దిల్ సే …

అక్టోబర్ 31, 2008

సింబాలిజమా? నీ బొంద.

నేను చూసిన సింబాలిజాలు.

  • హీరోకి క్యాన్సర్ అన్న విషయం హీరోయిన్‌కి సముద్రం పక్కన ఉన్నప్పుడే తెలుస్తుంది. ఒక అల ఒడ్డున రాయిని గుద్దుకుని ఉవ్వెత్తున ఎగసి  ఆగిపోతుంది.(కాలం నిలిచిపోయింది)
  • హీరోయిన్ త్యాగం చేసిన విషయం తెలిసిన హీరో తనని కలవడానికి వెళ్ళినప్పుడేమో వర్షం పడుతుంది. (హీరో ప్రేమలో హీరోయిన్ తడిసి ముద్దయ్యింది)
  • హీరోయిన్ ప్రసవవేదన పడుతుంటుంది. బయట ఉరుములు, తుఫానూ (???).
  • హీరోయిన్ అబార్షన్‌కి వెళ్తే, సీను చివర్లో కెమేరా వద్దన్నా గోడమీద పోస్టరు మీదికెళ్తుంది. అందులో పిల్లాణ్ణి  ఒక పేఏఏధ్ధ గంట ఢీకొట్టబోతూ ఉంటుంది. (బిడ్డని చంపేశారు)
  • హీరోనో, హీరొయిన్నో స్క్రీను మధ్యలో నిల్చుని ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్లో అట్నుంచి ఒక ట్రెయిన్ ఇటు వెళ్తుంది, మరుక్షణం  ఇట్నుంచి ఒక ట్రెయిన్ అటు వెళ్తుంది.(???)
  • హీరోయిన్ తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. బెడ్రూంలో లైటు ఆన్ఆఫ్ అవుతూ ఉంటుంది… sudden గా లైటు ఆరిపోతుంది (ఊగిసలాట అయిపోయింది, ఒక నిర్ణయం తీసుకోబడింది).
  • హీరోయిన్ బొత్తిగా అమాయకురాలు అయి క్యూట్‌గా ఉంటే introduction సీన్‌లో ఒక మేక పిల్ల వెంటో గొర్రె పిల్ల వెంటో పరిగెడుతుంటుంది. (అమాయకురాలు, క్యూట్‌గా ఉంది)
  • సెకండ్ హీరోయిన్ హీరో, హీరోయిన్ని కలుపుతుంది. క్లైమాక్స్‌లో అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ దూరంగా ఉన్న కొండలకేసి వెళ్ళిపోతుంది.(???)

లేటెందుకు? మీరు చూసింది ఒకటి మీరూ కమెంటండి…

ప్రకటనలు

అక్టోబర్ 17, 2008

TOP 10

* పూరీ without oil
* మరో ప్రస్థానం

* బట్టతల వచ్చేసిందే బాలా!

* మన అభివృద్ధి అగ్రహారాల దాకా వచ్చింది
*తెలంగాణా సాయుధ పోరాటం – ప్రశ్న-జవాబు

* వెధవతనంలో సిన్సియారిటీ…
* ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి “నాకెంతిస్తావు?” “అంత కాదు గానీ ఇంకో మాట చెప్పు” అని బేర సారాలు జరుగుతున్నాయంటే..దానికి సహజీవనమనో, పెళ్లనో గౌరవనీయమైన పేర్లెందుకు?

* సినిమా ఆఫ్ ది యియర్ (హ్యాపీ డేస్)

* మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…?

* దేవుడు బలే నాయాలు. కద మా!

* ఎముంది, నేను తన “జడ” చూస్తే తన నా “బట్టతల” చూసింది
* ఇలా నా చేత రక్ష..రక్ష..అంటు..”ప్రతిజ్ఞ”చేపించి… అనవసరంగా వారిపై,నాకు.. కక్ష పెంచుకునేలా చేసారు..
* అయినా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్…..ఎందుకంటే మా ఇద్దరికి మ్యాథ్స్ రాదు……

