దిల్ సే …

మార్చి 12, 2009

TOP 10 డవలాగులు

చంద్రబాబు ……………… ముఖ్యమంత్రి కొన్ని వేలకోట్ల రూపాయలు సంపాదించారు
రాఘవులు ……………. “చంద్రబాబు పాలన…….” కి కట్టుబడి ఉన్నాం
వైయస్సార్ …………….. అధిస్టానం చూసుకుంటుంది
చిరంజీవి ……………….. సామాజికన్యాయం
కేసియార్ ………………. బొందబెడతాం
నాగబాబు ……………… పూజకి పనికి రాని పువ్వు
రాజశేఖర్ ……………… సానుబూతులు

And the joint winners are…
రోజా …………………… పళ్ళు రాలగొడతా
బాలకృష్ణ ……………….. సామాన్యులకు రక్షణేది?

Consolation prize goes to …
మోహన్‌బాబు ………… industry is not for onebody

ప్రకటనలు

సెప్టెంబర్ 10, 2008

?????

ఈ వార్త ని బ్లాగర్ల దృష్టికి తీసుకొద్దామని అనిపించి మొదలుపెట్టా. టైటిలు ఏమిపెట్టాలో తెలియలేదు. అందుకే ????? తో వదిలేశా. ఈ మధ్య ఇటువంటి విషయాలమీద మన తెలుగు బ్లాగరులలో చర్చలు జరుగుతున్నాయి కదా, ఇంకా ఎందుకు అనిపించింది. ఏందుకో తెలియదు, రాయాలనిపించింది, రాసేశా.

వ్యాఖ్యల్లో మీ భావాలు తెలియపరచలనుకుంటే (దురుసుతనం లేకుండా, కాస్త పద్ధతిగా) తెలపండి.

ఆగస్ట్ 13, 2008

మతం — నామతం

నేను మతాల గురించీ వాటి పోకడల గురించీ ఒక పోస్టు రాద్దామని చాలా రోజులుగా అనుకుంటూనేవున్నా. ఎప్పుడు రాయబోయినా నాకు రెండు ముఖ్యమైన సమస్యలు ఎదురవుతాయి. ఒకటి రాసింది సమగ్రంగా లేకపోవటం. రెండోది “నా బ్లాగు చదివేవారి మనసు నొప్పిస్తానేమో” అనేభావం.

మతంపై వ్యాసం ఎవరు రాసినా సమగ్రంగా ఎలా వుంటుందండీ? అది దేశ, ప్రపంచ రాజకీయాలతోటీ, దేశ ప్రపంచ ఆర్ధిక విధానలతోటీ పూర్తిగా interlace అయివుంటేనూ. మొన్నామధ్య మిత్రులతో ఇదేవిషయం చర్చకు వస్తే రాయడంలో తప్పేమీలేదు అనిపించింది. రాయడం మొదలుపెడితే అది ఒక పట్టాన తేలట్లేదు. ఈ లోపు ఈ అమరనాథ్ సంఘర్షణ సమితి గొడవలు, మన బ్లాగరులలో చర్చలూ(
పరధర్మా భయావహ, ఉద్యోగం మారిందంతే! ). రాస్తున్నది పూర్తి చెయ్యడం గానీ…దాన్ని పోస్టు చెయ్యడం గానీ…ఇప్పట్లో అయ్యేది కాదు. ఈలోపు మతమ్మీద నా అభిప్రాయం చెపుతా, పోస్టుసంగతి తర్వాత చూద్దాం.

