్చిన ఒడిదుడుకులని సినిమా తీయాలనే ఔత్సాహికులతో ఎందుకు పంచుకోకూడదు? అనిపించింది. అందుకే ఈ పోస్టు. “మాస్టారూ, “చాల్లే, మన తెలుగు ఇండస్ట్రీనే 75 ఏళ్ళనించి ఉంది” అంటారా? మీరే రైటు. కొత్తవి చెబుదామని మొదలు పెట్టినా, రాయగా రాయగా అన్నీ సినిమా ఇండస్ట్రీలో బేసిక్సే అని అనిపిస్తుంది. అయితేనేం, బేసిక్స్ అన్నింటికంటే ముఖ్యం కదా, అందుకే రాస్తున్నా.

 1. కొత్తదనం కోసం ప్రయత్నం చేయండి. దాన్ని మనస్సు అట్టడుగునించి బయటకి తియ్యండి. ఇదో ఇలా అనుకోకుండా (తెలుగు సినిమా – Myth and The Reality) హిట్ అవ్వచ్చు.
 2. ఏదో కొత్తగా ఉంది కదా అని, జస్ట్ కొత్తదనం కోసం ప్రయత్నించకండి. ఇదిగో ఇలా (శివ..శివ…శివ…, 2 year pinch) ఫట్టవుతుంది. భోజనంలో కూర కూరే అన్నం అన్నమే. కొత్తదనం రుచికరమైన కూరవ్వాలి, అన్నం కాదు.
 3. మొదట్లో ఉన్న విగర్ తర్వాత్తర్వాత అంతగా ఉండదు. నామట్టు నాకు ఇవి (కడిగేస్తాన్ , అనగనగా ఒక “రాజు”, రామోజీరావుకి కోపమొచ్చింది) బాగా వచ్చాయని అనిపిస్తుంది. కాబట్టి నాలుగు నాళ్ళు ఉండే కథలు, నాలుగు రకాల కథలతో మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి. you should look for a career. మీరుపడే కష్టమూ, తపనా మూణ్ణాళ్ళ ముచ్చట కాకూడదు కదా!
 4. ఇన్‌ఫర్మేటివ్ సినిమాలు తియ్యాలి అని, ప్రొడ్యూసరు డబ్బులతో జనాల్ని ఉద్దరించబోకండి. ఇదో ఇలా దారుణంగా (అకాల మరణాలు) ఫట్టవుతారు.
 5. కాముడీ కాముడీనే, సీరియస్ సీరియస్సే. కాముడీ 🙂 ఇంపార్టెన్సు గుర్తించండి. విహారి, తోటరాముడి పోస్టు కోసం చూడండి జనాలు ఎలా ఎదురు చూస్తారో? Don’t get carried away by international movies. Always keep your target audience in mind.
 6. మీకంటూ ఒక ఇమేజ్ ఉంటే ఓపనింగ్స్ సులభంగా వస్తాయి. నవతరంగం, రానారె పోస్టులు ఎంత ఇదిగా చదువుతారో గమనించండి.
 7. మీకు నచ్చింది కదా అని అందరికీ నచ్చాలని లేదు, ఇలా సినిమా తీద్దాం రా! , రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)
 8. అందరికి నచ్చేవిషయాలపై సినిమాలు తియ్యండి, ఇలా (మహేష్ బాబు)
 9. తెలుగు ఇండస్ట్రీలో పరిచయాలు చాలాముఖ్యమని విన్నాను. ఈ పోస్టులో లాగా, ఇక్కడ మన “చావా” పొస్టుని మక్కికి మక్కీ దింపేస్తున్నారు అందరితో మంచి రిలేషన్స్ మెయిటెయిన్ చెయ్యండి. (నేను ఈపోస్టు రిలేషన్స్ మెయిటెయిన్ చెయ్యడం కోసం రాయలేదు, నిజానికి నాగురించి ఇక్కడ నా మొదటి పోస్టులో చెప్పినట్టు, ఎప్పుడూ నాకు తోచిందే రాశాను).
 10. కొన్ని టాపిక్కులు ఇంటెరెస్టింగ్‌గా వుంటాయి. కానీ వాటిల్లో రెండున్నర గంటలు లాగేంత సినిమా వుండదు. full length సినిమా తియ్యడానికి మీ స్టోరీ సరిపోతుందేమో చెక్ చేసుకోండి. లేకపోతే ఇక్కడలా (వెన్నెలా…, అమృతం ) విషయం వున్నా, స్టామినా లేకుండా పోతుంది.
 11. మీరు తీసే సినిమా పూర్తి క్లారిటీతో, పూర్తి స్క్రీన్‌ప్లేతో మొదలు పెట్టండి. క్లారిటీ లేకపోతే ఇదో ఇలా (అమృతం కురిసిన రాత్రి) ఫ్లాపవుతారు.
 12. ఇలాంటి “డింగుటకా” — 2037 లో ఒక సినిమా రివ్యూ by Yo!man™ ఫాంటసీల్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. calculated risk తీసుకోవడం అలవాటు చేసుకోండి. production cost కంట్రోల్ చెయ్యాలంటే ఇది తప్పనిసరి.
 13. ఒక స్టేజిలో రెగ్యులర్‌గా ఏదో ఒకటి రాసేస్తూ ఉండేవాణ్ణి, టాపిక్లో ఎక్కువ ఇంటరెస్టు లేకపోయినా. ఇండస్ట్రీకి వెళ్ళి మిమ్మల్ని ప్రూవ్ చేసుకుంటే మాత్రం, don’t get carried away with success. ఇమేజ్‌ని ఎలాగోలా క్యాష్ చేసుకోకండి. కాస్త నిదానంగా సినిమాలు తియ్యండి, క్వాలిటీ కోసం.
 14. చాలా మంది నాతో ఏకీభవించక పోవచ్చేమోగానీ, సినిమా బాగా తియ్యడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా ప్రమోట్ చెయ్యడం, దాన్ని ప్రదర్శించడానికి డిస్ట్రిబ్యూటర్లూ, థియేటర్లూ దొరకడమూ, రిలీజ్ టైమింగూ అంతే ముఖ్యమని గమనించండి.
 15. ఎంత కష్టపడ్డా అనుకోని ఫ్లాపులూ, ఊహించని హిట్లూ కూడా వస్తాయని గ్రహించండి. అటువంటి వాటికి మానసికంగా సిద్ధంగావుండండి.

