దిల్ సే …

మే 14, 2008

నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు
ఆమధ్య హైదరాబాదులో బాంబ్లాస్టులు అయ్యాయని తెలుసు
ఫ్లయ్యోవరు కూలిందని తెలుసు
పేలాక పేలాయనీ, కూలాక కూలిందనీ తెలుసుగాని
అంతకంటే నాకేమీ తెలియదు
నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

-:-:-:-:-:-

పొయినసారి ఎలచ్చన్లొచ్చియి గదా
అన్ని పార్టీలోళ్ళొచిండ్రు, మస్తుగ తాగినం
నిన్న మా భూములు లాక్కున్రు
అళ్ళీళ్ళని కలుపుకొని దర్నాలైతే చేసినం
మా అయ్య ఏడ్చేడ్చి సచ్చిండు
సచ్చినంక సచ్చిండని ఎర్కయింది
గంతకంటే నాకేమెర్కలే
మాదీ గీదేశమే, నాకేమెర్కలే

-:-:-:-:-:-

నేనో సాఫ్టువేర్ ఇంజనీర్ని, నాకేమీ తెలీదు
సమాజం బాగుపడాలని గఠ్ఠిగా అనుకుంటుంటాను
తెలుగు భాష వృద్ధి చెందాలని ఆవేశ పడుతుంటాను
దశాబ్దాలుగా వెధవలు రాజ్యమేలుతున్నారని తెలుసు
ఏదైనా చెయ్యాలని తెలుసు, ఏంచెయ్యాలో తెలీదు
అంతకంటే నాకేమీ తెలీదు
నేనో మధ్యతరగతి భారతీయుణ్ణి,  నాకేం అంతగా తెలీదు

-:-:-:-:-:-

నేనో యన్నారైని, నాకేంపెద్దగా తెలీదు
మొన్న తానా సభలకెళ్ళా
స్కాములు చేస్తున్నారనీ, భూములు దోచుకుంటున్నారనీ తెలుసు
కోటానుకోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని తెలుసు
పేదవాడి నోట్లో మట్టి కొడుతున్నారని తెలుసు
ఏమైనా చెయ్యాలనుంది, టైమేదీ?
నేనూ ఓ సగటు భారతీయుణ్ణి, నాకేం పెద్దగా తెలీదు

-:-:-:-:-:-

నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు
ఆమధ్య హైదరాబాదులో బాంబ్లాస్టులు అయ్యాయని తెలుసు
ఫ్లయ్యోవరు కూలిందని తెలుసు
పేలాక పేలాయనీ, కూలాక కూలిందనీ తెలుసుగాని
అంతకంటే నాకేమీ తెలియదు
నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

ప్రకటనలు

ఏప్రిల్ 22, 2008

తెల్లకాగితం

అనగనగా ఒక రోజు…
స్థలం: జిల్లా కేంద్ర గ్రంధాలయం
ఎప్పట్లాగే జనాలు నిశ్శబ్దంగా చదువుకుంటున్నారు. ఒక పిల్లాడు ఆత్రుతగా ఎదో పేపర్ని తిరగేస్తున్నాడు. ఆరోజు EAMCET రిజల్సు వచ్చే రోజు. తన నంబర్ కనిపించటంతో ఎగిరి గంతేశాడు. ‘హుర్రే’ అని అరుద్దామంటే అదేమో గ్రంధాలయం. సంతొషంగా బయటకొస్తుంటే బయట అప్పటికే చర్చిస్తూ జనాలు. పరిచయమున్న మొహాలు.
“అన్నా, నాకు EAMCET ర్యాంకొచ్చింది”
వాడి అనందానికి అవధుల్లేవు.
అన్నా అని పిలిపించుకున్న పెద్దాయన కూడా సంతోషించాడు. “EAMCET ర్యాంకు వస్తే ఏంటి? తర్వాత ఏమి చేస్తావు? ఉద్యోగం వెతుక్కోవాలిగా… ఎందుకు ఇంజినీరింగ్? బుద్ధిగా డిగ్రీ చేస్తూ కాంపిటిటివ్ పరీక్షలు రాస్కో…ఆ డిగ్రీ అయిపోయే లోపు నీకు ఏదో ఒక ఉద్యోగం రాకపోదు” సలహా ఇచ్చాడు తన నాలెడ్జీనంతా రంగరించి.

అదే రోజు సాయంత్రం…
స్థలం: పిల్లాడి సొంత వూరి రచ్చబండ
పిల్లాడూ, వాళ్ళ అయ్యా మాట్లాడుకుంటున్నారు. పరీక్షయితే రాశాడు, మంచి ర్యాంకే వచ్చింది. తర్వాత ఏంటి? తండ్రికి ఎన్నాళ్ళు భారంగా వుండటం? EAMCET రాస్తే ఇంజినీరింగ్ చదవాలని తెలుసు. ఇంజినీరింగ్ అంటే మంచి చదువని మాత్రం తెలుసు, అదేంటో తెలియదు. మరి అది కూడు పెడుతుందా? సుబ్బరంగా ఆ అన్న చెప్పినట్టు ఏదయినా చిన్న ఉద్యోగం చేస్తూ, కాంపిటిటివ్ ఎగ్జాంసు రాసుకుంటే వుజ్జోగం వచ్చినప్పటికే వస్తుంది. ఇంతలోపు తండ్రికి సాయంగా ఉండొచ్చని నిర్ణయించుకున్నాడు. దారినపోయే కాపు ఒకాయన వీళ్ళ మాటలు విన్నాడు. “యేందీ, మీవోడికి ర్యాంకు వొచ్చిందంటగా మావోడి కంటే బాగెట్టొచిందీ ఏదొ కంపూటర్ తప్పయుంటది ఇంగోసారి సూస్కోండి” దబాయించి మరీ చెప్పాడు. ఈరోజుల్లో బియ్యే.బియ్యీడీ జేసినా మాఅల్లుడికే ఉజ్జోగాల్లేవు మీవోణ్ణి యేంజేద్దామనేంది? వాళ్ళయ్యకి కాపు చెప్పిందాంట్లో నిజం లేకపోలేదనిపించింది. పిల్లాడు డిగ్రీ చేద్దామని నిర్ణయానికొచ్చాడు.

