దిల్ సే …

ఆగస్ట్ 21, 2008

మేడమ్, మీ పేరు శ్రవణ్ కదా?

Filed under: హాస్యం — శ్రవణ్ @ 5:53 సా.

మేడం, మీ పేరు శ్రవణ్ కదా?
-( “.
“నేను ABCD బ్యాంక్ నించి మాట్లాడుతున్నాను, మేడం”
-(
“మీ డేట్ ఆఫ్ బర్త్ xx-xx-xxxx” కదా”
-(-(
“మీ ఆవిడ పేరు…-(“, “మీ ఆవిడ పేరు… aaa కదా”
-(-(-(
“మీ మదర్ maiden name ‘bbb’ కదా”
“ -(-(-(
“సార్, మీరు ఇవాళ బ్రవున్ కలర్ అండర్వేర్ వేసున్నారు కదా”
-x
“సార్. మీ…”
“ఆ, నిజమే… రాజు వచ్చి ఆ ఫైలు కలెక్టు చేసుకుంటాడు”
-(, ఏ ఫైలు సార్”
“నేను చెప్పాకదండీ మంగళవారం”
-(-( సార్, ఏ మంగళ వారం సార్…”, “ -(-( నేను ఫలానా బ్యాంక్ నించి…”
“అబ్బా అదేనండీ, మీరు చెప్పిందే ఎక్కడికి రమ్మనమంటారు?”
-(-( సార్ అదీ… మా బ్యాంకు మీ ఆఫీసు పక్కనే సార్…”
సరే అయితే రెండు కేజీలు పంపించండి.
-(-(-(”, “థ్యాంక్యూ సార్, హావ్ ఏ గుడ్ డే సార్

ప్రకటనలు

ఆగస్ట్ 20, 2008

నెహ్రూవంశం ఏం సాధించింది?

30 ఏళ్ళ పైన దేశాన్నేలినందుకు

 • పెళ్ళాం లేని జీవితం
 • కూతురికి వైథవ్యం
 • మనవరాళ్ళకి వైథవ్యం
 • ఏకులమో చెప్పలేని కులం
 • ఏమతమో చెప్పలేని మతం
 • పోయిన ఇంటిపేరు(నెహ్రూ)
 • రావణకాష్టంలా కాష్మీరు
 • చైనాకి వదిలేసిన సరిహద్దు భూభాగం
 • వ్యక్తిగత జీవితం పై మచ్చ
 • ఎమర్జెన్సీ గోల
 • బోఫోర్సు లీల
 • విదేశీయులనే ఘనత

వీళ్ళు లేకపోతే మనదేశం అల్లకల్లోలమయ్యేదా? ఏమో! 1947తో పోలిస్తే చాలా చాలా బావుంది కదా. పాకిస్తాన్‌తో పోలిస్తే చాలా బావుంది కదా.

ఆగస్ట్ 19, 2008

కాప్షన్ రాయండి — పోటీ

Filed under: హాస్యం — శ్రవణ్ @ 6:09 సా.
ఎంతవారలైనా

ఆగస్ట్ 14, 2008

తెలుగు భాషలో నాకు నచ్చని ఒకేఒక్క పదం — “నెనర్లు”

ఏదో టైటిలు బాగుందని అట్టా అన్నాను గానీ “నెనర్లు” ఒక తెలుగు పదముందంటే నాకింకా నమ్మబుద్ధి కావట్లేదు. నాకు తెలియని బోల్డు తెలుగు పదాలుండొచ్చు, నేను కాదనను. ఈ పదాన్ని దాదాపు ఏడాది నించీ వింటున్నా… ప్చ్… అబ్బే… ఉపయోగించటం సంగతి అటుంచి ఎవరైనా వాడితే అదెంటో ఎబ్బెట్టుగా ఉంటుంది.

ఇది మరీ బావుంది, నువ్వెవరూ ఏది తెలుగో ఏది కాదో నిర్ణయించడానికంటారా… మీరక్కడే తప్పులో కాలేశారు. నేను అది తెలుగు కాదనటంలా. దీన్ని వాడ్డం కాదు కదా వినడానికి కూడా (నాకు) (కష్టంగా ఉంది) ఇష్టంగా లేదు అంటున్నా. ఎంటీ? ఎందుకు? అంటారా… అదో అక్కడికే వస్తున్నా. ఎందుకో తెలీదు ఇది విన్నప్పుడల్లా ఇది అరవ పదానికీ ఇంగ్లీషు ఫీలింగుకీ పుట్టిన మళయాలీ పిల్లపదాన్ని అరబ్బీ వాడినట్టుంటుంది. ఎందుకుంటుందీ అంటే నాదగ్గర సమాధానం లేదు. బహుశా నేను జీవితంలో తిన్న కొన్ని ఢక్కా మొక్కీ లనుకుంటా.

భాష భావాన్ని తెలపడానికి మాత్రమేపుట్టింది అనేది నా ఫీలింగ్. భావాలు ఆచారవ్యవహారాల నించీ, కష్ట నష్టాల నించీ వస్తాయనేది నిర్వివాదాంశం. భావం ఒకటే అయినా దాన్ని వ్యక్తంచేసే తీరు దేశాన్ని బట్టీ ప్రదేశాన్ని బట్టీ మారుతుంటుంది, ఇక పదాల సంగతి చెప్పఖ్ఖర్లేదు. చిన్న చిన్న వాటికి “thanks” చెప్పటం మన ఆచారమూ కాదు, అలవాటు అంతకంటే కాదు. కానీ, “చచ్చి నీ కడుపునపుడతా”, “నీ రుణం ఉంచుకోను” లాంటివి చాలానే వున్నాయి. కానీ ఈ “thanks” మనది కాదనేది నా గట్టి ఫీలింగ్. నేను “thanks” చెప్పొద్దనట్లేదు. దాన్ని “thanks” గానే వుంచితే ఏంపొయ్యింది, మనది కాని భావాన్ని తెనుగించడం అవసరమా అని (అందులో మరీ ఇంత దారుణంగా)?

ఒక సర్వసాధారణమైన వ్యవహారాన్నే తీసుకుందాం. మీరు పరధ్యానంగా ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుద్దేశారు అనుకుందాం. మన ఊళ్ళో అయితే “చూళ్ళేదండీ” అంటాం. అదే ఆఫీసులో అయితే “సారీ” అంటాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం వాడుతున్న పదాలే కాదు వ్యక్తం చేస్తున్న భావాలు కూడా వేరు. ఒకచోట “explanation” ఇస్తున్నాం. ఇంకో చోటేమో అటువంటిదిలేదు. ఇంత అతిసాధారణ విషయానికే భావం తేడా, expression తేడా వుంటుంటే రెండు భాషల మధ్య ప్రతీ పదానికీ “వ్యావహారిక సమానార్థమయిన పదం” ఉండాలనుకోవటం అమాయకత్వం అని నా అభిప్రాయం.

ఇంతకీ ఢక్కామొక్కీల గురించి చెప్పలేదుకదూ…
అనగనగా ఒక తరగతి గది. పంతులుగారు పిల్లలకి ఒక్కొక్కళ్ళ పేర్లు పిలిచి వాళ్ళ ఆన్సరు పేపర్లు ఇస్తున్నారు.
“రాజూ…”
“సరితా…”
“రమణా…”
సెవెన్ హిల్స్…”
“…”
“…”
“…”
సూది పడ్డా వినిపించేత నిశ్శబ్దం. మరందుకే మక్కికి మక్కీ తర్జుమా చెయ్యొద్దనేది.

ఇంత చెప్పినందుకు మీరు నాకు “నెనర్లు” చెబితే, నేను చెయ్యగలిగిందేమీ లేదు. “మీకు స్వాగతం” అనడం కంటే”.

ఆగస్ట్ 13, 2008

మతం — నామతం

నేను మతాల గురించీ వాటి పోకడల గురించీ ఒక పోస్టు రాద్దామని చాలా రోజులుగా అనుకుంటూనేవున్నా. ఎప్పుడు రాయబోయినా నాకు రెండు ముఖ్యమైన సమస్యలు ఎదురవుతాయి. ఒకటి రాసింది సమగ్రంగా లేకపోవటం. రెండోది “నా బ్లాగు చదివేవారి మనసు నొప్పిస్తానేమో” అనేభావం.

మతంపై వ్యాసం ఎవరు రాసినా సమగ్రంగా ఎలా వుంటుందండీ? అది దేశ, ప్రపంచ రాజకీయాలతోటీ, దేశ ప్రపంచ ఆర్ధిక విధానలతోటీ పూర్తిగా interlace అయివుంటేనూ. మొన్నామధ్య మిత్రులతో ఇదేవిషయం చర్చకు వస్తే రాయడంలో తప్పేమీలేదు అనిపించింది. రాయడం మొదలుపెడితే అది ఒక పట్టాన తేలట్లేదు. ఈ లోపు ఈ అమరనాథ్ సంఘర్షణ సమితి గొడవలు, మన బ్లాగరులలో చర్చలూ(
పరధర్మా భయావహ, ఉద్యోగం మారిందంతే! ). రాస్తున్నది పూర్తి చెయ్యడం గానీ…దాన్ని పోస్టు చెయ్యడం గానీ…ఇప్పట్లో అయ్యేది కాదు. ఈలోపు మతమ్మీద నా అభిప్రాయం చెపుతా, పోస్టుసంగతి తర్వాత చూద్దాం.

 • మతాన్ని కేవలం ఆచారవ్యవహారాలకే పరిమితం చెయ్యాలి. రాజకీయం చేయటం దారుణం.
 • మతం మారడానికి అసంబధ్ధమయినవి ఆశచూపి ప్రోత్సహించడం తప్పు. మతం మారడాన్ని మతస్వేచ్చగానే చూడాలి గానీ, తప్పుగానో నేరంగానో చూడకూడదు.
 • మతాలు, మత సంఘాలు సమాజానికి మంచి చెయ్యకపోయినా ఫర్వాలేదు, చెడుమాత్రం చెయ్యకూడదు, కలహాలు ప్రోత్సహించకూడదు.
 • ఏ మతానికయినా “అవలోకనం” అవసరం. రోజులు మారుతున్నాయి, కొత్త విషయాలు ఇంతకు ముందెన్నడూ చూడనివి, కనీసం ఊహకందనివి వస్తున్నాయి (same sex marriages లాంటివి). మతం అంటే గైడ్‌లైన్స్ వుండాలిగానీ, రూల్స్ కాదు.
 • దేశం అంటే ఒకే మతం కాదు, ఒకే సంస్కృతికాదు.
 • చివరగా, మతం కంటే, దేవుడి కంటే దేశం ముఖ్యం.

ఇటువంటివి చెప్పడం సులభమే, ఆచరించటం కష్టమని మీరనొచ్చు. ఆచరించటం సంగతి దేవుడెరుగు, చెప్పడం తప్పుకాదుగా అందుకే చెప్పేశా..
నా బ్లాగు రాతల్లో నాకు నచ్చిన వాటిల్లో “రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)ఒకటి. పన్లో పని చదివేయండి.

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.