దిల్ సే …

అక్టోబర్ 31, 2008

సింబాలిజమా? నీ బొంద.

నేను చూసిన సింబాలిజాలు.

  • హీరోకి క్యాన్సర్ అన్న విషయం హీరోయిన్‌కి సముద్రం పక్కన ఉన్నప్పుడే తెలుస్తుంది. ఒక అల ఒడ్డున రాయిని గుద్దుకుని ఉవ్వెత్తున ఎగసి  ఆగిపోతుంది.(కాలం నిలిచిపోయింది)
  • హీరోయిన్ త్యాగం చేసిన విషయం తెలిసిన హీరో తనని కలవడానికి వెళ్ళినప్పుడేమో వర్షం పడుతుంది. (హీరో ప్రేమలో హీరోయిన్ తడిసి ముద్దయ్యింది)
  • హీరోయిన్ ప్రసవవేదన పడుతుంటుంది. బయట ఉరుములు, తుఫానూ (???).
  • హీరోయిన్ అబార్షన్‌కి వెళ్తే, సీను చివర్లో కెమేరా వద్దన్నా గోడమీద పోస్టరు మీదికెళ్తుంది. అందులో పిల్లాణ్ణి  ఒక పేఏఏధ్ధ గంట ఢీకొట్టబోతూ ఉంటుంది. (బిడ్డని చంపేశారు)
  • హీరోనో, హీరొయిన్నో స్క్రీను మధ్యలో నిల్చుని ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్లో అట్నుంచి ఒక ట్రెయిన్ ఇటు వెళ్తుంది, మరుక్షణం  ఇట్నుంచి ఒక ట్రెయిన్ అటు వెళ్తుంది.(???)
  • హీరోయిన్ తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. బెడ్రూంలో లైటు ఆన్ఆఫ్ అవుతూ ఉంటుంది… sudden గా లైటు ఆరిపోతుంది (ఊగిసలాట అయిపోయింది, ఒక నిర్ణయం తీసుకోబడింది).
  • హీరోయిన్ బొత్తిగా అమాయకురాలు అయి క్యూట్‌గా ఉంటే introduction సీన్‌లో ఒక మేక పిల్ల వెంటో గొర్రె పిల్ల వెంటో పరిగెడుతుంటుంది. (అమాయకురాలు, క్యూట్‌గా ఉంది)
  • సెకండ్ హీరోయిన్ హీరో, హీరోయిన్ని కలుపుతుంది. క్లైమాక్స్‌లో అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ దూరంగా ఉన్న కొండలకేసి వెళ్ళిపోతుంది.(???)

లేటెందుకు? మీరు చూసింది ఒకటి మీరూ కమెంటండి…

అక్టోబర్ 17, 2008

TOP 10

* పూరీ without oil
* మరో ప్రస్థానం

* బట్టతల వచ్చేసిందే బాలా!

* మన అభివృద్ధి అగ్రహారాల దాకా వచ్చింది
*తెలంగాణా సాయుధ పోరాటం – ప్రశ్న-జవాబు

* వెధవతనంలో సిన్సియారిటీ…
* ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి “నాకెంతిస్తావు?” “అంత కాదు గానీ ఇంకో మాట చెప్పు” అని బేర సారాలు జరుగుతున్నాయంటే..దానికి సహజీవనమనో, పెళ్లనో గౌరవనీయమైన పేర్లెందుకు?

* సినిమా ఆఫ్ ది యియర్ (హ్యాపీ డేస్)

* మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…?

* దేవుడు బలే నాయాలు. కద మా!

* ఎముంది, నేను తన “జడ” చూస్తే తన నా “బట్టతల” చూసింది
* ఇలా నా చేత రక్ష..రక్ష..అంటు..”ప్రతిజ్ఞ”చేపించి… అనవసరంగా వారిపై,నాకు.. కక్ష పెంచుకునేలా చేసారు..
* అయినా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్…..ఎందుకంటే మా ఇద్దరికి మ్యాథ్స్ రాదు……

And the joint winners are …

* చదువుతుంటే అసహ్యంగా లేదూ, గుండె మండిపోవడం లేదూ!సాటి మనిషిని మనిషిగా గౌరవించలేని బూజు భావాలకు ‘కులమని ‘ పేరా?
* “బ్లాక్ బాక్స్ (విమాన ప్రమాదాలో దొరికేది)కి తెలుగు చెప్పవా” అనడిగాడొక రమేష్చంద్రుడు.”‘ కపిల పేటిక ‘ అని రాసుకో ‘ అని నేను చెప్పగానే అదే రాసి చీవాట్లు తిన్నాడు పాపం

* బస్సువాడు చక్కటి బాలసుబ్రహ్మణ్యం పాట పెట్టాడు..వింటూ అలా ఎప్పుడు నిద్ర పొయ్యనో తెలియదు..కానీ ఎప్పుడూ లేచానో తెలుసు … ఎక్కడినుంచో అస్సహ్యంగా రమణ గోగుల గొంతు వినిపించినప్పుడు
* అసలు ప్రత్యేకమైన కారణాలేవీ లేకుండా.. పాకిస్తాన్ క్రికెటర్లను చూడగానే ద్వేషిస్తుంటారే కొంతమంది మూర్ఖులు…వాళ్ళలో ఒకడిని నేను.
* నాన్సెన్స్ – ఐదు రన్లు కాదు…..సగం రన్నుతో గెలిచినా సరె….గెలిచిన వాడే హేరో..

* ఆ కవర్లు ఇటీ వదినా…ఎన్నింటికెళ్ళాలి?

__________________________________________________________________________
P.S.
1. One blogger gets only one spot/award (sorry gowtham(రెండు రెళ్ళు ఆరు)…)
2. No preference to senior/junior bloggers
3. No Categories
4. Sorry (too) old posts… You know, I keep forgetting
5. Not to be biased (including my all-time favourites చరసాల, కొత్తపాళి, రానారె, ఒరెమూన)
6. 10th spot is reserved for me, at any cost…-)

అక్టోబర్ 8, 2008

ఇచ్చట వాటర్ లూజుగా అమ్మబడును

Filed under: హాస్యం — శ్రవణ్ @ 1:28 సా.
Tags:

మావూళ్ళో ఎండలెక్కువ.

నా చిన్నప్పటిమాట. ఇంట్లో ఆడవాళ్ళు తెల్లారకుండానే బిందెలతోనో, మగవాళ్ళు తెల్లారాక కావిడితోనో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు. అప్పట్లో మంచినీళ్ళు (తాగడానికి వాడే నీళ్ళు) తెచ్చుకోవడం పెద్ద ప్రహసనం. ఋతువుని బట్టీ, ఇంట్లో మనుషులకున్న వీలును బట్టీ నీళ్ళు తెచ్చుకోవడానికి ఒక షెడ్యూలు ఉండేది. ఎండాకాలం సంగతి ఇక చెప్పనఖ్ఖర్లేదు. ఎండాకాలం వస్తే వూరిపెద్ద పేరునో, ఆమధ్యనే పోయిన వేరెవరిపేరునో చలివేంద్రాలు వెలిసేవి.

ఇక ఇప్పటి మాట. జనాలకి డబ్బులెక్కువయ్యాయో, ఇంటికెళ్ళే దాకా ఆగలేరో తెలియదు. దారిలో బంధువుల ఇంట్లో నీళ్ళు తాగటం నామోషీ అయిపోయిందేమో(పల్లెటూళ్ళలో అంతా బంధువులేగా… దగ్గరి వాళ్ళో, దూరపు వాళ్ళో). పైగా ఇప్పుడు నీళ్ళు కష్టపడి చేదుకొచ్చినవీ, మోసుకొచ్చినవీ కాదు. సుబ్బరంగా పంచాయతీ “రక్షిత మంచినీటి పథకం” నించి వచ్చే నీళ్ళు.

ఇప్పుడు మావూళ్ళో అన్నిటి కంటే పెద్ద వ్యాపారం “ఇచ్చట వాటర్ లూజుగా అమ్మబడును” (చిన్న వూరులెండి, అందుకని).

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.