దిల్ సే …

ఆగస్ట్ 13, 2008

మతం — నామతం

నేను మతాల గురించీ వాటి పోకడల గురించీ ఒక పోస్టు రాద్దామని చాలా రోజులుగా అనుకుంటూనేవున్నా. ఎప్పుడు రాయబోయినా నాకు రెండు ముఖ్యమైన సమస్యలు ఎదురవుతాయి. ఒకటి రాసింది సమగ్రంగా లేకపోవటం. రెండోది “నా బ్లాగు చదివేవారి మనసు నొప్పిస్తానేమో” అనేభావం.

మతంపై వ్యాసం ఎవరు రాసినా సమగ్రంగా ఎలా వుంటుందండీ? అది దేశ, ప్రపంచ రాజకీయాలతోటీ, దేశ ప్రపంచ ఆర్ధిక విధానలతోటీ పూర్తిగా interlace అయివుంటేనూ. మొన్నామధ్య మిత్రులతో ఇదేవిషయం చర్చకు వస్తే రాయడంలో తప్పేమీలేదు అనిపించింది. రాయడం మొదలుపెడితే అది ఒక పట్టాన తేలట్లేదు. ఈ లోపు ఈ అమరనాథ్ సంఘర్షణ సమితి గొడవలు, మన బ్లాగరులలో చర్చలూ(
పరధర్మా భయావహ, ఉద్యోగం మారిందంతే! ). రాస్తున్నది పూర్తి చెయ్యడం గానీ…దాన్ని పోస్టు చెయ్యడం గానీ…ఇప్పట్లో అయ్యేది కాదు. ఈలోపు మతమ్మీద నా అభిప్రాయం చెపుతా, పోస్టుసంగతి తర్వాత చూద్దాం.

  • మతాన్ని కేవలం ఆచారవ్యవహారాలకే పరిమితం చెయ్యాలి. రాజకీయం చేయటం దారుణం.
  • మతం మారడానికి అసంబధ్ధమయినవి ఆశచూపి ప్రోత్సహించడం తప్పు. మతం మారడాన్ని మతస్వేచ్చగానే చూడాలి గానీ, తప్పుగానో నేరంగానో చూడకూడదు.
  • మతాలు, మత సంఘాలు సమాజానికి మంచి చెయ్యకపోయినా ఫర్వాలేదు, చెడుమాత్రం చెయ్యకూడదు, కలహాలు ప్రోత్సహించకూడదు.
  • ఏ మతానికయినా “అవలోకనం” అవసరం. రోజులు మారుతున్నాయి, కొత్త విషయాలు ఇంతకు ముందెన్నడూ చూడనివి, కనీసం ఊహకందనివి వస్తున్నాయి (same sex marriages లాంటివి). మతం అంటే గైడ్‌లైన్స్ వుండాలిగానీ, రూల్స్ కాదు.
  • దేశం అంటే ఒకే మతం కాదు, ఒకే సంస్కృతికాదు.
  • చివరగా, మతం కంటే, దేవుడి కంటే దేశం ముఖ్యం.

ఇటువంటివి చెప్పడం సులభమే, ఆచరించటం కష్టమని మీరనొచ్చు. ఆచరించటం సంగతి దేవుడెరుగు, చెప్పడం తప్పుకాదుగా అందుకే చెప్పేశా..
నా బ్లాగు రాతల్లో నాకు నచ్చిన వాటిల్లో “రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)ఒకటి. పన్లో పని చదివేయండి.

ప్రకటనలు

ఆగస్ట్ 6, 2008

నట్టులు వెతకండి…

మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నట్టులు కొన్ని వదులయి పడిపొయ్యాయి. దీని కారణంగా ఆయన అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. దయచేసి నట్టులు వెతికి ఇవ్వగలరు.
ఈ వ్యాఖ్యలు చూడండి, “దమ్ముంటే అమలు చెయ్యా”లంట. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏదయినా పాలసీ బాగుందనో(?), బాలేదనో రీజనింగుతో వ్యాఖ్యానించాలి. సరే… మన వాళ్ళు ఇండియన్ పోలిటీషీన్సు కదా. రీజనింగు లేకపోయినా బాగుందనో, బాలేదనో వ్యాఖ్యానిస్తే O.K..

