దిల్ సే …

ఆగస్ట్ 13, 2008

మతం — నామతం

నేను మతాల గురించీ వాటి పోకడల గురించీ ఒక పోస్టు రాద్దామని చాలా రోజులుగా అనుకుంటూనేవున్నా. ఎప్పుడు రాయబోయినా నాకు రెండు ముఖ్యమైన సమస్యలు ఎదురవుతాయి. ఒకటి రాసింది సమగ్రంగా లేకపోవటం. రెండోది “నా బ్లాగు చదివేవారి మనసు నొప్పిస్తానేమో” అనేభావం.

మతంపై వ్యాసం ఎవరు రాసినా సమగ్రంగా ఎలా వుంటుందండీ? అది దేశ, ప్రపంచ రాజకీయాలతోటీ, దేశ ప్రపంచ ఆర్ధిక విధానలతోటీ పూర్తిగా interlace అయివుంటేనూ. మొన్నామధ్య మిత్రులతో ఇదేవిషయం చర్చకు వస్తే రాయడంలో తప్పేమీలేదు అనిపించింది. రాయడం మొదలుపెడితే అది ఒక పట్టాన తేలట్లేదు. ఈ లోపు ఈ అమరనాథ్ సంఘర్షణ సమితి గొడవలు, మన బ్లాగరులలో చర్చలూ(
పరధర్మా భయావహ, ఉద్యోగం మారిందంతే! ). రాస్తున్నది పూర్తి చెయ్యడం గానీ…దాన్ని పోస్టు చెయ్యడం గానీ…ఇప్పట్లో అయ్యేది కాదు. ఈలోపు మతమ్మీద నా అభిప్రాయం చెపుతా, పోస్టుసంగతి తర్వాత చూద్దాం.

 • మతాన్ని కేవలం ఆచారవ్యవహారాలకే పరిమితం చెయ్యాలి. రాజకీయం చేయటం దారుణం.
 • మతం మారడానికి అసంబధ్ధమయినవి ఆశచూపి ప్రోత్సహించడం తప్పు. మతం మారడాన్ని మతస్వేచ్చగానే చూడాలి గానీ, తప్పుగానో నేరంగానో చూడకూడదు.
 • మతాలు, మత సంఘాలు సమాజానికి మంచి చెయ్యకపోయినా ఫర్వాలేదు, చెడుమాత్రం చెయ్యకూడదు, కలహాలు ప్రోత్సహించకూడదు.
 • ఏ మతానికయినా “అవలోకనం” అవసరం. రోజులు మారుతున్నాయి, కొత్త విషయాలు ఇంతకు ముందెన్నడూ చూడనివి, కనీసం ఊహకందనివి వస్తున్నాయి (same sex marriages లాంటివి). మతం అంటే గైడ్‌లైన్స్ వుండాలిగానీ, రూల్స్ కాదు.
 • దేశం అంటే ఒకే మతం కాదు, ఒకే సంస్కృతికాదు.
 • చివరగా, మతం కంటే, దేవుడి కంటే దేశం ముఖ్యం.

ఇటువంటివి చెప్పడం సులభమే, ఆచరించటం కష్టమని మీరనొచ్చు. ఆచరించటం సంగతి దేవుడెరుగు, చెప్పడం తప్పుకాదుగా అందుకే చెప్పేశా..
నా బ్లాగు రాతల్లో నాకు నచ్చిన వాటిల్లో “రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)ఒకటి. పన్లో పని చదివేయండి.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు »

 1. మరోటి,

  మతం కంటే, దేవుడి కంటే, దేశం కంటే మనిషి(మానవత్వం) ముఖ్యం

  వ్యాఖ్య ద్వారా పెదరాయ్డు — ఆగస్ట్ 13, 2008 @ 4:25 సా. | స్పందించండి

 2. ఆశ్చర్యంగా, ఈ రోజు నేను ఇదే టైటిల్‍తో ఒక పోస్ట్ మొదలు పెట్టి, సమగ్రంగా లేదని అనుకుంటూ కూడలి తెరిస్తే మీ టపా కనపడింది. బావున్నాయి మీ గైడ్‍లైన్స్. కానీ పిల్లి మెళ్ళో గంట కట్టేదెవ్వరు. ఇట్టగాదు గాని, అసలు టపాని వదలండి.

  వ్యాఖ్య ద్వారా చైతన్య క్రిష్ణ పాటూరు — ఆగస్ట్ 13, 2008 @ 6:59 సా. | స్పందించండి

 3. …మతం కంటే, దేవుడి కంటే దేశం కంటే, రాష్ట్రం కంటే, ఊరు కంటే, కుటుంబం కంటే, మనం ముఖ్యం.
  మనం మంచిగా ఉంటే లోకం బాగుంటుంది. ఇక్కడే ఉంది అసలైన తిరకాసు.

  వ్యాఖ్య ద్వారా నాగన్న — ఆగస్ట్ 14, 2008 @ 9:19 ఉద. | స్పందించండి

 4. ఇప్పుడు “రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)” కి లింకు వుంది, చూడగలరు.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — ఆగస్ట్ 14, 2008 @ 1:21 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: