దిల్ సే …

నవంబర్ 26, 2008

తెలుగు భాష — Damage Control

ఈ టాపిక్ మీద ఒక పోస్టు రాద్దామని కొన్ని రోజుల్నించి అనుకుంటున్నా. ఎంత ఫీలయినా ఫీలింగు లోపల్నించి బయటికి రాదే! దీనికి రెండు కారణాలు. ఒకటి ఒక పెద్దాయన చెప్పినట్టు “గుళ్ళో కెళ్ళి దేవుడు లేడనడనడం అవసరమా?” అని. ఇంకోటేమో… ఫీలింగు ఎక్కువా కంటెంటు తక్కువా వుంది, అందుకని. సరే… అసలు విషయానికి వచ్చేముందు చిన్న అభ్యర్ధన. నే రాసింది మీకు నచ్చితే నచ్చిన అభిప్రాయాలు తీసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. constructive criticism is always welcome on my blog. నామటుకు నేను తెలుగు అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళలో ఒకడిగా భావిస్తాను.

ఇంటర్నెట్ లో తెలుగు అభివృద్ధికి పాటు పడుతున్న వాళ్ళకి ఒక సూటి ప్రశ్న. మీరు చేసే ప్రయత్నాలు తెలుగుని అభివృద్ధిచేస్తున్నామని తెలిసి చేస్తున్నారా లేక మీకు తెలిసింది (చాతనయింది) చే(సే)సి తెలుగుని అభివృద్ధి చేస్తున్నామనే భ్రమలో ఉన్నారా? offend  చెయ్యడం నా అభిమతం కాదు. అలా ప్రశ్న అడిగితే జనాలు తర్కించుకుని కాస్త ఈలోకంలోకి వస్తారని.

