దిల్ సే …

మార్చి 12, 2009

TOP 10 డవలాగులు

చంద్రబాబు ……………… ముఖ్యమంత్రి కొన్ని వేలకోట్ల రూపాయలు సంపాదించారు
రాఘవులు ……………. “చంద్రబాబు పాలన…….” కి కట్టుబడి ఉన్నాం
వైయస్సార్ …………….. అధిస్టానం చూసుకుంటుంది
చిరంజీవి ……………….. సామాజికన్యాయం
కేసియార్ ………………. బొందబెడతాం
నాగబాబు ……………… పూజకి పనికి రాని పువ్వు
రాజశేఖర్ ……………… సానుబూతులు

And the joint winners are…
రోజా …………………… పళ్ళు రాలగొడతా
బాలకృష్ణ ……………….. సామాన్యులకు రక్షణేది?

Consolation prize goes to …
మోహన్‌బాబు ………… industry is not for onebody

నవంబర్ 26, 2008

తెలుగు భాష — Damage Control

ఈ టాపిక్ మీద ఒక పోస్టు రాద్దామని కొన్ని రోజుల్నించి అనుకుంటున్నా. ఎంత ఫీలయినా ఫీలింగు లోపల్నించి బయటికి రాదే! దీనికి రెండు కారణాలు. ఒకటి ఒక పెద్దాయన చెప్పినట్టు “గుళ్ళో కెళ్ళి దేవుడు లేడనడనడం అవసరమా?” అని. ఇంకోటేమో… ఫీలింగు ఎక్కువా కంటెంటు తక్కువా వుంది, అందుకని. సరే… అసలు విషయానికి వచ్చేముందు చిన్న అభ్యర్ధన. నే రాసింది మీకు నచ్చితే నచ్చిన అభిప్రాయాలు తీసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. constructive criticism is always welcome on my blog. నామటుకు నేను తెలుగు అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళలో ఒకడిగా భావిస్తాను.

ఇంటర్నెట్ లో తెలుగు అభివృద్ధికి పాటు పడుతున్న వాళ్ళకి ఒక సూటి ప్రశ్న. మీరు చేసే ప్రయత్నాలు తెలుగుని అభివృద్ధిచేస్తున్నామని తెలిసి చేస్తున్నారా లేక మీకు తెలిసింది (చాతనయింది) చే(సే)సి తెలుగుని అభివృద్ధి చేస్తున్నామనే భ్రమలో ఉన్నారా? offend  చెయ్యడం నా అభిమతం కాదు. అలా ప్రశ్న అడిగితే జనాలు తర్కించుకుని కాస్త ఈలోకంలోకి వస్తారని.

  • ఈ పదాల్ని సృజించే తొక్కలో business కి కాస్త (చాలా) పదునుపెట్టాల్సిన అవసరం వుంది. ఇంగ్లీషులో mail అనే పదం వుంది. కంప్యూటర్‌లో mail పంపితే దాన్ని e-mail అన్నారు. ఇది సులభంగా జనాలకి ఎక్కుతుంది. మనం ఏమి చేశాము? దీన్ని ‘వేగు’ అంటున్నాం. ఈ ‘వేగు’ ని తుంగలో తొక్కి తొమ్మిది తరాలయ్యింది(క్యాలికులేటర్ బయటికి తియ్యొద్దు, ఏదో ప్రాస కోసం కుమ్మేశా). ఇది ‘వేగు’ కాదు అయితే గియితే ‘e-వేగు’ అవ్వాలి (‘e-ఉత్తరం’ నా ఫేవరైట్). e-సేవ బోల్డంత పాపులర్ అయ్యింది కదా. బహుశా, ‘e-ఉత్తరం’ కూడా పాపులర్ అవుతుందేమో కానీ ‘వేగు’ జనాలకి ఎక్కదండీ బాబూ.
    ఇక్కడ సమస్య “గ్రాంధికమా, వ్యావహారికమా?” అని కాదు. ఎక్కువ వ్యావహారికమా తక్కువ వ్యావహారికమా అని. ఇందుకే మావూళ్ళో “internet center కి వెళ్తున్నా, mail చూసుకోవాలి” అంటే అర్థంచేసుకోగల చాలామంది “అంతర్జాల కేంద్రానికి వెళుతున్నా, వేగులు చూసుకోవాలి” అంటే గుడ్లు తేలేస్తారు.
  • నేను ఇంతకు ముందు ఒక “Total mess” అనిపించే ఒక ప్రాజెక్టులో పని చేశాను. ఇక ప్రాజెక్టు  చెయ్యిజారినట్టే అనే పరిస్థితుల్లో కంపెనీ ఒక పేధ్ధ కన్సల్టంట్‌ని hire చేసుకున్నారు(అద్దెకు తెచ్చుకున్నారు). ఈ పెద్దాయని ఓ వారం పాటు నిశితంగా పరిశీలించి ఒక గోప్ప్ప నిజాన్ని కనుక్కొన్నాడు. అదేంటంటే “ఇక్కడ ఇది సమస్య” అని సమస్యని ఎవరు ఎత్తి చూపుతారు అని అడిగాడు. సమాధానం —“ఎవరైనా”. “ఇది సమస్య” అని ఎవరు నిర్ధారిస్తారు అంటే సమాధానం “అటువంటిదేమీ లేదు”. “సమస్య వస్తే ఎవరు ఎవర్ని కలవాలి?” అంటే సమాధానం “ఎవరయినా… ఎవర్నయినా…”.
    ఇంత సోది ఎందుకు చెబుతున్నానంటే సమస్య ఇది అని తెలియకపోతే మీ(మన) శ్రమ అంతా వృధా పోతుంది. నాకు తెలిసి ఇప్పటికే తెలుగు భాషకి చాలా నష్టం జరిగి పోయింది. ఈ నష్టం అంతా వ్యావహారికానికే. “వ్యావహారికానికి ” సమస్య అని గ్రహిస్తే, బహుశా, దాన్ని  బ్రతికించుకోవటానికి ఎక్కువ శ్రమ పడొచ్చు(By the way, worst is yet to come).
  • మనకి కొత్తకొత్తవి (వస్తువులూ, వ్యవహారాలూ, అలవాట్లూ…) అన్నీ ఇంగ్లీషు మాట్లాడే దేశాలనించే వస్తున్నాయా? T.V, Radio, telephone, iPod ఇలాంటివి ఎన్నో. మరి ఇదే చైనా లోనూ, జపాన్ లోనూ అంతెందుకు? ఐరోపా దేశాలన్నింటిలోనూ  జరుగుతున్నాయి కదా. మరి వాళ్ళు వాళ్ళ సంస్కృతీ, భాషా పోగొట్టు కోవడంలేదే. మనం ఇంత vulnerable గా ఎందుకున్నాం? ఇది మనం చూడాల్సిన మరోకోణం.
    ఇజ్రాయేల్ దేశం వచ్చాక వాళ్ళు వాళ్ళ సంస్కృతిని ఎలా తిరిగి నిలబెట్టుకున్నారో పరిశీలిస్తే మనకీ ఉపయోగపడతాయేమో! (Did I get  too far? -))
  • Damage Prevention — ఇంతకు ముందే చెప్పినట్టు, వ్యావహారిక తెలుగుకి మూడింది. worst is yet to come. అగ్నిమాపక సిబ్బంది చేసినట్టు కాలే ఇళ్ళు వదిలేసి చుట్టుపక్కల ఇళ్ళకి మంటలు పాకకుండా చూడాలేమో. ఎవరు వద్దన్నా, కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు, కొత్త ఆచార వ్యవహారాలు రాక మానవు. ఇటువంటి వాటిల్లో ఏదయినా కొత్త పదం తగలగానే మన జనాలు రంగంలోకి దిగాలేమో! అటువంటి వారికోసం చిన్న చిన్న సరదా పదాలు ఈ పోస్టు చివర్న ఇచ్చాను. Have fun.
  • Recovery — కొన్ని కొన్ని పదాలూ, కొన్ని కొన్ని భావాలూ వద్దన్నా నచ్చేస్తాయి. కూడదని తొక్కిపెట్టినా తన్నుకుని వచ్చేస్తాయి. వీటిని లక్ష్యంగా కొంత కృషి చేస్తే వ్యావహారిక తెలుగులో చాలా తేడా వస్తుంది. ఉదాహరణకి…
    • Hi (Hai)
    • Bye
    • Sorry
    • Thanks
    • By the way…
    • You know what…
    • Like…
    • For example…
    • I know…
  • కొద్ది ప్రయత్నంతో ఎక్కువ ఫలితం రావడానికి అవకాశాలు కొన్ని ఎప్పుడూ వుంటాయి. దీన్ని physics లో ఏమంటారు అనేవిషయాన్ని పక్కనపెడితే… “అటువంటివి, మనకి పనికొచ్చేవి ఏమయినా వున్నాయా?” అని అలోచిస్తే తప్పులేదుగా. ఉదాహరణకి… ఒక్క పది తెలుగు అంకెలు నేర్చుకుంటే అన్ని సంఖ్యలూ తెలుగులోనే రాసేయవచ్చు. ఇది సరైన నిర్ణయమో కాదో నాకు తెలియదు. ఎందుకంటే, దీనివల్ల సామాన్యులకి సమాచారం దూరమయ్యే ప్రమాదముంది. కానీ, ఇది గమనించిన తాబాసు అభినందనీయులు. ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి.
    Software Developers (Coders)కి IDE ఇచ్చినట్టు “తెలుగు భాషలో అలంకారాలు”, “వ్యాకరణం”, “పద్యాలు రాయడం పై సరదా పోటీలు” వంటివి, ఇక్కడ రాసే వారికి ఉపకరించే ఉపకరణాలు, సలహాలు, సూచనలు ఒక చోట కూర్చవచ్చా? ఇది ఇంటర్నెట్లో భాష వ్యాప్తికి ఉపకరించదా?
  • ఇట్లా చెబుతూ పోతే చాలా అవుతాయేమో. ఇది మంచి చర్చకి దారి తీస్తే సంతోషం. పైన చెప్పిన పదాల పజిల్ ఇదిగోండి. తెనిగించడానికి ప్రయత్నించండి. సరదాగా ఇటువంటి ఇంగ్లీషు పదాలు ఇంకొన్ని మీరు కలపకూడదూ?
    • parent
    • step-father
    • dating
    • flirting
    • half-brother
    • surrrogate-mother
    • biological-mother
    • proposing someone
    • relationship
    • move-in relationship
    • ask-out
    • seeing someone
    • hitting on someone
  • ఎంత తల బాదుకున్నా, మనం ఏమీ చెయ్యలేని విషయాలు కొన్ని వుంటాయి. ఉదాహరణకి…నామట్టుకు నేను ఇంగ్లీష్‌లో precision of expression ఎక్కువ అని నమ్ముతాను. అలాగని నేను మన భాష మీద అభిమానం లేని వాణ్ణి కాదు -).

అక్టోబర్ 31, 2008

సింబాలిజమా? నీ బొంద.

నేను చూసిన సింబాలిజాలు.

  • హీరోకి క్యాన్సర్ అన్న విషయం హీరోయిన్‌కి సముద్రం పక్కన ఉన్నప్పుడే తెలుస్తుంది. ఒక అల ఒడ్డున రాయిని గుద్దుకుని ఉవ్వెత్తున ఎగసి  ఆగిపోతుంది.(కాలం నిలిచిపోయింది)
  • హీరోయిన్ త్యాగం చేసిన విషయం తెలిసిన హీరో తనని కలవడానికి వెళ్ళినప్పుడేమో వర్షం పడుతుంది. (హీరో ప్రేమలో హీరోయిన్ తడిసి ముద్దయ్యింది)
  • హీరోయిన్ ప్రసవవేదన పడుతుంటుంది. బయట ఉరుములు, తుఫానూ (???).
  • హీరోయిన్ అబార్షన్‌కి వెళ్తే, సీను చివర్లో కెమేరా వద్దన్నా గోడమీద పోస్టరు మీదికెళ్తుంది. అందులో పిల్లాణ్ణి  ఒక పేఏఏధ్ధ గంట ఢీకొట్టబోతూ ఉంటుంది. (బిడ్డని చంపేశారు)
  • హీరోనో, హీరొయిన్నో స్క్రీను మధ్యలో నిల్చుని ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్లో అట్నుంచి ఒక ట్రెయిన్ ఇటు వెళ్తుంది, మరుక్షణం  ఇట్నుంచి ఒక ట్రెయిన్ అటు వెళ్తుంది.(???)
  • హీరోయిన్ తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. బెడ్రూంలో లైటు ఆన్ఆఫ్ అవుతూ ఉంటుంది… sudden గా లైటు ఆరిపోతుంది (ఊగిసలాట అయిపోయింది, ఒక నిర్ణయం తీసుకోబడింది).
  • హీరోయిన్ బొత్తిగా అమాయకురాలు అయి క్యూట్‌గా ఉంటే introduction సీన్‌లో ఒక మేక పిల్ల వెంటో గొర్రె పిల్ల వెంటో పరిగెడుతుంటుంది. (అమాయకురాలు, క్యూట్‌గా ఉంది)
  • సెకండ్ హీరోయిన్ హీరో, హీరోయిన్ని కలుపుతుంది. క్లైమాక్స్‌లో అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ దూరంగా ఉన్న కొండలకేసి వెళ్ళిపోతుంది.(???)

లేటెందుకు? మీరు చూసింది ఒకటి మీరూ కమెంటండి…

అక్టోబర్ 17, 2008

TOP 10

* పూరీ without oil
* మరో ప్రస్థానం

* బట్టతల వచ్చేసిందే బాలా!

* మన అభివృద్ధి అగ్రహారాల దాకా వచ్చింది
*తెలంగాణా సాయుధ పోరాటం – ప్రశ్న-జవాబు

* వెధవతనంలో సిన్సియారిటీ…
* ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి “నాకెంతిస్తావు?” “అంత కాదు గానీ ఇంకో మాట చెప్పు” అని బేర సారాలు జరుగుతున్నాయంటే..దానికి సహజీవనమనో, పెళ్లనో గౌరవనీయమైన పేర్లెందుకు?

* సినిమా ఆఫ్ ది యియర్ (హ్యాపీ డేస్)

* మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…?

* దేవుడు బలే నాయాలు. కద మా!

* ఎముంది, నేను తన “జడ” చూస్తే తన నా “బట్టతల” చూసింది
* ఇలా నా చేత రక్ష..రక్ష..అంటు..”ప్రతిజ్ఞ”చేపించి… అనవసరంగా వారిపై,నాకు.. కక్ష పెంచుకునేలా చేసారు..
* అయినా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్…..ఎందుకంటే మా ఇద్దరికి మ్యాథ్స్ రాదు……

And the joint winners are …

* చదువుతుంటే అసహ్యంగా లేదూ, గుండె మండిపోవడం లేదూ!సాటి మనిషిని మనిషిగా గౌరవించలేని బూజు భావాలకు ‘కులమని ‘ పేరా?
* “బ్లాక్ బాక్స్ (విమాన ప్రమాదాలో దొరికేది)కి తెలుగు చెప్పవా” అనడిగాడొక రమేష్చంద్రుడు.”‘ కపిల పేటిక ‘ అని రాసుకో ‘ అని నేను చెప్పగానే అదే రాసి చీవాట్లు తిన్నాడు పాపం

* బస్సువాడు చక్కటి బాలసుబ్రహ్మణ్యం పాట పెట్టాడు..వింటూ అలా ఎప్పుడు నిద్ర పొయ్యనో తెలియదు..కానీ ఎప్పుడూ లేచానో తెలుసు … ఎక్కడినుంచో అస్సహ్యంగా రమణ గోగుల గొంతు వినిపించినప్పుడు
* అసలు ప్రత్యేకమైన కారణాలేవీ లేకుండా.. పాకిస్తాన్ క్రికెటర్లను చూడగానే ద్వేషిస్తుంటారే కొంతమంది మూర్ఖులు…వాళ్ళలో ఒకడిని నేను.
* నాన్సెన్స్ – ఐదు రన్లు కాదు…..సగం రన్నుతో గెలిచినా సరె….గెలిచిన వాడే హేరో..

* ఆ కవర్లు ఇటీ వదినా…ఎన్నింటికెళ్ళాలి?

__________________________________________________________________________
P.S.
1. One blogger gets only one spot/award (sorry gowtham(రెండు రెళ్ళు ఆరు)…)
2. No preference to senior/junior bloggers
3. No Categories
4. Sorry (too) old posts… You know, I keep forgetting
5. Not to be biased (including my all-time favourites చరసాల, కొత్తపాళి, రానారె, ఒరెమూన)
6. 10th spot is reserved for me, at any cost…-)

అక్టోబర్ 8, 2008

ఇచ్చట వాటర్ లూజుగా అమ్మబడును

Filed under: హాస్యం — శ్రవణ్ @ 1:28 సా.
Tags:

మావూళ్ళో ఎండలెక్కువ.

నా చిన్నప్పటిమాట. ఇంట్లో ఆడవాళ్ళు తెల్లారకుండానే బిందెలతోనో, మగవాళ్ళు తెల్లారాక కావిడితోనో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు. అప్పట్లో మంచినీళ్ళు (తాగడానికి వాడే నీళ్ళు) తెచ్చుకోవడం పెద్ద ప్రహసనం. ఋతువుని బట్టీ, ఇంట్లో మనుషులకున్న వీలును బట్టీ నీళ్ళు తెచ్చుకోవడానికి ఒక షెడ్యూలు ఉండేది. ఎండాకాలం సంగతి ఇక చెప్పనఖ్ఖర్లేదు. ఎండాకాలం వస్తే వూరిపెద్ద పేరునో, ఆమధ్యనే పోయిన వేరెవరిపేరునో చలివేంద్రాలు వెలిసేవి.

ఇక ఇప్పటి మాట. జనాలకి డబ్బులెక్కువయ్యాయో, ఇంటికెళ్ళే దాకా ఆగలేరో తెలియదు. దారిలో బంధువుల ఇంట్లో నీళ్ళు తాగటం నామోషీ అయిపోయిందేమో(పల్లెటూళ్ళలో అంతా బంధువులేగా… దగ్గరి వాళ్ళో, దూరపు వాళ్ళో). పైగా ఇప్పుడు నీళ్ళు కష్టపడి చేదుకొచ్చినవీ, మోసుకొచ్చినవీ కాదు. సుబ్బరంగా పంచాయతీ “రక్షిత మంచినీటి పథకం” నించి వచ్చే నీళ్ళు.

ఇప్పుడు మావూళ్ళో అన్నిటి కంటే పెద్ద వ్యాపారం “ఇచ్చట వాటర్ లూజుగా అమ్మబడును” (చిన్న వూరులెండి, అందుకని).

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.