And the joint winners are …

* చదువుతుంటే అసహ్యంగా లేదూ, గుండె మండిపోవడం లేదూ!సాటి మనిషిని మనిషిగా గౌరవించలేని బూజు భావాలకు ‘కులమని ‘ పేరా?
* “బ్లాక్ బాక్స్ (విమాన ప్రమాదాలో దొరికేది)కి తెలుగు చెప్పవా” అనడిగాడొక రమేష్చంద్రుడు.”‘ కపిల పేటిక ‘ అని రాసుకో ‘ అని నేను చెప్పగానే అదే రాసి చీవాట్లు తిన్నాడు పాపం

* బస్సువాడు చక్కటి బాలసుబ్రహ్మణ్యం పాట పెట్టాడు..వింటూ అలా ఎప్పుడు నిద్ర పొయ్యనో తెలియదు..కానీ ఎప్పుడూ లేచానో తెలుసు … ఎక్కడినుంచో అస్సహ్యంగా రమణ గోగుల గొంతు వినిపించినప్పుడు
* అసలు ప్రత్యేకమైన కారణాలేవీ లేకుండా.. పాకిస్తాన్ క్రికెటర్లను చూడగానే ద్వేషిస్తుంటారే కొంతమంది మూర్ఖులు…వాళ్ళలో ఒకడిని నేను.
* నాన్సెన్స్ – ఐదు రన్లు కాదు…..సగం రన్నుతో గెలిచినా సరె….గెలిచిన వాడే హేరో..

* ఆ కవర్లు ఇటీ వదినా…ఎన్నింటికెళ్ళాలి?

__________________________________________________________________________
P.S.
1. One blogger gets only one spot/award (sorry gowtham(రెండు రెళ్ళు ఆరు)…)
2. No preference to senior/junior bloggers
3. No Categories
4. Sorry (too) old posts… You know, I keep forgetting
5. Not to be biased (including my all-time favourites చరసాల, కొత్తపాళి, రానారె, ఒరెమూన)
6. 10th spot is reserved for me, at any cost…-)

సెప్టెంబర్ 12, 2008

బ్లా’గోల’

అదన్నమాట విషయం. మొత్తానికి మనవాళ్ళు హాట్ హాట్‌గా చర్చించేందుకు ‘సినిమాలు, కులం, సాహిత్యం కాకుండా ఇంకా కొన్ని విషయాలున్నాయి అని అర్థమయ్యింది.

సరే… శరత్-వీవెన్‌ల సంవాదం విషయంలో నా అభిప్రాయం కూడా చెబుతున్నా. ఈ విషయంలో I am 100% with veeven. శరత్ గారు ఆయన బ్లాగులో ఏమైనా (చెత్తయినా, మంచయినా, విజ్ఞానమయినా, బూతయినా) రాసుకొనేందుకు ఆయనకు నూటికి నూరు శాతం హక్కు ఉంది(నువ్వేంటి చెప్పేది బోడి, అంటారా…-) ). అలాగే అగ్రిగేటర్లకి కూడా.

మనవాళ్ళకి అగ్రిగేటర్లు తక్కువగా ఉన్నందువల్ల వీవెన్‌కి నచ్చనివి కూడలిలో Dispay చేయకుండా… రెడ్‌లిస్టో, బ్రవున్‌లిస్టో అనేసి ఇంకొక ఫీడ్‌లాగా ఇస్తే ఎలా వుంటుంది అనినిపించింది. మీరేమంటారు?

ఆగస్ట్ 14, 2008

తెలుగు భాషలో నాకు నచ్చని ఒకేఒక్క పదం — “నెనర్లు”

ఏదో టైటిలు బాగుందని అట్టా అన్నాను గానీ “నెనర్లు” ఒక తెలుగు పదముందంటే నాకింకా నమ్మబుద్ధి కావట్లేదు. నాకు తెలియని బోల్డు తెలుగు పదాలుండొచ్చు, నేను కాదనను. ఈ పదాన్ని దాదాపు ఏడాది నించీ వింటున్నా… ప్చ్… అబ్బే… ఉపయోగించటం సంగతి అటుంచి ఎవరైనా వాడితే అదెంటో ఎబ్బెట్టుగా ఉంటుంది.

ఇది మరీ బావుంది, నువ్వెవరూ ఏది తెలుగో ఏది కాదో నిర్ణయించడానికంటారా… మీరక్కడే తప్పులో కాలేశారు. నేను అది తెలుగు కాదనటంలా. దీన్ని వాడ్డం కాదు కదా వినడానికి కూడా (నాకు) (కష్టంగా ఉంది) ఇష్టంగా లేదు అంటున్నా. ఎంటీ? ఎందుకు? అంటారా… అదో అక్కడికే వస్తున్నా. ఎందుకో తెలీదు ఇది విన్నప్పుడల్లా ఇది అరవ పదానికీ ఇంగ్లీషు ఫీలింగుకీ పుట్టిన మళయాలీ పిల్లపదాన్ని అరబ్బీ వాడినట్టుంటుంది. ఎందుకుంటుందీ అంటే నాదగ్గర సమాధానం లేదు. బహుశా నేను జీవితంలో తిన్న కొన్ని ఢక్కా మొక్కీ లనుకుంటా.

భాష భావాన్ని తెలపడానికి మాత్రమేపుట్టింది అనేది నా ఫీలింగ్. భావాలు ఆచారవ్యవహారాల నించీ, కష్ట నష్టాల నించీ వస్తాయనేది నిర్వివాదాంశం. భావం ఒకటే అయినా దాన్ని వ్యక్తంచేసే తీరు దేశాన్ని బట్టీ ప్రదేశాన్ని బట్టీ మారుతుంటుంది, ఇక పదాల సంగతి చెప్పఖ్ఖర్లేదు. చిన్న చిన్న వాటికి “thanks” చెప్పటం మన ఆచారమూ కాదు, అలవాటు అంతకంటే కాదు. కానీ, “చచ్చి నీ కడుపునపుడతా”, “నీ రుణం ఉంచుకోను” లాంటివి చాలానే వున్నాయి. కానీ ఈ “thanks” మనది కాదనేది నా గట్టి ఫీలింగ్. నేను “thanks” చెప్పొద్దనట్లేదు. దాన్ని “thanks” గానే వుంచితే ఏంపొయ్యింది, మనది కాని భావాన్ని తెనుగించడం అవసరమా అని (అందులో మరీ ఇంత దారుణంగా)?

ఒక సర్వసాధారణమైన వ్యవహారాన్నే తీసుకుందాం. మీరు పరధ్యానంగా ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుద్దేశారు అనుకుందాం. మన ఊళ్ళో అయితే “చూళ్ళేదండీ” అంటాం. అదే ఆఫీసులో అయితే “సారీ” అంటాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం వాడుతున్న పదాలే కాదు వ్యక్తం చేస్తున్న భావాలు కూడా వేరు. ఒకచోట “explanation” ఇస్తున్నాం. ఇంకో చోటేమో అటువంటిదిలేదు. ఇంత అతిసాధారణ విషయానికే భావం తేడా, expression తేడా వుంటుంటే రెండు భాషల మధ్య ప్రతీ పదానికీ “వ్యావహారిక సమానార్థమయిన పదం” ఉండాలనుకోవటం అమాయకత్వం అని నా అభిప్రాయం.

ఇంతకీ ఢక్కామొక్కీల గురించి చెప్పలేదుకదూ…
అనగనగా ఒక తరగతి గది. పంతులుగారు పిల్లలకి ఒక్కొక్కళ్ళ పేర్లు పిలిచి వాళ్ళ ఆన్సరు పేపర్లు ఇస్తున్నారు.
“రాజూ…”
“సరితా…”
“రమణా…”
సెవెన్ హిల్స్…”
“…”
“…”
“…”
సూది పడ్డా వినిపించేత నిశ్శబ్దం. మరందుకే మక్కికి మక్కీ తర్జుమా చెయ్యొద్దనేది.

ఇంత చెప్పినందుకు మీరు నాకు “నెనర్లు” చెబితే, నేను చెయ్యగలిగిందేమీ లేదు. “మీకు స్వాగతం” అనడం కంటే”.

మే 28, 2008

అవే కళ్ళు

Filed under: సరదాకి — శ్రవణ్ @ 12:06 ఉద.
Tags:

అవే కళ్ళు …
కొన్నాళ్ళు నాకై వెదకిన కళ్ళు,
ఇన్నాళ్ళూ నను వేధించిన కళ్ళు,
అంతే అప్యాయంగా, కొంచెం అభ్యర్ధనతో
మళ్ళీ ఇన్నాళ్ళకి
అవే కళ్ళు …

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.