  • ఈ పదాల్ని సృజించే తొక్కలో business కి కాస్త (చాలా) పదునుపెట్టాల్సిన అవసరం వుంది. ఇంగ్లీషులో mail అనే పదం వుంది. కంప్యూటర్‌లో mail పంపితే దాన్ని e-mail అన్నారు. ఇది సులభంగా జనాలకి ఎక్కుతుంది. మనం ఏమి చేశాము? దీన్ని ‘వేగు’ అంటున్నాం. ఈ ‘వేగు’ ని తుంగలో తొక్కి తొమ్మిది తరాలయ్యింది(క్యాలికులేటర్ బయటికి తియ్యొద్దు, ఏదో ప్రాస కోసం కుమ్మేశా). ఇది ‘వేగు’ కాదు అయితే గియితే ‘e-వేగు’ అవ్వాలి (‘e-ఉత్తరం’ నా ఫేవరైట్). e-సేవ బోల్డంత పాపులర్ అయ్యింది కదా. బహుశా, ‘e-ఉత్తరం’ కూడా పాపులర్ అవుతుందేమో కానీ ‘వేగు’ జనాలకి ఎక్కదండీ బాబూ.
    ఇక్కడ సమస్య “గ్రాంధికమా, వ్యావహారికమా?” అని కాదు. ఎక్కువ వ్యావహారికమా తక్కువ వ్యావహారికమా అని. ఇందుకే మావూళ్ళో “internet center కి వెళ్తున్నా, mail చూసుకోవాలి” అంటే అర్థంచేసుకోగల చాలామంది “అంతర్జాల కేంద్రానికి వెళుతున్నా, వేగులు చూసుకోవాలి” అంటే గుడ్లు తేలేస్తారు.
  • నేను ఇంతకు ముందు ఒక “Total mess” అనిపించే ఒక ప్రాజెక్టులో పని చేశాను. ఇక ప్రాజెక్టు  చెయ్యిజారినట్టే అనే పరిస్థితుల్లో కంపెనీ ఒక పేధ్ధ కన్సల్టంట్‌ని hire చేసుకున్నారు(అద్దెకు తెచ్చుకున్నారు). ఈ పెద్దాయని ఓ వారం పాటు నిశితంగా పరిశీలించి ఒక గోప్ప్ప నిజాన్ని కనుక్కొన్నాడు. అదేంటంటే “ఇక్కడ ఇది సమస్య” అని సమస్యని ఎవరు ఎత్తి చూపుతారు అని అడిగాడు. సమాధానం —“ఎవరైనా”. “ఇది సమస్య” అని ఎవరు నిర్ధారిస్తారు అంటే సమాధానం “అటువంటిదేమీ లేదు”. “సమస్య వస్తే ఎవరు ఎవర్ని కలవాలి?” అంటే సమాధానం “ఎవరయినా… ఎవర్నయినా…”.
    ఇంత సోది ఎందుకు చెబుతున్నానంటే సమస్య ఇది అని తెలియకపోతే మీ(మన) శ్రమ అంతా వృధా పోతుంది. నాకు తెలిసి ఇప్పటికే తెలుగు భాషకి చాలా నష్టం జరిగి పోయింది. ఈ నష్టం అంతా వ్యావహారికానికే. “వ్యావహారికానికి ” సమస్య అని గ్రహిస్తే, బహుశా, దాన్ని  బ్రతికించుకోవటానికి ఎక్కువ శ్రమ పడొచ్చు(By the way, worst is yet to come).
  • మనకి కొత్తకొత్తవి (వస్తువులూ, వ్యవహారాలూ, అలవాట్లూ…) అన్నీ ఇంగ్లీషు మాట్లాడే దేశాలనించే వస్తున్నాయా? T.V, Radio, telephone, iPod ఇలాంటివి ఎన్నో. మరి ఇదే చైనా లోనూ, జపాన్ లోనూ అంతెందుకు? ఐరోపా దేశాలన్నింటిలోనూ  జరుగుతున్నాయి కదా. మరి వాళ్ళు వాళ్ళ సంస్కృతీ, భాషా పోగొట్టు కోవడంలేదే. మనం ఇంత vulnerable గా ఎందుకున్నాం? ఇది మనం చూడాల్సిన మరోకోణం.
    ఇజ్రాయేల్ దేశం వచ్చాక వాళ్ళు వాళ్ళ సంస్కృతిని ఎలా తిరిగి నిలబెట్టుకున్నారో పరిశీలిస్తే మనకీ ఉపయోగపడతాయేమో! (Did I get  too far? -))
  • Damage Prevention — ఇంతకు ముందే చెప్పినట్టు, వ్యావహారిక తెలుగుకి మూడింది. worst is yet to come. అగ్నిమాపక సిబ్బంది చేసినట్టు కాలే ఇళ్ళు వదిలేసి చుట్టుపక్కల ఇళ్ళకి మంటలు పాకకుండా చూడాలేమో. ఎవరు వద్దన్నా, కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు, కొత్త ఆచార వ్యవహారాలు రాక మానవు. ఇటువంటి వాటిల్లో ఏదయినా కొత్త పదం తగలగానే మన జనాలు రంగంలోకి దిగాలేమో! అటువంటి వారికోసం చిన్న చిన్న సరదా పదాలు ఈ పోస్టు చివర్న ఇచ్చాను. Have fun.
  • Recovery — కొన్ని కొన్ని పదాలూ, కొన్ని కొన్ని భావాలూ వద్దన్నా నచ్చేస్తాయి. కూడదని తొక్కిపెట్టినా తన్నుకుని వచ్చేస్తాయి. వీటిని లక్ష్యంగా కొంత కృషి చేస్తే వ్యావహారిక తెలుగులో చాలా తేడా వస్తుంది. ఉదాహరణకి…
    • Hi (Hai)
    • Bye
    • Sorry
    • Thanks
    • By the way…
    • You know what…
    • Like…
    • For example…
    • I know…
  • కొద్ది ప్రయత్నంతో ఎక్కువ ఫలితం రావడానికి అవకాశాలు కొన్ని ఎప్పుడూ వుంటాయి. దీన్ని physics లో ఏమంటారు అనేవిషయాన్ని పక్కనపెడితే… “అటువంటివి, మనకి పనికొచ్చేవి ఏమయినా వున్నాయా?” అని అలోచిస్తే తప్పులేదుగా. ఉదాహరణకి… ఒక్క పది తెలుగు అంకెలు నేర్చుకుంటే అన్ని సంఖ్యలూ తెలుగులోనే రాసేయవచ్చు. ఇది సరైన నిర్ణయమో కాదో నాకు తెలియదు. ఎందుకంటే, దీనివల్ల సామాన్యులకి సమాచారం దూరమయ్యే ప్రమాదముంది. కానీ, ఇది గమనించిన తాబాసు అభినందనీయులు. ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి.
    Software Developers (Coders)కి IDE ఇచ్చినట్టు “తెలుగు భాషలో అలంకారాలు”, “వ్యాకరణం”, “పద్యాలు రాయడం పై సరదా పోటీలు” వంటివి, ఇక్కడ రాసే వారికి ఉపకరించే ఉపకరణాలు, సలహాలు, సూచనలు ఒక చోట కూర్చవచ్చా? ఇది ఇంటర్నెట్లో భాష వ్యాప్తికి ఉపకరించదా?
  • ఇట్లా చెబుతూ పోతే చాలా అవుతాయేమో. ఇది మంచి చర్చకి దారి తీస్తే సంతోషం. పైన చెప్పిన పదాల పజిల్ ఇదిగోండి. తెనిగించడానికి ప్రయత్నించండి. సరదాగా ఇటువంటి ఇంగ్లీషు పదాలు ఇంకొన్ని మీరు కలపకూడదూ?
    • parent
    • step-father
    • dating
    • flirting
    • half-brother
    • surrrogate-mother
    • biological-mother
    • proposing someone
    • relationship
    • move-in relationship
    • ask-out
    • seeing someone
    • hitting on someone
  • ఎంత తల బాదుకున్నా, మనం ఏమీ చెయ్యలేని విషయాలు కొన్ని వుంటాయి. ఉదాహరణకి…నామట్టుకు నేను ఇంగ్లీష్‌లో precision of expression ఎక్కువ అని నమ్ముతాను. అలాగని నేను మన భాష మీద అభిమానం లేని వాణ్ణి కాదు -).

