దిల్ సే …

మే 14, 2008

నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు
ఆమధ్య హైదరాబాదులో బాంబ్లాస్టులు అయ్యాయని తెలుసు
ఫ్లయ్యోవరు కూలిందని తెలుసు
పేలాక పేలాయనీ, కూలాక కూలిందనీ తెలుసుగాని
అంతకంటే నాకేమీ తెలియదు
నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

-:-:-:-:-:-

పొయినసారి ఎలచ్చన్లొచ్చియి గదా
అన్ని పార్టీలోళ్ళొచిండ్రు, మస్తుగ తాగినం
నిన్న మా భూములు లాక్కున్రు
అళ్ళీళ్ళని కలుపుకొని దర్నాలైతే చేసినం
మా అయ్య ఏడ్చేడ్చి సచ్చిండు
సచ్చినంక సచ్చిండని ఎర్కయింది
గంతకంటే నాకేమెర్కలే
మాదీ గీదేశమే, నాకేమెర్కలే

-:-:-:-:-:-

నేనో సాఫ్టువేర్ ఇంజనీర్ని, నాకేమీ తెలీదు
సమాజం బాగుపడాలని గఠ్ఠిగా అనుకుంటుంటాను
తెలుగు భాష వృద్ధి చెందాలని ఆవేశ పడుతుంటాను
దశాబ్దాలుగా వెధవలు రాజ్యమేలుతున్నారని తెలుసు
ఏదైనా చెయ్యాలని తెలుసు, ఏంచెయ్యాలో తెలీదు
అంతకంటే నాకేమీ తెలీదు
నేనో మధ్యతరగతి భారతీయుణ్ణి,  నాకేం అంతగా తెలీదు

-:-:-:-:-:-

నేనో యన్నారైని, నాకేంపెద్దగా తెలీదు
మొన్న తానా సభలకెళ్ళా
స్కాములు చేస్తున్నారనీ, భూములు దోచుకుంటున్నారనీ తెలుసు
కోటానుకోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని తెలుసు
పేదవాడి నోట్లో మట్టి కొడుతున్నారని తెలుసు
ఏమైనా చెయ్యాలనుంది, టైమేదీ?
నేనూ ఓ సగటు భారతీయుణ్ణి, నాకేం పెద్దగా తెలీదు

-:-:-:-:-:-

నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు
ఆమధ్య హైదరాబాదులో బాంబ్లాస్టులు అయ్యాయని తెలుసు
ఫ్లయ్యోవరు కూలిందని తెలుసు
పేలాక పేలాయనీ, కూలాక కూలిందనీ తెలుసుగాని
అంతకంటే నాకేమీ తెలియదు
నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

ప్రకటనలు

13 వ్యాఖ్యలు »

 1. chaala bavundi.

  వ్యాఖ్య ద్వారా Sri — మే 14, 2008 @ 5:43 సా. | స్పందించండి

 2. కూల్, ఆలోచన బాగుంది. ఇంకో నాలుగు మాటలు కలపండి. టపా హిట్టే, అనుమానం లేదు.

  వ్యాఖ్య ద్వారా వికటకవి — మే 14, 2008 @ 7:45 సా. | స్పందించండి

 3. చాలా బావుంది.

  మనసులోని ఆవేదనను బయట పెట్టిన తీరు బావుంది.

  — విహారి

  వ్యాఖ్య ద్వారా విహారి — మే 14, 2008 @ 9:42 సా. | స్పందించండి

 4. చాలా బావుంది.

  వ్యాఖ్య ద్వారా radhika — మే 15, 2008 @ 1:08 ఉద. | స్పందించండి

 5. చాలా బాగుంది. సగటు భారతీయుడ్ని అంతకంటే ఏమీ వ్రాయలేను 🙂

  వ్యాఖ్య ద్వారా నువ్వుశెట్టి బ్రదర్స్ — మే 15, 2008 @ 2:50 ఉద. | స్పందించండి

 6. చాలా బాగుంది

  వ్యాఖ్య ద్వారా subbarao — మే 15, 2008 @ 4:45 ఉద. | స్పందించండి

 7. మన వాళ్ళు ఇంత నిరాసక్తంగా, చైతన్యహీనంగా ఎలా వుంటారన్నది నాకు అంతుబట్టని విషయం.

  వ్యాఖ్య ద్వారా రాజేష్ — మే 15, 2008 @ 1:21 సా. | స్పందించండి

 8. meee vyakyaluu oka sagatu bharathiyudi alochanalaku prathirupammm.. kani nirasa chendakaa loksatta chupina margani samardidammm.. emantaruuu…

  వ్యాఖ్య ద్వారా ashok — మే 15, 2008 @ 2:56 సా. | స్పందించండి

 9. chala bavundi

  వ్యాఖ్య ద్వారా aswin budaraju — మే 15, 2008 @ 3:53 సా. | స్పందించండి

 10. bavundi

  వ్యాఖ్య ద్వారా aswin budaraju — మే 15, 2008 @ 3:54 సా. | స్పందించండి

 11. inta pessimistic gaa raasina mimmalni choostunTE jaalEstunnadi. aa pebuvu meeyandu dayaunchu gaaka 3:16

  వ్యాఖ్య ద్వారా Budugu — మే 20, 2008 @ 10:33 సా. | స్పందించండి

 12. ఓహ్! మీకు అలా అర్థమయ్యిందా, బుడుగు గారూ?

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — మే 21, 2008 @ 1:27 సా. | స్పందించండి

 13. Guru “nenu oka sagatu bharateeyudini”.S it is write but we need not our intimation. what u r doing for society????????????
  But the language that u used is very good.(different fonts)

  వ్యాఖ్య ద్వారా mooli — జూలై 19, 2008 @ 8:15 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: