దిల్ సే …

ఏప్రిల్ 16, 2008

చిరంజీవి రాజకీయాల్లోకి రావాలా?

ప్రత్యేకించి చిరంజీవి, సినిమావాళ్ళు అని కాదు గాని, రావాలండీ బాబూ! ఎక్కడెక్కడ ఈజీమనీ ఉందో, అక్కడక్కడ ఉన్నవాళ్ళంతా రాజకీయాల్లోకి తొందరగా రావాలి. అంటే వీళ్ళంతా సులభంగా సంపాదించేశారని కాదు గానీ. ఏదో ఒక మతలబు చెయ్యకుండా సంపాదించరు కదా ‘ఈజీమనీ’ ని.
రాజకీయాల తర్వాత అంతటి రాజకీయాలుండేది మన సినిమాల్లోనే అంటారు కదా! నాకు తెలిసినంతలో ఈ విషయాలు పేపరువాళ్ళదాకా వచ్చి వేర్వేరు కారణాల వల్ల ఆగిపోతాయి. ఇప్పుడు మన రాజు గారూ, ఇంకా రాజులా ఫీలయ్యే పాత రాజుగారూ, నువ్వు డాష్ అంటే నువ్వే డబుల్ డాష్ అని తిట్టుకుంటున్నారు కదా! జనాలు చూస్తున్నారు. వాళ్ళకి అర్ధమవుతోంది ఎవ్వడు ఏంటి అనేది. చర్చ జరగాలి. ఎవడెలాంటి వాళ్ళన్నది తేలాలి. వీళ్ళు చేసిన మతలబులు అన్నీ బయటకి రావాలి. అప్పుడయినా ప్రజల్లో చైతన్యం వస్తుందేమో చూడాలి. దీని ద్వారా జనాలకి అవేర్‌నెస్ పెరుగుతుంది అని అనుకుంటున్నాను. చంద్రబాబు ఫలానా స్కాము చేశాడు అంటే ఫీలవని జనాలు, మన ముఠామేస్త్రి చిరంజీవి… మన బుద్ధిమంతుడు బాలక్రిష్ణ… ఫలానా స్కాము చేశాడు అంటే ముక్కున వేలేసుకోరా? “అవునా, మరి ఫలానా సినిమాలో ఎంత బుద్ధిమంతుడిలా నటించాడు? ఎంత దారుణం” అనుకోరా? అట్లాగయినా చర్చ జనాల్లో జరగదా?
ఇప్పుడు చూడండి, సినిమా ఇండస్ట్రీ 75 ఏళ్ళనించీ వుంది కదా! ప్రజలు దీనిలోని లొసుగుల గురించి, లోగుట్టుల గురించీ పెద్దగా మాట్లాడరు. రేపు అందులోంచి ఒకరిద్దరు పెద్దవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే నాసామిరంగా… ఇక చూడాలి… నువ్వు ఇది అంటే నువ్వు అది అని తిట్టుకోవడం చూస్తేనన్నా వాళ్ళమీద భక్తి తగ్గి మంచి సినిమాలు వస్తాయేమో. ఇప్పటి దాకా దేవుళ్ళతో సమానంగా ఒక వెలుగు వెలిగిన మన హీరోలు రేపు ఒకళ్ళ మీద మరొకరు బురద చల్లుకుంటారా? కార్టూనిస్టులకి బాగా పని ఉంటుందనుకుంటా.
కామిడీ సంగతి తర్వాత ఇందులో ఒక వ్యాపార సూత్రముంది. బీహారూ, యూపీల్లో లాగ అందరూ స్తబ్దుగా ఉంటే వ్యాపారం జరగదు. డబ్బు కదలాలి, అది కదిలే చోటకి ఒక్కళ్ళు కాదు పది మంది వెళ్ళాలి, పోటీ పడాలి. అప్పుడే అన్ని వర్గాలవాళ్ళూ సంతోషంగా ఉంటారు. హైదరాబాదు ఉన్న ఆటోవాళ్ళూ, హోటలువాళ్ళూ గుంటూరు, జగిత్యాల, నంద్యాల లోని ఆటోవాళ్ళూ, హోటలువాళ్ళ కంటే సంతోషంగా ఉండటానికి ఇదేకారణం అని నా అభిప్రాయం.
రాజకీయాలని మన పల్లెటూళ్ళలోకి తెచ్చిన ఘనత రామారావుకి దక్కినట్టే ఇంకోంచెం ఓపెన్ చేసిన ఘనత తర్వాతతరం సినిమావాళ్ళకి దక్కాలని, పనిలో పని సినిమా ఇండస్ట్రీలో హీరోలని ఆరాధించటం పోయి మంచి సినిమాలు రావడానికి దారి సుగమమవ్వాలని అశిద్దాం.