23 వ్యాఖ్యలు »

  1. ఎప్పుడో చదివినట్టు గుర్తు. ఇండియా టుడే వాళ్ళు email కి పెట్టిన తెలుగు పేరు “విధ్యుల్లేఖ”

    వ్యాఖ్య ద్వారా వెంకట భాస్కర్ — నవంబర్ 26, 2008 @ 11:38 సా. | స్పందించండి

  2. మంచి అంత:దృష్టి (insight). ఈ పదంకూడా సరైనదోలేదో తెలీదు నాకు. “బలవంతంగా” తెలుగు పదాలు కనిపెట్టడంకన్నా, ఉన్నవాటిని గౌరవప్రదంగా వాడితే అదే మనం తెలుగుకు చేసే మేలేమో!

    ఎక్కడో నేను రాసినట్లు, ‘భాష అనేది భావప్రకటనకూ,జ్ఞానసమపార్జనకూ మరియూ జీవనోపాధికీ పనికిరావాలి. అలా కానిరోజున ఆ భాష ఎందుకూ పనికిరాకుండా పోతుంది.’ ఇప్పటికే తెలుగు జ్ఞానసమపార్జనకూ, జీవనోపాధికీ కొరగాకుండా పోయింది. మనలాంటి బ్రతకనేర్చినవాళ్ళు భావప్రకటన పేరుతో ఇంకా తెలుగును బ్రతికిస్తున్నాము. కానీ, రాబోయే నగరసంస్కృతిలో ఈ భావప్రకటనా అవసరం లేకుండాపోతుందేమో. అప్పటికి భావాలూ, ఆలోచనలూకూడా ‘తెలుగుకాని’ భాషలో వుంటాయి.