పేపర్ కట్టింగుని ట్రంకుపెట్టెలో భద్రంగా దాచిపెడుతుంటే… పక్కనే తెల్లకాగితం….తను జీవితంలో ఒకేఒక్కసారి ఫెయిల్ అయిన పరీక్షది. టీచర్ పిలిచి ఎందుకు రాయలేదని అడిగిన సంగతీ… తను నెలరోజులు కూలికెళ్ళిన సంగతీ… చేతులు బొబ్బలు కట్టి పరీక్ష రాయలేకపోయిన సంగతీ… ఒక్కొక్కటే గుర్తుకొచ్చాయి. టీచరు ఎంత మంచిది. ఎన్ని మంచి మాటలు చెప్పింది. తను బాగా చదువుకుని పెద్దవాడవ్వాలని ఎన్ని చెప్పింది. ఎంత ప్రోత్సహించింది.
“ఒకసారి టీచర్ని కలిస్తే …”
అనుకున్నదే తడవుగా అయ్యని బయల్దేరదీశాడు. టీచర్ని వూరు మార్చారుగా, ఆవూరికి.

8 ఏళ్ళ తర్వాత…
అదే రోజు సాయంత్రం…
స్థలం: అదే రచ్చబండ
ఆ వూరినించి ఇప్పుడు 5గురు ఇంజనీర్లు, 2 డాక్టర్లు, ఒక సర్పంచ్ అంతా కుర్రాళ్ళే. వూరికి కరెంటు తెచ్చారు. ఇప్పుడు పెద్ద స్కూలు గురించీ, ఇన్‌స్పిరేషనూ, ఇన్‌ఫర్మేషనూ  తేవడం గురించీ చర్చిస్తున్నారు.

ఫిబ్రవరి 25, 2008

జిహ్వకో రుచీ, పుర్రెకో బుద్ధీ

Filed under: నాతో నేను,సరదాకి — శ్రవణ్ @ 5:58 సా.

ఒక తెల్లటి పిల్ల ఒక యదవతోటి తిరుగుతుంటే ఎక్కడో కాలుతుంది. యెదవ నా సన్ను గాడు ఏమి టాలెంటు చూపించాడో అనిపిస్తుంది. అదే ఓ north indian అమ్మాయి ఎంత తెల్లగా అందంగా వుండి ఎంతగా ఎవ్వడితో తిరిగినా పెద్దగా పట్టించుకోను వాళ్ళంటే చాలా రాంగ్ ఇంప్రెషన్. జిహ్వకో రుచీ, పుర్రెకో బుద్ధీ అని ఊరికే అన్నారా?

నవంబర్ 5, 2007

దూలతీర్చిన దుమ్ము

Filed under: కంప్యూటర్స్,నాతో నేను,సరదాకి — శ్రవణ్ @ 11:55 ఉద.

నా ఫ్రెండ్స్ laptops ని చాలా జాగర్తగా వాడతారు. “ఏంట్రా వీళ్ళు అదేమయినా బంగారమా? యెప్పుడు చూడూ ఆ carrycase లో పెట్టి పూజ చేస్తుంటారు” అని కమెంట్ చేసేవాణ్ణి. ఈ మధ్య నా laptop సౌండ్ చేస్తుంటే customer care కి తీస్కెళ్ళా. processor దగ్గర దుమ్ము చేరి processor fan కి ఉన్న ఒక coil ని పాడు చేసిందంట.

జానెడు(సరే, మూరెడు) తీగకి మూడు వేలు వదిలినై. దుమ్మా! మజాకా?

అక్టోబర్ 30, 2007

అకాల మరణాలు

Filed under: నాతో నేను,unbiased — శ్రవణ్ @ 10:45 ఉద.

ఇందిరాగాంధీనో, రాజీవ్‌గాంధీనో అకాలమరణం పొందితే దాన్ని ఎవరూ యేమీ చెయ్యలేరు. they are into politics having full knowledge of the consequences.

మొన్నామధ్య మా బంధువు ఒకాయన, టీచర్, స్కూటర్‌మీద ఇంటికొస్తుంటే యాక్సిడెంటు అయ్యింది. ఈమధ్య ఓ 20 యేళ్ళ కుర్రవాడు ఆటోలో వస్తుంటే యాక్సిడెంటు. నిన్నటికినిన్న మా కొలీగుకి హైవే మీద యాక్సిడెంటు, తన కుటుంబంలో ఎవరూ మిగల్లేదు.

ఒక్కసారి మీ 4-5 యేళ్ళ జ్ఞాపకాల పుటల్ని తిరగేయండి. ఇటువంటి కారణాల వల్ల మీరు ఒక్క మంచి మిత్రుణ్ణయినా కోల్పోయి ఉంటారు. మిగతా దేశాల్లో పరిస్థితి కూడా ఇంతే వుంటుందా?

ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించీ, డ్రైవింగ్ అవేర్‌నెస్ గురించీ ప్రభుత్వం ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాలి.

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.