దిల్ సే …

జనవరి 21, 2008

రాత బాబూ రాత…

Filed under: సినిమాలు,controversial — శ్రవణ్ @ 3:05 సా.
Tags: ,

చాలారోజుల తర్వాత ఒక మిత్రుణ్ణి సర్ప్రైస్ చేద్దామని వాళ్ళింటికి చెప్పకుండా వెళ్ళా…

వాడు వాళ్ళ బుడ్డోడితో నానా కష్టాలు పడుతూ కనిపించాడు. ఎంత వూరుకోబెట్టినా వూరుకోడే? దడుపు జ్వరం వచ్చినట్టుంది, విలవిల్లాడిపోతున్నాడు. వాణ్ణి చూస్తే జాలేసింది. వాళ్ళావిడేమో పిల్లవాణ్ణి పట్టించుకోవట్లేదు. చంద్రముఖిలో జ్యోతిక లాగ జుట్టు విరబోసుకొని వుంది, “లకలకలక” అనటం ఒక్కటే తక్కువ.

పక్కన వాడి తమ్ముడు. వాడు కాస్త గట్టి పిండం, కాస్త కంట్రోల్లో వున్నాడు. అతి కష్టం మీద వాణ్ణించి విషయం రాబట్టా.

వాళ్ళు అప్పుడే ఏదో సినిమా చూసి వస్తున్నారంట. ‘ఒక్కమగాడనో, ఇద్దరు అడాళ్ళ’ నో ఏదో పేరు చెప్పాడు. ఇంకో పక్క వాళ్ళమ్మగారు అందుకుంది. “అది పండక్కి వాళ్ళింటికి వెళ్దామంటే కూడా విన్లేదు బాబూ… బిడ్డ చూడు అల్లాడిపోతున్నాడు…రాత బాబూ రాత” అని.

ఎలాగోలా వాణ్ణి వోదార్చి బయట పడ్డా. బయట పడగానే, అప్పటిదాకా కంట్రోల్ చేసుకొన్న కన్నీళ్ళు కళ్ళవెంట బొటబొటా రాలినై.

ఎందు కంటారా?
రాతబాబూ… రాత.
“సుల్తాన్” చూసిన రోజులూ, పడ్డ బాధలూ…నేను ఎవరితో చెప్పుకోవాలి?

ప్రకటనలు

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.