    తెలుగుభాష వాడుకను పెంపొందించే ప్రయత్నాల్లోకూడా అతివాదం, ఇతరభాషల పట్ల ద్వేషం కనిపిస్తున్నాయి. మనలోని సాంస్కృతిక-సాంఘిక-భాషాభోధనలోని లోపాల్ని గ్రహించకుండా, ఎవడి కారణంగానో లేక ఏ ఇతర భాష కారణంగానో మన తెలుగుకు అన్యాయం జరిగిపోతోందనే ధోరణి కనిపిస్తోంది. తెలుగు పరిస్థితికి కారణం తెలుగువారి తెలుగుతనంలోని శూన్యత. అది ఒక విస్తృతమైన సామాజిక రుగ్మత. అందులో ఒక భాగం మాత్రమే మాతృభాషా వియోగం.

    వ్యాఖ్య ద్వారా కె.మహేష్ కుమార్ — నవంబర్ 27, 2008 @ 9:33 ఉద. | స్పందించండి

  3. బాగా వ్రాశారు! ఇప్పుడు మీరు తెలుగు భాష అభివృద్ధి నిరోధక సంఘంలో చేరినట్లే కొంతమంది దృష్టిలో!! ఈ పదాలు కనిపెట్టే ఆసాములంతా పదే పదే చెప్పే మాట – ‘వాడుతూ వుంటే అవే అలవాటవుతాయి’. ప్రతీ ఇంగ్లీషు పదానికి తెలుగు సమానార్థకాల్ని సృష్టించాలనుకోవడం వ్యర్థప్రయత్నం నాదృష్టిలో. నా మటుకు నేను వీలయినంత వరకూ ఇంట్లో తెలుగులోనే మాట్లాడతాను. కానీ మృదులాంత్రం, అంతర్జాలం వగైరా పదాలు వాడే స్థాయిలో మాత్రం కాదు.

    వ్యాఖ్య ద్వారా ఫణి కుమార్ — నవంబర్ 27, 2008 @ 1:56 సా. | స్పందించండి

  4. తెలుగు అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళలో మీరొకరని స్పష్టంగా అర్థమైంది. అయితే, అభివృద్ధి ఎలా చెయ్యాలనే విషయమై మీరు చెప్పదలచినది స్పష్టంగా లేదనిపించింది. ముఖ్యంగా-

    ఈమెయిలు ఇంటర్నెట్, లాంటివాటిని అనువదించడం ఎందుకంటూనే, హై,బై,సారీ,థాంక్సు లాంటివాటికి తెలుగు పదాలు కనుక్కోవాలని అంటున్నారు.

    “ఉదాహరణకి… ఒక్క పది తెలుగు అంకెలు నేర్చుకుంటే అన్ని సంఖ్యలూ తెలుగులోనే రాసేయవచ్చు. ఇది సరైన నిర్ణయమో కాదో నాకు తెలియదు. ఎందుకంటే, దీనివల్ల సామాన్యులకి సమాచారం దూరమయ్యే ప్రమాదముంది. కానీ, ఇది గమనించిన తాబాసు అభినందనీయులు. ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి.” ఇక్కడ మీ ఉద్దేశ్యమేంటో అర్థం కాలేదు. తెలుగు అంకెలు వాడాలనా, కూడదనా? ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలన్నపుడు, ఇంటర్నెట్టును అంతర్జాలం అంటే తప్పేంటి?

    వ్యాఖ్య ద్వారా చదువరి — నవంబర్ 27, 2008 @ 2:05 సా. | స్పందించండి

  5. చదువరి గారూ మంచి ప్రశ్న అడిగారు. నేను అక్కడ స్పష్టంగా రాయలేదనుకుంటా.
    నేనన్నది…కేవలం పది అంకెలు గుర్తుపెట్టుకుంటే సంఖ్యలన్నీ తెలుగు అయిపోతాయి కదా. ఇటువంటి “చిన్న ప్రయత్నం, పెద్ద లాభం” విషయాలు ఇంకేమయినా వున్నాయా అని వెతకాలి” అని. ఇటువంటి వాటిని ప్రోత్సహించాలి.