ప్రకటనలు

8 వ్యాఖ్యలు »

 1. Beehaaru,UP llo laga andaroo stabdugaa vunte ante artham kaaledu andi. ante bihar,up lo andaru silent gaa vuntaru ana? praveen.

  వ్యాఖ్య ద్వారా praveen — ఏప్రిల్ 17, 2008 @ 6:26 ఉద. | స్పందించండి

 2. Brother nuvvu jagtial nunda, i am also from jagtial, but with my knowldege jagtial auto and hotel people are very happy than hyderabad.

  వ్యాఖ్య ద్వారా arvindg — ఏప్రిల్ 21, 2008 @ 1:48 ఉద. | స్పందించండి

 3. idedO bagundanipincimdi, karimnagar bloggerla prapanchamlo irikinchesaanu. abhyantaramaite ceppu tesestanu.

  వ్యాఖ్య ద్వారా arvindg — ఏప్రిల్ 21, 2008 @ 2:05 ఉద. | స్పందించండి

 4. ఈ వ్యాసం ఇక్కడ కూడా ఉంది చూడండి
  http://karimnagar.info/karimnagar-blog/?p=12

  మీకు అనుమతితోనే వాళ్ళు మీ వ్యాసాన్ని ఉపయోగించుకుంటున్నారేమో తెలియదు

  వ్యాఖ్య ద్వారా gsnaveen — ఏప్రిల్ 21, 2008 @ 6:24 సా. | స్పందించండి

 5. G.S.నవీన్ గారూ,
  http://karimnagar.info/ గురించి తెలిపినందుకు కృతజ్ఞతలు. ఆయన పర్మిషన్ అడిగుతూ రాసిన కమెంటు మోడరేషన్ క్యూలో ఉండిపోయింది. నేనేమో ఇదేంటండీ అని ఆయన సైటులో ఒక కామెంటు పడేశాను.

  @ praveen,
  నేనన్నది వ్యాపారంలో స్తబ్ధత గురించి.

  @ arvindg,
  మామూలుగా బ్లాగుల్లో ఎవరైనా తమకి నచ్చిన టపాల గురించి చిన్నదో పెద్దదో సమీక్ష రాసి, లింకు ఇస్తారు. మీరూ అలాగే చేయండి. నా పోస్టులు వేరే వాళ్ళకి వాళ్ళ బ్లాగులో పెట్టాలనిపించిందంటే I am really flattered.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — ఏప్రిల్ 22, 2008 @ 10:27 ఉద. | స్పందించండి

 6. Thanks for your comments, bu the article goe to admin control I dont have access to change the article, i will ask him to put this link

  వ్యాఖ్య ద్వారా arvind — ఏప్రిల్ 22, 2008 @ 12:41 సా. | స్పందించండి

 7. Ee rojullo raajakeeyalu manchi laabhasati vyaapaaram sumandi. Elections mundu invest cheste elections ayyaka choosukovachu migataadi. Ante kaadu, chesina tappulu bayatiki raakundaa kaapaadukovalante Raajakeeya naayakula anda dandalu tappani sari, leda raajakeeya naayakulite inka manchidi. Emantaraau?

  వ్యాఖ్య ద్వారా Sri — మే 14, 2008 @ 5:54 సా. | స్పందించండి

 8. what ever u said is correct.. if he want to serve people.. there r many way to serve.not only throught politics.. that is for earning money.. he is not such a great person.. if he is a great person.. why dont he accept her daughters love?? and we know so many thing about him.. what ever he did in his past life.. i am beliving that he is coming for money and fame..not for the people…

  వ్యాఖ్య ద్వారా anitha — జూలై 7, 2008 @ 10:43 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: