దిల్ సే …

అక్టోబర్ 31, 2008

సింబాలిజమా? నీ బొంద.

నేను చూసిన సింబాలిజాలు.

  • హీరోకి క్యాన్సర్ అన్న విషయం హీరోయిన్‌కి సముద్రం పక్కన ఉన్నప్పుడే తెలుస్తుంది. ఒక అల ఒడ్డున రాయిని గుద్దుకుని ఉవ్వెత్తున ఎగసి  ఆగిపోతుంది.(కాలం నిలిచిపోయింది)
  • హీరోయిన్ త్యాగం చేసిన విషయం తెలిసిన హీరో తనని కలవడానికి వెళ్ళినప్పుడేమో వర్షం పడుతుంది. (హీరో ప్రేమలో హీరోయిన్ తడిసి ముద్దయ్యింది)
  • హీరోయిన్ ప్రసవవేదన పడుతుంటుంది. బయట ఉరుములు, తుఫానూ (???).
  • హీరోయిన్ అబార్షన్‌కి వెళ్తే, సీను చివర్లో కెమేరా వద్దన్నా గోడమీద పోస్టరు మీదికెళ్తుంది. అందులో పిల్లాణ్ణి  ఒక పేఏఏధ్ధ గంట ఢీకొట్టబోతూ ఉంటుంది. (బిడ్డని చంపేశారు)
  • హీరోనో, హీరొయిన్నో స్క్రీను మధ్యలో నిల్చుని ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్లో అట్నుంచి ఒక ట్రెయిన్ ఇటు వెళ్తుంది, మరుక్షణం  ఇట్నుంచి ఒక ట్రెయిన్ అటు వెళ్తుంది.(???)
  • హీరోయిన్ తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. బెడ్రూంలో లైటు ఆన్ఆఫ్ అవుతూ ఉంటుంది… sudden గా లైటు ఆరిపోతుంది (ఊగిసలాట అయిపోయింది, ఒక నిర్ణయం తీసుకోబడింది).
  • హీరోయిన్ బొత్తిగా అమాయకురాలు అయి క్యూట్‌గా ఉంటే introduction సీన్‌లో ఒక మేక పిల్ల వెంటో గొర్రె పిల్ల వెంటో పరిగెడుతుంటుంది. (అమాయకురాలు, క్యూట్‌గా ఉంది)
  • సెకండ్ హీరోయిన్ హీరో, హీరోయిన్ని కలుపుతుంది. క్లైమాక్స్‌లో అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ దూరంగా ఉన్న కొండలకేసి వెళ్ళిపోతుంది.(???)

లేటెందుకు? మీరు చూసింది ఒకటి మీరూ కమెంటండి…

14 వ్యాఖ్యలు »

  1. good observation

    వ్యాఖ్య ద్వారా sagar — అక్టోబర్ 31, 2008 @ 5:49 సా. | స్పందించండి

  2. హీరో, హీరోయిన్ శృంగారం చేసుకుంటున్నప్పుడు ఇద్దరూ ఒకే దుప్పటిలో ఉన్నా కూడా, హీరో కేమో ఆ దుప్పటి సగం మాత్రమే కప్పబడివుంటుంది. హీరోయిన్ కు మాత్రం మొత్తం కప్పబడి వుంటుంది. 😦

    వ్యాఖ్య ద్వారా nagaprasad — అక్టోబర్ 31, 2008 @ 6:37 సా. | స్పందించండి

  3. ఎన్నో సినిమా సింబాలిజమ్ లు ప్రతీ ఒక్కరికీ మైండ్ లో ప్రింట్ అయి ఉన్నా, వాటిని మీరు narrate చేసిన తీరు చాలా ఫన్నీగా ఉంది.

    వ్యాఖ్య ద్వారా నల్లమోతు శ్రీధర్ — అక్టోబర్ 31, 2008 @ 7:32 సా. | స్పందించండి

  4. ఏదైనా దుర్వార్త వినేటప్పటికి, చేతిలో ఖచ్చితంగా పగలగలిగే వస్తువేదో ఉంటుంది, వినీ వినగానే అది నేలరాలి, ఆ మనిషీ “బ్రేక్” అయ్యాడని సింబాలిక్‍గా చూపడం!

    భర్తను చంపేస్తున్న సమయంలోనే, భార్య కుంకుమ పెట్టుకుంటూ ఉంటుంది. భర్త ప్రాణం అలా పోవడమేమిటీ ఇక్కడ కుంకుమ అలా చెరిగిపోతుంది.

    రఫ్ హీరో, అగ్గిపుల్లని గెడ్డంతో వెలిగించేస్తాడు, తానెంత రఫ్‍ఓ సింబాలిక్ గా చెప్తూ

    అతి పేదరికంలో ఉన్న పాత్ర (కారెక్టర్) త్యాగానికి సింబాలిక్‍గా అందరకీ అన్నం పెట్టి, తాను మాత్రం గ్లాసు నీళ్ళు తాగి పడుకుంటుంది!

    దేవుడి మీద విపరీతమైన కోపంతో ప్రార్థించడానికి వెళ్ళేటప్పటికి ఉరుములు మెరుపులతో గాలివాన ఉంటుంది, తనకి చేస్తున్న అన్యాయానికి ప్రకృతి కూడా సహించడం లేదన్నదానికి సింబాలిజం!

    బైదవే, మన హీరో పక్కన ఎప్పుడూ ఓ కమెడీయన్ ఫ్రెండ్‍గా ఉంటాడెందుకు? “ఎంతటి వెర్రివాణ్ణీ అయినా భరించగలిగేవాడు” అని చెప్పడానికా?

    ప్రేమించుకున్న హీరో హీరోయిన్లు ఇద్దరూ చనిపోతే, ఆ మృతదేహాలూ చేతులు పట్టుకునే ఉంటాయి. చావులోనూ విడిపోలేదూ.. లేక, చావు వారిని కలిపింది అనటానికి సింబిల్‍గా!

    అబ్బో.. చెప్పుకుంటూ పోతే ఇలా చాలా చాలానే ఉన్నాయి. నిజంగా సింబాలిజమా? నా తలకాయా? నే పోతున్నా.. పనుంది 🙂

    వ్యాఖ్య ద్వారా Purnima — అక్టోబర్ 31, 2008 @ 7:32 సా. | స్పందించండి

  5. :))))))))

    వ్యాఖ్య ద్వారా శివ బండారు — అక్టోబర్ 31, 2008 @ 7:32 సా. | స్పందించండి

  6. రేప్ సీన్లో..పైన గద్దా కింద పాము,తుమ్మెద మకరందం జుర్రుకోడం,
    సైకిల్ చక్రం తిరుగుతుండగా కాలం మారడం,
    అలలు చూపిస్తూంటే పెద్దవాళ్ళైపోడం,
    గుడ్డు పగిలితే అబార్షన్ అవడం,
    బస్సు..పిల్లోడు..బస్సూ.పిల్లోడూ..ప్రమాదం,
    మోడై పోయిన చెట్టూ..వాడిపోయిన జీవితం,
    చిరిగిపోయిన జాకెట్టు(అతుకులతో)..చితికిపోయిన బ్రతుకు…
    అబ్బా చెయ్యి నొప్పి పెడుతోంది బాబూ…

    వ్యాఖ్య ద్వారా pappu — అక్టోబర్ 31, 2008 @ 7:46 సా. | స్పందించండి

  7. If a lady is shocked after hearing some bad news, she will drop a full tea set from her hands.

    The famous Movie Kissing.. Just when the hero and heroine are about to kiss, two flowers will tussle with each other infront of the camera.

    Rape – submission of a woman.. She struggles under the villion’s monstrous grip.. hands twitching, legs tossing.. suddenly the movements stop.

    And the famous – Love at first sight!! It happens only in the movies.

    The Naval showing dream girls.. Introduce a beautiful woman (heroine of course!!) She will come out of thin air, with her wonderful doy-eyes, beautifully shaped body.., (innocent girl, plays with kids) (intelligent girl will be a tomboy!!)

    and so many others. Sorry! lekhini wasnt good today.

    వ్యాఖ్య ద్వారా sujata — అక్టోబర్ 31, 2008 @ 9:42 సా. | స్పందించండి

  8. హీరో హీరోయిన్లు దగ్గరయితే, ఓ తెగ చెట్లనీ, పుట్లనీ ఎడాపెడా ఊపెయ్యటం….. ఇంతా ఊపిన తర్వాత ఏందిరా జరిగిన విషయం అని నోరెళ్ళ బెట్టి చూస్తే, …… హీరోయిన్ తెగ సిగ్గుపడుతూ….. ఛీ పాడు అంటూ పారిపోతుంది, పిచ్చి హీరోని అక్కడే వదిలేసి.

    వ్యాఖ్య ద్వారా సినీ బకరా — నవంబర్ 1, 2008 @ 12:03 ఉద. | స్పందించండి

  9. హిరో గారిద్దరు భార్యలు గుడికొస్తారు. మొదటి భర్య పూలో కుంకమో జారిపోతే రెండవభార్య ఇస్తుంది. భాక్గ్రఔడ్ లో పెద్ద మ్యూజిక్. రాఖవేంద్రరావు స్టైల్/

    వ్యాఖ్య ద్వారా budaraju.aswin — నవంబర్ 1, 2008 @ 1:13 ఉద. | స్పందించండి

  10. 🙂

    వ్యాఖ్య ద్వారా radhika — నవంబర్ 1, 2008 @ 2:51 ఉద. | స్పందించండి

  11. 1)అమాయి పెద్దమనిషి అవుతుంది, తాటిచెట్టు ఆకులు కోసి చెట్టుకింద వేస్తారు
    లేద మొగ్గ పువ్వు గా మారినట్టు చూపిస్తరు.
    2)ఫస్ట్ నైట్ లైట్ ఆర్పేస్తారు, తెల్లవారి నలిగిన పూలు చెదిరిన బొట్టు.
    3)పిల్లవాడు పరిగెడుతూ ఉంటాడు కాళ్ళు చూపిస్తారు అవే (హీరో)పెద్దవాడికాళ్ళలా మారతాయి.
    4)హీరో లేద హీరోయిన చనిపోయిన ప్రతి సారి దేవుడి దీపాలు తప్పనిసరిగా ఆరిపోతాయి.
    5)hIrO హీరోయిన్‌ విడిపోతారు చెరోపక్క తిరుగుతారు వారుమధ్య ఒక మెరుపుచీలిక
    6)రేప్ సీన్‌ లో లేడి ని వేటాడుతున్న పులి
    7)కాలం గడచిపోయిందనాటికి గుర్తు కేలెండర్ చూపిస్తారు.
    8)తప్పి పోయిన కొడుకు కనిపించిన ప్రతిసారీ వెనక వీణలూ సితార్లూ కుయ్యాం కుయ్యాం అంటుంటాయి.(ఐనా వాడే కొడుకని తెలుసుకోరు)
    9)ఉమ్మడి కుటుంబం లో గొడవలూ అవుతూ ఉంటాయి వాళ్ళు విడిపోటానికి సిద్దమౌతూ ఉంటారు… వెనక వీధిలో ఓ గుడ్డి బిచ్చగాడు తన పదేంళ్ళ కూతురి తో నడుస్తూ తత్వపు పాట పాడుతూ ఉంటాడు.
    10) సంధర్బానుసారంగా గాలీ, వాన, మెరుపులూ అవీ, ఇవీ.

    వ్యాఖ్య ద్వారా ఒక అమ్మాయి:) — నవంబర్ 1, 2008 @ 12:27 సా. | స్పందించండి

  12. bhale unnaay
    నావాటాగా ఒకటి– హారతి తీసుకొనేటప్పుడు ఆరిపోతే, ఎదో అశుభం జరగబోతున్నట్టు

    వ్యాఖ్య ద్వారా bollojubaba — నవంబర్ 1, 2008 @ 2:39 సా. | స్పందించండి

  13. in all old movies panimanishi peru sitha

    వ్యాఖ్య ద్వారా bhaskar — జనవరి 23, 2010 @ 5:43 సా. | స్పందించండి

  14. hero not dead although he shot 5 bullets but villan dead for only one shot

    వ్యాఖ్య ద్వారా bhaskar — జనవరి 23, 2010 @ 5:45 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to bhaskar స్పందనను రద్దుచేయి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.