    కానీ ఈ ఒక్క (అంకెల/సంఖ్యల) కేసూ ప్రత్యేకమైనది. ఎందుకంటే కేవలం సంఖల్లో బోలెడంత సమాచారం link అయివుంటుంది. ప్రతీ వెబ్సైటూ ఒక “user-id no” అనో customer ID అనో SSN అనో application no అనో complaint number అనో ఉపయోగిస్తుంటుంది. అంతా సంఖ్యలతో నడిచే కాలంలో ఉన్నాం మనం. అందువల్ల ఇది కొంచెం risky అని అంటున్నాను. ఉదాహరణకి ట్రెయిన్ నంబర్లు, హాల్‌టికెట్టు నంబర్లూ ఉన్నఫళంగా తెలుగులోకి మార్చేస్తే ఇక తూరుపు తిరిగి దణ్ణం పెట్టుకోవడమే దిక్కు.

    సంఖ్యల్ని తెలుగులోకి మార్చేస్తే జనసామాన్యానికి సమాచారం దూరమవుతుందికదా అని చిన్న అనుమానం. అంతకు మించి ఏమీలేదు.

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — నవంబర్ 27, 2008 @ 2:36 సా. | స్పందించండి

  6. నేను చెప్పదలుచుకున్నది ఇదీ…..
    “ఇక్కడ సమస్య “గ్రాంధికమా, వ్యావహారికమా?” అని కాదు. ఎక్కువ వ్యావహారికమా తక్కువ వ్యావహారికమా అని.”

    తెలుగు బ్లాగులోకం కొత్త తెలుగు పదాల్ని తయారు చేస్తున్నది (కొత్తవి అయినా, పాత వాటి నించి సృష్టించబడినవి అయినా). ఈ కృషి అభినందనీయం. మరి ఈ పదాల్ని ఏమి చేసుకుందాము? కూరొండుకు తిందామా? పదిమంది వాడుక కోసం తయారయ్యే పదాలు పదిమందీ వాడడానికి ఉపయోగపడేలా పదిమందీ వాడే పదాలనించీ రావాలని నా అభిప్రాయం.

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — నవంబర్ 27, 2008 @ 2:47 సా. | స్పందించండి

  7. “కూరొండుకు తిందామా?” – !

    వ్యాఖ్య ద్వారా చదువరి — నవంబర్ 27, 2008 @ 3:53 సా. | స్పందించండి

  8. ◦parent అయ్య, బాబు, తండ్రి, పాపా, నాన్న,..
    ◦step-father సవత్తండ్రి
    ◦dating ట్రైచెయ్యటం
    ◦flirting
    ◦half-brother సగమన్న ఛ)
    ◦surrrogate-mother మారు తల్లి
    ◦biological-mother అసలు తల్లి
    ◦proposing someone అడుక్కోటం, సైటు కొట్టడం, కలరింగ్
    ◦relationship సంభంధం
    ◦move-in relationship
    ◦ask-out
    ◦seeing someone కలరింగ్
    ◦hitting on someone

    వ్యాఖ్య ద్వారా chavakiran — నవంబర్ 27, 2008 @ 4:18 సా. | స్పందించండి

  9. @చదువరి — 🙂

    @chavakiran — బాగా ప్రయత్నించారు, 🙂

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — నవంబర్ 27, 2008 @ 4:26 సా. | స్పందించండి

  10. SravaN gAru,నేనివ్వాళ్ళె బ్లాగు ప్రపంచంలో ఆడుగుపెట్టాను.పెట్టంగానే నాకూ మీరన్న భావమే కలిగింది.ఇదివరకు కూడా మనం కొన్ని వేరే భాషాపదాలని తెలుగులో తీసుకున్నాం.ఇంకా తీసుకుంటాం.తీసుకోవాలి. సరిగ్గ బ్లొగ్గింగ్ ఇంకా రాలేదు. వీలైతే నేను ఏకభవించిన నా భావాన్ని చదవండి.http://rayraj.wordpress.com/ ; ఇంకా మిమ్మల్ని ఎలా సంప్రదించాలో కూడా నేన్నేర్చుకోవాలి.

    వ్యాఖ్య ద్వారా rayraj — నవంబర్ 27, 2008 @ 5:21 సా. | స్పందించండి

  11. శ్రవణ్ గారు,నేనివ్వాళ్ళె బ్లాగు ప్రపంచంలో ఆడుగుపెట్టాను.పెట్టంగానే నాకూ మీరన్న భావమే కలిగింది.ఇదివరకు కూడా మనం కొన్ని వేరే భాషాపదాలని తెలుగులో తీసుకున్నాం.ఇంకా తీసుకుంటాం.తీసుకోవాలి. సరిగ్గ blogging ఇంకా రాలేదు. వీలైతే నేను ఏకభవించిన నా భావాన్ని చదవండి.http://rayraj.wordpress.com/ ; ఇంకా మిమ్మల్ని ఎలా సంప్రదించాలో కూడా నేన్నేర్చుకోవాలి.

    వ్యాఖ్య ద్వారా rayraj — నవంబర్ 27, 2008 @ 5:22 సా. | స్పందించండి

  12. ” మనకి కొత్తకొత్తవి (వస్తువులూ, వ్యవహారాలూ, అలవాట్లూ…)……పరిశీలిస్తే మనకీ ఉపయోగపడతాయేమో! (Did I get too far? ) ”

    మీరు టూ ఫార్ కాదు. కరెక్టుగా దగ్గరకి వచ్చి వెల్లి పోయారు.
    ఇంకో ఉదాహరణ: ఇటాలియన్లు వాల్ల తిండిని వాళ్ళ భాషలోనే ఎలా మార్కెట్ చేశారు!? కొద్దో గొప్పో ఉడిపి టిఫిన్స్ అంటూ ఇడ్లీ, దోశా,వడ దేసవ్యాప్తంగా అవే పేరుతో ఫేమస్ అయ్యాయాలేదా! ఇప్పుడుకూడా ఓ ఫ్రెండ్ అంటాడు:ఇండియన్ వంటల్ని అంతర్జాతీయంగా అవే పేరుతో అమ్మాలి అని.

    వ్యాఖ్య ద్వారా rayraj — నవంబర్ 27, 2008 @ 5:36 సా. | స్పందించండి

  13. చివరిగా, మీరడిగిన చాలా పదాలకి కొన్ని పాత తెలుగు పదాలున్నాయి. మానవ సంబంధాలకి సంబంధించి, మనసులో చెలరేగే భావాల గురించి తెలుగు భాషలో పదాలు బోలెడు. అవి మాత్రం తెలుగు నేర్చుకోవడం ద్వారా వస్తాయి.కొంచెం తెలుగులో రాయడమే కాకుండా, చదువుకోవాలి కూడానేమో మనం :).

    వ్యాఖ్య ద్వారా rayraj — నవంబర్ 27, 2008 @ 5:50 సా. | స్పందించండి

  14. @rayraj
    మీరు తెలుగు బ్లాగులోకానికి కొత్త అంటున్నారు కదా!
    మీరు “తెలుగుబ్లాగు” గూగుల్ గుంపులో సభ్యులు అవ్వండి. మిగతా చెత్త discussion boardsలో లాగా కాకుండా ఇక్కడ జనాలు మర్యాదగా ప్రవర్తిస్తారు. You are going to love it.

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — నవంబర్ 27, 2008 @ 5:54 సా. | స్పందించండి

  15. Software Developers (Coders)కి IDE ఇచ్చినట్టు “తెలుగు భాషలో అలంకారాలు”, “వ్యాకరణం”, “పద్యాలు రాయడం పై సరదా పోటీలు” వంటివి, ఇక్కడ రాసే వారికి ఉపకరించే ఉపకరణాలు, సలహాలు, సూచనలు ఒక చోట కూర్చవచ్చా? ఇది ఇంటర్నెట్లో భాష వ్యాప్తికి ఉపకరించదా?

    ఇవి జరుగుతున్నాయనే నేననుకుంటున్నాను. ఒకసారి పొద్దులో భువనవిజయం సంగతులు చదవండి.
    అలాగే కౌముది పత్రిక వారి కథల పోటీ కూడా చూడగలరు.
    ఇలాంటి కార్యక్రమాలు భాష అభివృద్ధికి దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు.

    అయితే నేను కొత్త పదాలు వాడడానికి కూడా వ్యతిరేకం కాదు. అంతర్జాలం లాంటి పదాలు వాడరని మీరంటున్నారు. ఆ పదం మెయిన్‍స్ట్రీమ్‍లోకి వచ్చి చాలా రోజులయింది. మొదట బ్లాగులలో వాడిన పదం ఇప్పుడు పత్రికలలో విరివిగా వాడుతున్నారు.
    అలా వాడడంలో తప్పుందని నాకనిపించడం లేదు. అయితే అన్ని పదాలనూ తెలుగీకరించనవసరం లేదనే వాదనతో నేనేకీభవిస్తాను.

    వ్యాఖ్య ద్వారా ప్రవీణ్ గార్లపాటి — నవంబర్ 27, 2008 @ 6:12 సా. | స్పందించండి

  16. You seem to be mixing up things here.
    1. Blogging is a hobby, Just like any other hobby this will invent/coin its own words only the people inside the group can understand. Example of blog words “blogosphere, moblog etc..” , “te: Tapa, maMTa nakka, ”
    2. There are some words coined for equivalent English words by other people (note non-bloggers) and used widely by bloggers (example te: aMtarjaalaM, jaalaM, )
    3. There are some words coined by bloggers for Equivant English words nenarlu, vEgu etc… vEgu might even join in first group.

    If your objection is to 1, then forget it, stop worrying about them they are for the bloggers and by the bloggers, don’t worry about how outsiders react etc..

    If your objection is to 2, then also forget it 🙂 They are not coined by bloggers.

    If your objection is to 3, cool! fight We will follow the winner 🙂

    వ్యాఖ్య ద్వారా chavakiran — నవంబర్ 27, 2008 @ 9:15 సా. | స్పందించండి

  17. @చావా…
    మీ విశ్లేషణ బావుంది. నేననేది తెలుగు కోసం తయారయ్యే పదాలు (ఎవరు తయారు చేసినా) ఎక్కువ వాడుక వాడుకలో ఉన్న పదాలనించి రావాలి అని. అప్పుడు సులభంగా అవి వ్యాప్తి చెందుతాయి అని. మీరన్నట్టు bloggers’ jargon గురించి పెద్దగా(అస్సలు) పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

    @others,
    చర్చని “అంతర్జాలం/వేగు” పదాలకి పరిమితం చెయ్యొద్దు. అవి కేవలం నాకు తట్టిన ఉదాహరణలు. వాటిని suggest చేసినవాళ్ళెవరైనా వ్యక్తిగత దూషణగా అనుకొనే అవకాశం కూడా వుంది.

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — నవంబర్ 27, 2008 @ 9:55 సా. | స్పందించండి