“బావుందనిపిస్తే దేశమంతా అమలు చెయ్యమని డిమాండు చెయ్యి. బాలేదనిపిస్తే దేశమంతా అమలు చెయ్యొద్దని డిమాండు చెయ్యి. ఈ ‘దమ్ముంటే అమలు చెయ్యటం’ ఏంటి చంద్రబాబూ? ఇదేనా ఢిల్లీలో చక్రం తిప్పే తెలివి?”.

అన్నట్టు…
ఈయన ఏ కమెంటు చేసినా “రాజీనామా చేయండి” అనే డిమాండు మాత్రం వుంటుంది.

ఏప్రిల్ 8, 2008

పొలిటికల్ సెటైర్

Filed under: రాజకీయాలు,సరదాకి,controversial,unbiased — శ్రవణ్ @ 4:44 సా.

రెండే

రెండే ఎకరాలు

.

.

.

.

అంటుంటారు

నోరు జాగర్త

నోరు జాగర్త

.

.

.

.

వళ్ళు జాగర్త

నేను ఏతప్పూ చెయ్యలేదు

నేను ఏతప్పూ చెయ్యలేదు

.

.

.

.

.

.

మా టైంలో స్కాములు అస్సలు లేవు.

మాగురించి ఎందుకు? <–ఈ పక్కన ఆయను తెగతి(oటు)న్నాడు–> ఈ పక్కన ఆయను తెగతింటున్నాడు

పంచాంగ ‘శ్రవణం’ — సెటై్‌ర్

కొత్త సంవత్సరం ఠంచనుగా వచ్చేసింది. అలవాటుగా రంగురంగుల పంచాంగాలు కూడా తెచ్చింది.

  • గులాబీ పంచాంగం ప్రకారం “తెలంగాణ” ఈ యేడాది వచ్చేస్తుంది.
  • పసుప్పచ్చ పంచాంగం ప్రకారం ప్రజలు “తెలంగాణ” ఒక కల అని గుర్తిస్తారు.
  • అదేంటో, ఆకుపచ్చ పంచాంగంలో “తెలంగాణ” గురించి లేనేలేదు.
  • కాషాయపు పంచాంగానికి నార్త్ఇండియా, కర్నాటక గురించి తెలిసినంతగా తెలుగునాడు గురించి తెలియదు.

సందట్లో సడేమియా:
ఊరు ఉత్తరమంటే కాదు దక్షిణమన్నట్టు, ఈ యేడాది 3 గ్రహణాలని అన్ని పంచాంగాలూ చెబుతుంటే ఒకాయన కాదు నాలుగు అని చాలెంజ్ చేస్తున్నాడు.

ఏప్రిల్ 3, 2008

నాకో డౌటు

నాకో డౌటు, హీరోయిన్ల కొలతలు కూడా బయటి కొస్తాయి కానీ, ఈ హీరోల హైట్లు బయటి రావెందుకని?
నాకు తెలిసిన డేటా ఇదీ.

వేణు — 6’3″
మహేష్ బాబు & ఫ్రభాస్  — 6’2″
నాగార్జున & మోహన్‌బాబు — around 6′

నా ఫ్రెండు ఒకడు చిరుకి వీర ఫ్యాను. చిరు హైటు 5’10” అని చెవిలో ఇల్లుకట్టి పోరేవాడు. నాకు మాత్రం చిరు అంతకంటే కా…….స్త తక్కువేమో అని అనిపిస్తుంది. ఇక, జూనియర్ N.T.R, ఉదయ్ కిరణ్, పవన్ కళ్యాణ్ ల గురించి నాకు అస్సలు ఐడియా లేదు.

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.