ఇల్లు కడితే చాన్నాళ్ళుంటుంది, మరి కంప్యూటర్లు ఎందుకు వూరికే క్రాష్ అవుతుంటాయి? ఈ విషయం మీద నేను ఎక్కడో ఇది చదివాను.
“ఆపరేటింగ్ సిస్టంలు వచ్చి కొన్ని దశాబ్దాలు మాత్రమే అయ్యింది. దాంట్లో వాడే ‘ఎక్ష్పీరియన్సు’ తక్కువ విలువైంది. అదే ఇళ్ళు కట్టడానికి వాడే నాలెడ్జి కొన్ని యుగాలనాటిది. they have stood the test of time. కాబట్టి ఆ డొమైన్‌లో నాలెడ్జిని ఇక్కడ వాడుకోవాలి” అంటాడు ఒక పెద్దాయన. మరి, నేను బ్లాగు రాయడం మొదలుపెట్టి ఆరు నెలలు దాటింది. ఈ ప్రాసెస్‌లో వచ్చిన ఒడిదుడుకులని సినిమా తీయాలనే ఔత్సాహికులతో ఎందుకు పంచుకోకూడదు? అనిపించింది. అందుకే ఈ పోస్టు. “మాస్టారూ, “చాల్లే, మన తెలుగు ఇండస్ట్రీనే 75 ఏళ్ళనించి ఉంది” అంటారా? మీరే రైటు. కొత్తవి చెబుదామని మొదలు పెట్టినా, రాయగా రాయగా అన్నీ సినిమా ఇండస్ట్రీలో బేసిక్సే అని అనిపిస్తుంది. అయితేనేం, బేసిక్స్ అన్నింటికంటే ముఖ్యం కదా, అందుకే రాస్తున్నా.
- కొత్తదనం కోసం ప్రయత్నం చేయండి. దాన్ని మనస్సు అట్టడుగునించి బయటకి తియ్యండి. ఇదో ఇలా అనుకోకుండా (తెలుగు సినిమా – Myth and The Reality) హిట్ అవ్వచ్చు.
- ఏదో కొత్తగా ఉంది కదా అని, జస్ట్ కొత్తదనం కోసం ప్రయత్నించకండి. ఇదిగో ఇలా (శివ..శివ…శివ…, 2 year pinch) ఫట్టవుతుంది. భోజనంలో కూర కూరే అన్నం అన్నమే. కొత్తదనం రుచికరమైన కూరవ్వాలి, అన్నం కాదు.
- మొదట్లో ఉన్న విగర్ తర్వాత్తర్వాత అంతగా ఉండదు. నామట్టు నాకు ఇవి (కడిగేస్తాన్ , అనగనగా ఒక “రాజు”, రామోజీరావుకి కోపమొచ్చింది) బాగా వచ్చాయని అనిపిస్తుంది. కాబట్టి నాలుగు నాళ్ళు ఉండే కథలు, నాలుగు రకాల కథలతో మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి. you should look for a career. మీరుపడే కష్టమూ, తపనా మూణ్ణాళ్ళ ముచ్చట కాకూడదు కదా!
- ఇన్‌ఫర్మేటివ్ సినిమాలు తియ్యాలి అని, ప్రొడ్యూసరు డబ్బులతో జనాల్ని ఉద్దరించబోకండి. ఇదో ఇలా దారుణంగా (అకాల మరణాలు) ఫట్టవుతారు.
- కాముడీ కాముడీనే, సీరియస్ సీరియస్సే. కాముడీ 🙂 ఇంపార్టెన్సు గుర్తించండి. విహారి, తోటరాముడి పోస్టు కోసం చూడండి జనాలు ఎలా ఎదురు చూస్తారో? Don’t get carried away by international movies. Always keep your target audience in mind.
- మీకంటూ ఒక ఇమేజ్ ఉంటే ఓపనింగ్స్ సులభంగా వస్తాయి. నవతరంగం, రానారె పోస్టులు ఎంత ఇదిగా చదువుతారో గమనించండి.
- మీకు నచ్చింది కదా అని అందరికీ నచ్చాలని లేదు, ఇలా సినిమా తీద్దాం రా! , రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)
- అందరికి నచ్చేవిషయాలపై సినిమాలు తియ్యండి, ఇలా (మహేష్ బాబు)
- తెలుగు ఇండస్ట్రీలో పరిచయాలు చాలాముఖ్యమని విన్నాను. ఈ పోస్టులో లాగా, ఇక్కడ మన “చావా” పొస్టుని మక్కికి మక్కీ దింపేస్తున్నారు అందరితో మంచి రిలేషన్స్ మెయిటెయిన్ చెయ్యండి. (నేను ఈపోస్టు రిలేషన్స్ మెయిటెయిన్ చెయ్యడం కోసం రాయలేదు, నిజానికి నాగురించి ఇక్కడ నా మొదటి పోస్టులో చెప్పినట్టు, ఎప్పుడూ నాకు తోచిందే రాశాను).
- కొన్ని టాపిక్కులు ఇంటెరెస్టింగ్‌గా వుంటాయి. కానీ వాటిల్లో రెండున్నర గంటలు లాగేంత సినిమా వుండదు. full length సినిమా తియ్యడానికి మీ స్టోరీ సరిపోతుందేమో చెక్ చేసుకోండి. లేకపోతే ఇక్కడలా (వెన్నెలా…, అమృతం ) విషయం వున్నా, స్టామినా లేకుండా పోతుంది.
- మీరు తీసే సినిమా పూర్తి క్లారిటీతో, పూర్తి స్క్రీన్‌ప్లేతో మొదలు పెట్టండి. క్లారిటీ లేకపోతే ఇదో ఇలా (అమృతం కురిసిన రాత్రి) ఫ్లాపవుతారు.
- ఇలాంటి “డింగుటకా” — 2037 లో ఒక సినిమా రివ్యూ by Yo!man™ ఫాంటసీల్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. calculated risk తీసుకోవడం అలవాటు చేసుకోండి. production cost కంట్రోల్ చెయ్యాలంటే ఇది తప్పనిసరి.
- ఒక స్టేజిలో రెగ్యులర్‌గా ఏదో ఒకటి రాసేస్తూ ఉండేవాణ్ణి, టాపిక్లో ఎక్కువ ఇంటరెస్టు లేకపోయినా. ఇండస్ట్రీకి వెళ్ళి మిమ్మల్ని ప్రూవ్ చేసుకుంటే మాత్రం, don’t get carried away with success. ఇమేజ్‌ని ఎలాగోలా క్యాష్ చేసుకోకండి. కాస్త నిదానంగా సినిమాలు తియ్యండి, క్వాలిటీ కోసం.
- చాలా మంది నాతో ఏకీభవించక పోవచ్చేమోగానీ, సినిమా బాగా తియ్యడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా ప్రమోట్ చెయ్యడం, దాన్ని ప్రదర్శించడానికి డిస్ట్రిబ్యూటర్లూ, థియేటర్లూ దొరకడమూ, రిలీజ్ టైమింగూ అంతే ముఖ్యమని గమనించండి.
- ఎంత కష్టపడ్డా అనుకోని ఫ్లాపులూ, ఊహించని హిట్లూ కూడా వస్తాయని గ్రహించండి. అటువంటి వాటికి మానసికంగా సిద్ధంగావుండండి.
-.-:BEST OF LUCK:-.-