  18. ఏ భాష ప్రయోజనమైనా ఎదుటివారికి అర్థం అయ్యేలా చెప్పగలగటమే. రైలు, ఫోను, కంప్యూటర్, ఇంటర్ నెట్, – లాంటి పదాలు సామాన్యులకి కూడా అర్థం అవుతున్నప్పుడు, వాటి అనువాదాలకోసం అంతగా ప్రయత్నం దేనికి?
    ముస్లిముల, బ్రిటిష్ వారి దండయాత్రల తరువాత, ఆధునిక సాంకేతికత (Technology) వల్ల, కొత్త కొత్త వ్యవహారాలూ, పదాలూ వాడుకలోకి వచ్చాయి; వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా, నామవాచకాల( Nouns )లో చాలా ఎక్కువగా కొత్త పదాలు అవసర మవుతున్నాయి. ఆయా వస్తువులకు తయారుచేసినవారు పెట్టిన పేర్లనే,specifications నే( ఏ భాషలోవి అయినా )యథాతథంగా ఉంచటం వల్లనే,అవగాహన ( Conceptual visualisation )కి పూర్తి సౌకర్యంగా ఉంటుంది కదా !
    క్రియా పదాల( Verbs )లో మరీ అంత ఎక్కువ మార్పుల అవసరమే కనపడదు.
    ఎందుకంటే, విదేశీయుల రాకకు ముందే, మనదేశంలో, మన భాషలో –
    సంపూర్ణమైన భావజాలం, పదజాలం ఉన్నాయి. ఇక కావలసిందల్లా,కొత్త కొత్తగా వచ్చిపడుతున్న వస్తువులు, సేవల పెర్లే! తెలుగు క్రియలున్న వాక్యాలలోనే, ఆయా ఇతర పదాలను వాడుకోవటంవల్ల, మన భాష యొక్క మౌలిక స్వరూపం మారదు; భాషాభివృద్ధికి వచ్చిన ప్రమాదమూ ఏమీ ఉండదు.

    ఉదాహరణకు, తమిళ సోదరులనే తీసుకుందాము. ” i WILL TRY ”
    అనేందుకు వారు – ” TRY పన్డ్రే.” అంటారు. ఏ ఇంగ్లీష్ verb తరువాతనయినా, ” పండ్రే” ( అంటే- I DO అని )కలుపుకుని, ఆ ఇంగ్లీష్ verb నే వాడేసుకుంటారు!eMta haayi ! ఏమంటారు?

    వ్యాఖ్య ద్వారా samanvayabharathi — నవంబర్ 29, 2008 @ 8:51 ఉద. | స్పందించండి

  19. […] ననుకుంటా) ఇవ్వాళ నాకు నచ్చింది – పాత డామాజ్ కంట్రోల్ కూడా ఒక సారి  […]

    పింగ్ బ్యాక్ ద్వారా వాలెంటైన్-మన సంస్కృతి « Rayraj Reviews — ఫిబ్రవరి 14, 2009 @ 9:11 సా. | స్పందించండి

  20. […] ననుకుంటా) ఇవ్వాళ నాకు నచ్చింది – పాత డామాజ్ కంట్రోల్ కూడా ఒక సారి  […]

    పింగ్ బ్యాక్ ద్వారా మంటనక్క-వాలెంటైన్-మన సంస్కృతి « Rayraj Reviews — ఫిబ్రవరి 14, 2009 @ 9:16 సా. | స్పందించండి

  21. Hi Sravan,

    I loved your article. Unfortunately,I do not have a software to type in Telugu. I prefer to write in English becasue Telugu written in English is painful to read.

    There is nothing wrong with using English words in our vocabulary.Specially,the new technical ones. I do have problem with the kind of expressions being used these days( especially in the movies).
    E.G: Anta Scene ledu, Busy lo unna, Tension avvaku. Site kottatam. Don’t you think this is disgusting?

    వ్యాఖ్య ద్వారా Srinivas Vangala — మార్చి 28, 2009 @ 4:02 సా. | స్పందించండి

  22. ఈ లింక్ ను చూడండి :
    https://fedorahosted.org/pipermail/fuel-discuss/2009-December/000085.html

    వ్యాఖ్య ద్వారా పాణ్యం శ్రీపాద — మే 15, 2010 @ 3:18 సా. | స్పందించండి

  23. ఇంతవరకు బాగానెవుంది. కానీ కొన్ని కొత్త పదాలు వస్తున్నయె వీతిని యెమి చెయ్యాలి. వుధా.తిట్టాదు అనెదానికి దెంగలుపెట్టాడు అని వెల్లిర అనెదానికి దొబ్బెయ్ అని ఇంక ఎన్నొ

    వ్యాఖ్య ద్వారా RAGHU — సెప్టెంబర్ 14, 2010 @ 1:19 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.