-.-:BEST OF LUCK:-.-

ఏప్రిల్ 8, 2008

పొలిటికల్ సెటైర్

Filed under: రాజకీయాలు,సరదాకి,controversial,unbiased — శ్రవణ్ @ 4:44 సా.

రెండే

రెండే ఎకరాలు

.

.

.

.

అంటుంటారు

నోరు జాగర్త

నోరు జాగర్త

.

.

.

.

వళ్ళు జాగర్త

నేను ఏతప్పూ చెయ్యలేదు

నేను ఏతప్పూ చెయ్యలేదు

.

.

.

.

.

.

మా టైంలో స్కాములు అస్సలు లేవు.

మాగురించి ఎందుకు? <–ఈ పక్కన ఆయను తెగతి(oటు)న్నాడు–> ఈ పక్కన ఆయను తెగతింటున్నాడు

పంచాంగ ‘శ్రవణం’ — సెటై్‌ర్

కొత్త సంవత్సరం ఠంచనుగా వచ్చేసింది. అలవాటుగా రంగురంగుల పంచాంగాలు కూడా తెచ్చింది.

 • గులాబీ పంచాంగం ప్రకారం “తెలంగాణ” ఈ యేడాది వచ్చేస్తుంది.
 • పసుప్పచ్చ పంచాంగం ప్రకారం ప్రజలు “తెలంగాణ” ఒక కల అని గుర్తిస్తారు.
 • అదేంటో, ఆకుపచ్చ పంచాంగంలో “తెలంగాణ” గురించి లేనేలేదు.
 • కాషాయపు పంచాంగానికి నార్త్ఇండియా, కర్నాటక గురించి తెలిసినంతగా తెలుగునాడు గురించి తెలియదు.

సందట్లో సడేమియా:
ఊరు ఉత్తరమంటే కాదు దక్షిణమన్నట్టు, ఈ యేడాది 3 గ్రహణాలని అన్ని పంచాంగాలూ చెబుతుంటే ఒకాయన కాదు నాలుగు అని చాలెంజ్ చేస్తున్నాడు.

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.