దిల్ సే …

ఫిబ్రవరి 25, 2008

Options

( ముందుగా “ఏకలింగం™ గురించి” చదవగలరు).

అలా బ్రౌజింగ్ చేసి అలిసిపోయిన  ఏకలింగం సరదాగా క్యాంటీన్ కని బయలుదేరాడు. ఎంత వద్దన్నా భ్రౌజర్లోని భేతాలుడు ఏకలింగం బుర్రలో దూరేశాడు.
భేతాలుడన్నాడు, “లింగం… ఏమంటావ్? శ్రవణ్ నిజంగా నవతరంగుల్ని విమర్శించాడా?”. లింగం కంఫ్యూషన్లో పడ్డాడు. “తెలిసికూడా చెప్పపోతే బుర్ర వెయ్యి వ్రక్కలవదు కదా?” అని. లింగం కంఫ్యూషన్ చూసి నవ్వేశాడు భేతాలుడు. “నీ డౌటు నాకర్థమయింది. అయినా నవతరంగులంతా స్పోర్టివ్‌గా తీసుకున్నాక ఆ discussion అనవసరం. సరే గానీ ఏంటీ టీ ఆర్డరు చెయ్యవా” అన్నాడు భేతాలుడు.
టీ అర్డరు చేసి ఓ టేబిలు ముందు కూర్చున్నాడు మన లింగం. కాస్సేపట్లో టీ రావడం, “లింగం…నువ్వు టీ తాగుతున్నప్పుడు శ్రమ తెలియకుండా నిన్ను కొన్ని ప్రశ్నలడుగుతాను విను” అని అనటం ఆటోమాటిగ్గా జరిగిపోయాయి.
భేతాళుడన్నాడు “ఇప్పుడూ… ఈ ఆస్ట్రేలియా వాళ్ళేంటి? ఆ సైమండ్స్ మరీ? ఎవరినయినా ఏదయినా తిట్టేస్తాడు “How can he get away with it every time?”. “నిజమే” అన్యమస్కంగా పైకనేశాడు లింగం. చుట్టూవునవాళ్ళు తన్ని చూసి నవ్వడం చూసి కాస్త సిగ్గనిపించింది. తమాయించుకున్నాడు, సిగ్గుపడితే ఎట్లా? ఇదేమన్నా చిన్న సమస్యా? దేశప్రతిష్టకి సంబంధించిన సమస్య. “వాణ్ణి ఉరి తియ్యాలి” ఇట్లా తప్పు చేసేట్తుగా force చెయ్యటం చాలాదారుణం. He is left with no option but to give a retart” బాగాగఠ్ఠిగా వినిపించాడు తన వాదనని.
భే  : “అన్నట్టూ…bombay redlight area” లో 40-50శాతం తెలుగు వాళ్ళేనంట కదా!”
లిం: “అబ్బే అలంటిదేమీ లేదని C.M చెప్పారు కదా! వుంటే గింటే 30-40శాతం ఉంటుందేమో, అంతే”
భే  : “మరి వీళ్ళు options ఉండీ ఈ పని చేస్తున్నారంటావా?”
లిం: “కాదనుకో”
భే  : “మరి దీనికి ఎవరిని ఉరి తియ్యాలి, ఈ ప్రశ్నకి సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీ తల వెయ్యి వ్రక్కలవుగాక”

టీ తాగడం అయిపోడంతో ఏమి చెప్పాలో అని అలోచిస్తూ బయలుదేరాడు ఏకలింగం బుర్రలో భేళాడితోసహా…

ప్రకటనలు

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.