దిల్ సే …

అక్టోబర్ 8, 2008

ఇచ్చట వాటర్ లూజుగా అమ్మబడును

Filed under: హాస్యం — శ్రవణ్ @ 1:28 సా.
Tags:

మావూళ్ళో ఎండలెక్కువ.

నా చిన్నప్పటిమాట. ఇంట్లో ఆడవాళ్ళు తెల్లారకుండానే బిందెలతోనో, మగవాళ్ళు తెల్లారాక కావిడితోనో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు. అప్పట్లో మంచినీళ్ళు (తాగడానికి వాడే నీళ్ళు) తెచ్చుకోవడం పెద్ద ప్రహసనం. ఋతువుని బట్టీ, ఇంట్లో మనుషులకున్న వీలును బట్టీ నీళ్ళు తెచ్చుకోవడానికి ఒక షెడ్యూలు ఉండేది. ఎండాకాలం సంగతి ఇక చెప్పనఖ్ఖర్లేదు. ఎండాకాలం వస్తే వూరిపెద్ద పేరునో, ఆమధ్యనే పోయిన వేరెవరిపేరునో చలివేంద్రాలు వెలిసేవి.

ఇక ఇప్పటి మాట. జనాలకి డబ్బులెక్కువయ్యాయో, ఇంటికెళ్ళే దాకా ఆగలేరో తెలియదు. దారిలో బంధువుల ఇంట్లో నీళ్ళు తాగటం నామోషీ అయిపోయిందేమో(పల్లెటూళ్ళలో అంతా బంధువులేగా… దగ్గరి వాళ్ళో, దూరపు వాళ్ళో). పైగా ఇప్పుడు నీళ్ళు కష్టపడి చేదుకొచ్చినవీ, మోసుకొచ్చినవీ కాదు. సుబ్బరంగా పంచాయతీ “రక్షిత మంచినీటి పథకం” నించి వచ్చే నీళ్ళు.

ఇప్పుడు మావూళ్ళో అన్నిటి కంటే పెద్ద వ్యాపారం “ఇచ్చట వాటర్ లూజుగా అమ్మబడును” (చిన్న వూరులెండి, అందుకని).

ప్రకటనలు

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.