  • మతాన్ని కేవలం ఆచారవ్యవహారాలకే పరిమితం చెయ్యాలి. రాజకీయం చేయటం దారుణం.
  • మతం మారడానికి అసంబధ్ధమయినవి ఆశచూపి ప్రోత్సహించడం తప్పు. మతం మారడాన్ని మతస్వేచ్చగానే చూడాలి గానీ, తప్పుగానో నేరంగానో చూడకూడదు.
  • మతాలు, మత సంఘాలు సమాజానికి మంచి చెయ్యకపోయినా ఫర్వాలేదు, చెడుమాత్రం చెయ్యకూడదు, కలహాలు ప్రోత్సహించకూడదు.
  • ఏ మతానికయినా “అవలోకనం” అవసరం. రోజులు మారుతున్నాయి, కొత్త విషయాలు ఇంతకు ముందెన్నడూ చూడనివి, కనీసం ఊహకందనివి వస్తున్నాయి (same sex marriages లాంటివి). మతం అంటే గైడ్‌లైన్స్ వుండాలిగానీ, రూల్స్ కాదు.
  • దేశం అంటే ఒకే మతం కాదు, ఒకే సంస్కృతికాదు.
  • చివరగా, మతం కంటే, దేవుడి కంటే దేశం ముఖ్యం.

ఇటువంటివి చెప్పడం సులభమే, ఆచరించటం కష్టమని మీరనొచ్చు. ఆచరించటం సంగతి దేవుడెరుగు, చెప్పడం తప్పుకాదుగా అందుకే చెప్పేశా..
నా బ్లాగు రాతల్లో నాకు నచ్చిన వాటిల్లో “రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)ఒకటి. పన్లో పని చదివేయండి.

ఆగస్ట్ 4, 2008

మరో ప్రస్థానం

Filed under: మీతో నేను,రాజకీయాలు,unbiased — శ్రవణ్ @ 8:25 సా.

మరో ఎలక్షన్,
మరో ఎలక్షన్,
మరో ఎలక్షన్ వచ్చింది!
పదండి తొక్కుక్కు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
అంతరాత్మలే లేకుండా-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ఎలక్షన్ ఘంటికలు?
పేదవాళ్ళ గుండెనెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
దందాల్ జేసీ,
సెజ్జులు చేసీ,
దోచినదంతా తీయండి!
చిరంజీవులూ,
రాఘవులూ, నారాయణలు,
చంద్రబాబులా మనకడ్డంకి?
పదండి తొక్కుక్కు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
ఎముకలు కుళ్లిన,
వయస్సు మళ్లిన,
‘తెలుగు తమ్ములూ’! చావండి!
డబ్బులు చిమ్మే,
సారా పంచే,
నాయకులారా! రారండి!
రాహుల్! రాహుల్!
రాహుల్! రాహుల్!
రాహుల్ రాహులని కదలండి!
మరో ఎలక్షన్,
మహా ఎలక్షన్
రాష్ట్రం నిండా నిండింది!
పదండి తొక్కుక్కు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!

జూలై 7, 2008

ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు

Filed under: మీతో నేను,రాజకీయాలు,unbiased — శ్రవణ్ @ 3:52 సా.
Tags: ,

ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు
రాజిగ! ఒరె రాజిగా!
రాజిగ! ఒరె రాజిగా!
ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు

పప్పుప్పులు గొందమనీ
రోజు కూలి దీస్కబోతే
సేటు జెప్పిన రేటులినీ
దిమ్మదిరిగిబోయినాది

పిలగానికి సీటుకనీ
లోను దీసుకోని బోతె
సీటుకున్న రేటుయినీ
దిమ్మదిరిగిబోయినాది

గల్లి గల్లి బ్రాంది షాపు
తిండికేమొ దిక్కు లేదు
లీటరు నెత్తురు అమ్మితె
పూట గడవ దిక్కు లేదు

ఇందిరమ్మ ఇళ్ళంట
రాజీవుని రోడ్లంట
ముల్లెందుకు దోస్తాన్రు
బిచ్చమెందు కేస్తాన్రు

ఎలచ్చన్ల యేడాదిల
పరిస్థిస్తులె గిట్టుంటే
ఆనక నీసంగతేందొ
సిమ్మాద్రప్పన కెరుక

ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు
రాజిగ! ఒరె రాజిగా!
రాజిగ! ఒరె రాజిగా!
ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.