దిల్ సే …

మే 28, 2008

అవే కళ్ళు

Filed under: సరదాకి — శ్రవణ్ @ 12:06 ఉద.
Tags:

అవే కళ్ళు …
కొన్నాళ్ళు నాకై వెదకిన కళ్ళు,
ఇన్నాళ్ళూ నను వేధించిన కళ్ళు,
అంతే అప్యాయంగా, కొంచెం అభ్యర్ధనతో
మళ్ళీ ఇన్నాళ్ళకి
అవే కళ్ళు …

ప్రకటనలు

మే 23, 2008

పూరీ “without oil”

Filed under: మీతో నేను,సరదాకి — శ్రవణ్ @ 5:11 సా.
Tags: , ,

అలా ఆన్‌సైటు నించి వెనక్కొచ్చిన Yo!man™ని అందరూ లావు అయిపొయ్యావు అని గోల చేస్తున్నారు. మనోడు మనలో చాలా మంది లాగే జిమ్ముకెళ్ళాని రోజూ సాయంత్రం అప్పటికప్పుడు నిర్ణయించుకొని, రాత్రి నిద్రలో మరచి పోయేవాడు. ఇక లాభం లేదని, డైటింగ్‌కి దిగాడు.

అదేంటో ప్రతిదానికీ “without oil” అనడం అలవాటు చేసుకున్నాడు. మొన్న ఎలాంటి పెళ్ళాం కావాలీ అంటే “*****(చుక్కలన్నమాట)కట్నం “without oil” అన్నాడు. నిన్న మరీ దారుణమండీ! ఆఫీస్ క్యాంటీన్‌లో పూరీ “without oil” ఆర్డర్‌చేశాడు. అదేంటో పక్కనున్న మా అందరికీ వెంటనే ఫోన్‌కాల్సు వచ్చాయి.

అయినా పూరీ “without oil” ఏంటడీ బాబూ?

మే 14, 2008

నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు
ఆమధ్య హైదరాబాదులో బాంబ్లాస్టులు అయ్యాయని తెలుసు
ఫ్లయ్యోవరు కూలిందని తెలుసు
పేలాక పేలాయనీ, కూలాక కూలిందనీ తెలుసుగాని
అంతకంటే నాకేమీ తెలియదు
నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

-:-:-:-:-:-

పొయినసారి ఎలచ్చన్లొచ్చియి గదా
అన్ని పార్టీలోళ్ళొచిండ్రు, మస్తుగ తాగినం
నిన్న మా భూములు లాక్కున్రు
అళ్ళీళ్ళని కలుపుకొని దర్నాలైతే చేసినం
మా అయ్య ఏడ్చేడ్చి సచ్చిండు
సచ్చినంక సచ్చిండని ఎర్కయింది
గంతకంటే నాకేమెర్కలే
మాదీ గీదేశమే, నాకేమెర్కలే

-:-:-:-:-:-

నేనో సాఫ్టువేర్ ఇంజనీర్ని, నాకేమీ తెలీదు
సమాజం బాగుపడాలని గఠ్ఠిగా అనుకుంటుంటాను
తెలుగు భాష వృద్ధి చెందాలని ఆవేశ పడుతుంటాను
దశాబ్దాలుగా వెధవలు రాజ్యమేలుతున్నారని తెలుసు
ఏదైనా చెయ్యాలని తెలుసు, ఏంచెయ్యాలో తెలీదు
అంతకంటే నాకేమీ తెలీదు
నేనో మధ్యతరగతి భారతీయుణ్ణి,  నాకేం అంతగా తెలీదు

-:-:-:-:-:-

నేనో యన్నారైని, నాకేంపెద్దగా తెలీదు
మొన్న తానా సభలకెళ్ళా
స్కాములు చేస్తున్నారనీ, భూములు దోచుకుంటున్నారనీ తెలుసు
కోటానుకోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని తెలుసు
పేదవాడి నోట్లో మట్టి కొడుతున్నారని తెలుసు
ఏమైనా చెయ్యాలనుంది, టైమేదీ?
నేనూ ఓ సగటు భారతీయుణ్ణి, నాకేం పెద్దగా తెలీదు

-:-:-:-:-:-

నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు
ఆమధ్య హైదరాబాదులో బాంబ్లాస్టులు అయ్యాయని తెలుసు
ఫ్లయ్యోవరు కూలిందని తెలుసు
పేలాక పేలాయనీ, కూలాక కూలిందనీ తెలుసుగాని
అంతకంటే నాకేమీ తెలియదు
నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

మే 13, 2008

I am selling my iPhone

Hi Guys,

I have placed an ad on my campany’s buy&sell portal. I am selling my iPhone. Here I am putting the screenshots. This is not for sale for the blogger community. You guys just enjoy the screenshots meanwhile. I didn’t have a personal webpage to put the screenshots. besides you can have a look at the screenshots. CLICK ON THE IMAGES for a better view of the screen shots

మే 8, 2008

మాతృభాష — ఒక భేతాళప్రశ్న

Filed under: సరదాకి — శ్రవణ్ @ 1:42 సా.
Tags: , , ,

భేతాళప్రశ్నలు అంటే ఏదో ఒక వింత situation ఇచ్చి  “రాజా, ఇప్ప్పుడు చెప్పు” అని భేతాళుడు విక్రమార్కుణ్ణి అడుగుతాడు. ఆ situation ఏమో సామాన్యంగా జరగడానికి వీల్లేకుండా ఉంటుంది. కాని ఇది నిజంగా జరిగింది.

నా మితృడొకతను. ఇతనిది చిత్తూరు. వీళ్ళ నాన్నగారు తెలుగు వారు, చక్కగా తెలుగు మాట్లాడతారు. పెళ్ళిమాత్రం తెలుగు ఏమాత్రం రాని తమిళుల ఇంట్లో చేసుకున్నారు (arranged marriage, same caste). పెళ్ళయ్యాక ఆవిడ చక్కగా తెలుగు నేర్చుకుంది. ఇంట్లో అందరూ తెలుగులోనే మాట్లాడతారు. ఉద్యోగం బెంగళూరులో. వీళ్ళ బంధువులు చాలామంది అక్కడ సెటిల్ అయ్యారు. నామిత్రుడు అక్కడే పుట్టిపెరిగాడు.

కాబట్టి ఇతను తెలుగూ, ఇంగ్లీషూ, హిందీ, అరవం మరియూ కన్నడ చక్కగా మాట్లాడతాడు. తనకి spontanious గా వచ్చే భాష కన్నడ. ఇంట్లో తెలుగు మాట్లాడతారు. తన తల్లిగారు అరవ వారు. పనిచేసేది విదేశంలో కాబట్టి ఎక్కువ మాట్లాదేది ఇంగ్లీషు. అతన్ని అడిగితే నేను తెలుగు వాణ్ణి, బెంగళూరులో పెరిగాను అని చెబుతాడు.

పాఠకరాజా  ఇప్పుడు చెప్పు. ఇతని మాతృభాష ఏమిటి? సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీతల వెయ్యి వ్రక్కలగుగాక!

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.